ప్రతి ఆర్టిస్టు స్టూడెంట్ లా వెళ్ళాలి..దేవీప్రసాద్

సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తోలుబొమ్మలాట’. దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం లోఓ కీలక పాత్ర చేసిన నటుడు మరియు దర్శకుడు దేవి ప్రసాద్ ఇంటర్వ్యూ.

ఇందులో ఏదీ ఆట ఏది బొమ్మ మూవీ గురించి చెప్పండి?
👉ఇందులో నేను పెద్దాయనకు కొడుకు గా,నాకు ఒక కొడుకు ఉంటాడు ఆయనే హీరో ఇందులో కుటుంబ బంధాల పైన ఉండే విలువ తెలియ చేస్తున్నాం.విశ్వనాథ్ బాగా హ్యాండిల్ చేసాడు. మన షులలోని మంచి చెడులను, వాటి వలన కుటుంబంలో ఏర్పడే సమస్యల ఇతివృత్తం గా తెరకెక్కింది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన ప్రేమ కథ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.

దర్శకుడు కొత్తవారైనా విశ్వనాథ్ మాగంటి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

👉ఒక నూతన దర్శకుడు లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు, కానీ విశ్వనాధ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నారు. తాను తీసిన సినిమా చూసి నలుగురు మంచి సినిమా చూశాం అని మెచ్చుకుంటే చాలు అనుకొనే తత్త్వం కల కుర్రాడు. దర్శకుడిగా అంత మంది సీనియర్ నటులను చక్కగా హ్యాండిల్ చేశారు.

డైరెక్టర్ గా మీకున్న అనుభవంతో ఈ డైరెక్టర్ కు మీరేమైన సలహాలు ఇచ్చారా ?
👉నేను ఒక స్టూడెంట్ గా వెళ్తాను, యాక్టర్ గా వెళ్ళినపుడు ఒక వైట్ పేపర్ ల వెళ్ళాలి డైరెక్టర్ ఏది చేప్తే అది చేస్తాను. , డైరెక్టర్ మంచి రైటర్ మంచి డైలాగులు రాసుకున్నాడు,సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు.

ఇందులో నెగెటివ్ టచ్ ఏమైనా ఉందా ?
👉ప్రతి మనిషి లో గుడ్,బ్యాడ్ ఉంటాయి,ఎవ్వరు తీవ్రమైన నెగెటివ్ ఉండరు,కానీ కొంచెం నెగెటివ్ ఉంటుంది అదే ఇందులో చూయించాడు.

రాజేంద్ర ప్రసాద్ తో చేసిన అనుభవం ఎలా ఉంది?
👉రాజేంద్ర ప్రసాద్ గారితో చేయాలని ఎప్పటి నుండో నాకు కోరిక ఉండేది. అది ఈచిత్రంతో నెరవేరింది. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ నటులు ఉన్నారు. వారందరితో కలిసి చేసిన ప్రయాణంలో నాకు తెలియని అనేక విషయాలు నేర్చుకున్నాను.

తోలు బొమ్మలాట చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
👉ఒక విలేజ్ లో పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. అలాగే మనం, మన సంపాదన, భవిష్యత్తు అని అనే నేటి తరం ఆలోచనా ధోరణి ఉంటుంది. అలాగని స్వార్ధం కూడుకున్న నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాదు. సాధారణంగా అన్ని కుటుంబాలలో కనిపించే సహజమైన స్వభావం కలిగి ఉంటుంది.

నటుడిగానే కంటిన్యూ అవుతారా? లేక దర్శకత్వం కూడా చేస్తారా?
👉ఇప్పటివరకు నేను 23 సినిమాలు చేసాను ,ఇంకా రిలీజ్ కు 14 సినిమాలు ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి నటుడిగా చేస్తున్నాను. దర్శకత్వంలో ఇదొక యాంగిల్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను. అయితే కచ్చితంగా త్వరలోనే నా దర్శకత్వంలో ఒక సినిమా తీస్తాను. ఒక మంచి సినిమా తీసిపెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్నాను.

నటుడిగా ప్రస్తుతం ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు?
👉శర్వానంద్ శ్రీకారం చిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ‘కాదల్’ అని ఒక సినిమా, ‘ఆయుష్మాన్ భవ’, ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ’22 ‘ , ‘మీటూ’ వీటితో పాటు ఇంకా పేరుపెట్టని మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here