‘Annapurna PhotoStudio’ Movie Revuew

Cinemarangam. Com
బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్,
సినిమా : “అన్నపూర్ణ ఫోటో స్టూడియో”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 21.07.2023
నిర్మాత – యష్ రంగినేని,
రచన దర్శకత్వం – చెందు ముద్దు.
నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్, ఆదిత్య తదితరులు.
సంగీతం – ప్రిన్స్ హెన్రీ,
సినిమాటోగ్రఫీ – పంకజ్ తొట్టాడ,
ఎడిటర్ – డి వెంకట్ ప్రభు,
పీఆర్వో – జీఎస్కే మీడియా,

గతంలో “పెళ్లి చూపులు” వంటి హిట్ సినిమా ని అందించిన టాలీవుడ్ నిర్మాణ సంస్థ బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పతాకంపై “30 వెడ్స్ 21” వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు హీరోగా , లావణ్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు.ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును” అనే ఆసక్తికరమైన క్యాప్షన్ తో పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో వల్గారిటీకి తావులేని స్వచ్ఛమైన కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో`.చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు.ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్, కాన్సెప్ట్, టీజర్,ట్రైలర్, లిరికల్ పాటలకు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన సినిమా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో ”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
గోదావరి పక్కన కపిలేశ్వరపురం అనే ఊరిలో అన్నపూర్ణ ఫోటో స్టూడియో నడుపుకుంటూ పెళ్లి విడియోలు తీసుకునే చంటి(చైతన్య రావు) కు నలభై ఏళ్లు వచ్చినా ఇతనికి పెళ్లవ్వదు. తను ఇష్టపడ్డ అమ్మాయిలందరి పెళ్లిళ్లు అవుతున్నా తనకు మాత్రం పెళ్లి కావడం లేదని బాధ పడుతుంటాడు. అయితే తనకు ఓ ఫంక్షన్‌లో గౌతమి (లావణ్య) ను చూసిన మొదటి చూపులోనే తనతో ప్రేమలో పడతాడు.తన గురించి ఎంక్వయిరీ చేస్తే తన చెల్లి పద్దూ (ఉత్తర రెడ్డి) ఫ్రెండ్‌ అని తెలుసుకుంటాడు. దాన్ని ఆసరాగా చేసుకుని రోజూ ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అయితే కొన్ని అపార్ధాల తర్వాత చంటి చాలా మంచివాడని తెలుసుకొని ఆమె కూడా ఇతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.కొన్ని రోజుల తర్వాత చంటి జాతకం ప్రకారం అతని ప్రాణానికి ప్రమాదం ఉందనే విషయం గౌతమికి తెలుస్తుంది. అటు తర్వాత అనుకోకుండా చంటి ఓ వ్యక్తిని హత్య చేస్తాడు? ఆ టైంలో తీసిన ఫొటోలతో జగదీష్‌ (యష్‌ రంగినేని) అనే వ్యక్తి అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఫారెన్‌ నుంచి వచ్చిన సంధ్య (మిహిర) అనే అమ్మాయిని హత్య చేయాలని డిమాండ్ చేస్తాడు? దీంతో సంధ్యను కొండమీదకు పిలిచి అక్కడనుండి కిందకు తోసి చంపాలని ప్లాన్ చేస్తాడు చంటి. అయితే అనూహ్యంగా కొండమీద నుండి చంటి దూకేయడంతో అటుగా వెళ్తున్న పోలీసుల జీపుపై పడతాడు.అదే టైములో అతను రాసిన సూసైడ్ నోట్ కూడా పోలీసులకి లభిస్తుంది. చివరికి పోలీసులు అతనికి ఏ విధంగా సాయపడ్డారు? అసలు చంటి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? సంధ్యను హత్య చేశాడా? సంధ్యను చంపమని చెప్పిన జగదీష్ కు చంటి ఎలాంటి గుణపాఠం నేర్పాడు.? అసలు వీటన్నిటికీ ఉన్న లింక్ ఏంటి? చంటి, గౌతమిల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
చంటి పాత్రలో హీరోగా నటించిన చైతన్య రావు`30వెడ్స్ 21` వెబ్‌ సిరీస్‌తో ఏజ్ బార్ క్యారెక్టర్లలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు`అన్నపూర్ణ స్టూడియో`లో కూడా తన ఏజ్‌కి తగ్గ పాత్రలో చంటి ఒదిగిపోయాడు.తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో చాలా చోట్ల.. నవ్వించాడు. అలాగే వింటేజ్‌ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. చంటి ప్రియురాలుగా గౌతమి పాత్రలో నటించిన హీరోయిన్ లావణ్య విలేజ్‌ అమ్మాయిగా చాలా చక్కగా తనదైన నటనతో మెప్పించింది. జగదీష్‌ పాత్రలో విలన్ గా నటించిన నిర్మాత యష్ రంగినేనికి ఇది మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న నటుడిలానే చాలా బాగా నటించాడు. సీరియల్ నటిగా పాపులర్ అయిన ఉత్తర రెడ్డి పద్దూ పాత్రలో చంటికి గయ్యాలి చెల్లిగా చాలా బాగా యాక్ట్ చేసింది.చంటి ఫ్రెండ్‌ పండు పాత్రలో వైవా రాఘవ కామెడీ అలరిస్తుంది. వాసు ఇంటూరి కానిస్టేబుల్ గా కనిపించి అక్కడక్కడా నవ్వించాడు.ఫారెన్‌ నుంచి వచ్చిన అమ్మాయి పాత్రలో సంధ్యగా నటించిన మహిర, లలిత్ ఆదిత్య తదితర నటీనటులు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఇటీవల కాలంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందే చిత్రాలు ఆడియెన్స్ కి మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.”ఓ పిట్ట కథ’ సినిమా తర్వాత మరోసారి 1980 గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథనే ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు చెందు ముద్దు.వల్గారిటీకి తావులేని స్వచ్ఛమైన కామెడీతో పెళ్లికాని ప్రసాద్ లాంటి పాత్రకి వినోదాన్ని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించడంలో దర్శకుడు చెందు ముద్దు చాలా వరకు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు..

ప్రిన్స్ హెన్రీ అందించిన మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. మ్యూజిక్ తో పాటు తన వాయిస్ తో కూడా హెన్రీ బాగా మెప్పించారు. ముఖ్యంగా లిప్సిక గొంతు పాట కి బాగా సూట్ అయ్యింది.“ఓ ముద్దుగుమ్మ” అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఇది ఒక రొమాంటిక్ పాట. శ్రేష్ఠ అందించిన లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఇలా ఇందులోని పాటలన్నీ బాగున్నాయి. వింటేజ్‌ సంగీతం, బీజీఎం కూడా బాగుంది. సినిమాటోగ్రాఫర్ పంకజ్ తొట్టాడ అందించిన విజువల్స్ కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై నిర్మాత యష్‌ రంగినేని ఎక్కడా రాజీ పడకుండా .పీరియాడిక్ సినిమాను సెలెక్ట్ చేసుకొని నిర్మించిన విలువలు చాలా రిచ్ గా బాగున్నాయి గ్రామీణ నేపథ్యం సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం “అన్నపూర్ణ ఫోటో స్టూడియో` సినిమా కచ్చితంగా నచ్చుతుంది. గో & వాచ్

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here