Love & Family Entertainer ‘Asalem Jarigindante’ Movie Review

సినిమారంగం రివ్యూ రేటింగ్ : 3/5
సినిమా : అసలు ఏం జరిగిందంటే
విడుదల : 1/10/2021 (శుక్రవారం)
బ్యానర్ : G S ఫిల్మ్స్ & AR ప్రొడక్షన్స్.
నటీనటులు : మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కాట్రిన్, హరితేజ, షఫీ, ఫణి, శని సాల్మన్, విజయ్ కుమార్, కుమ్నన్ సేతురామన్, ప్రశాంత్. తదితరులు
మ్యూజిక్ : చరణ్ అర్జున్
ఎడిటర్ : ప్రతాప్ కుమార్
పి.ఆర్.ఓ :- కె.వి.కుమార్
కెమెరా : కర్ణ ప్యారసాని
నిర్మాతలు : జి ఎస్ ఫిలిమ్స్
రచన దర్శకత్వం : శ్రీనివాస్ బండారి

G S ఫిల్మ్స్ & AR ప్రొడక్షన్స్. పతాకంపై మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కాట్రిన్, హరితేజ, షఫీ, ఫణి, శని సాల్మన్, విజయ్ కుమార్, కుమ్నన్ సేతురామన్, ప్రశాంత్ నటీనటులు గా శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో
G S ఫిల్మ్స్ & AR ప్రొడక్షన్స్ సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం “అసలు ఏం జరిగిందంటే “.ఈ చిత్రం అక్టోబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ :
చిన్నప్పటి నుండి ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వాసు అండ్ సావిత్రి ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి చేసుకోవాలను కున్న వాళ్ళకి యాక్సిడెంట్ వలన సావి చనిపోవడం, వాసు గతం మర్చిపోవడం… ఆ తరువాత కొంతకాలానికి వాసు లైఫ్ లోకి సావి అనే పేరుతో మరొక అమ్మాయి రావడం, గతం మర్చిపోయి ఇబ్బంది పడుతున్న వాసుని తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వుంటుంది. ఇక్కడ రెండోసారి వాసు లైఫ్ లోకి వచ్చిన సావి ఎవరు.? తనకు వాసుకి మధ్య ఉన్న కథ ఏంటి.? వాసు అండ్ సావి కి యాక్సిడెంట్ ఎలా జరిగింది.? చివరికి వాసు అండ్ సావి ల స్వచ్ఛమైన ప్రేమకథ సుకాంతం ఎలా అయింది అనేది మిగతా కథ. అది ఖచ్చితంగా 70MM స్క్రీన్ మీదనే చూడాలి.

నటీనటుల పనితీరు
హీరోయిన్స్ కారోన్యా కట్రీన్, కారుణ్య చౌదరి అండ్ శ్రీ పల్లవి లు తమ పరిధి మేర బాగా నటించి సినిమాకు గ్లామర్ తో పాటు ప్రేక్షకులకు మంచి నటనను కనబరిచారు.ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ నటన గురించి, వాసు రోల్ లో మహేంద్రన్ సెటిల్డ్ యాక్టింగ్ ని కనబరచి సినిమాను ప్రేక్షకులకు బాగా నచ్చేలా చేసాడు అని చెప్పుకోవచ్చు. మిగిలిన నటీనటులు త‌మ త‌మ పాత్ర‌ల‌ను ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
డైరెక్టర్ శ్రీనివాస్ బండారి  తాను రాసుకున్న కథను  కథకు పూర్తి న్యాయం చేసాడు. మరీ ముఖ్యంగా ఇలాంటి కథకు స్క్రిన్ ప్లే అండ్ కనెక్టెడ్ లాజిక్కులు చాలా అవసరం, వాటిని ఎక్కడా మిస్ అవ్వకుండా బాగా డైరెక్ట్ చేసి ముందు ముందు మంచి సినిమాలు ఇండస్ట్రీ కి అందించగల దర్శకుడిగా తన స్టామినా ఏంటో చూపించారు. ప్రేమకు మరణం లేదు” అనే బ్యాక్డ్రాప్ లో కథ రాసుకున్న దర్శకుడు శ్రీనివాస్ బండారి ఆ సినిమాను మెయిన్ గా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి చిత్రీకరించారు. ఒక యాక్సిడెంట్ లో తను ప్రేమించిన అమ్మాయిని, తన గతాన్ని ఒకేసారి కోల్పోయిన వాసు కథ ఇది. అలాంటి వాసు జీవితం ఎలా టర్న్ తీసుకుంది. వాసుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సావి తన ప్రేమికుడు వాసుని వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేది చాలా ఫ్రెష్ గా వుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు సాహిత్యం పరంగా అండ్ మ్యూజిక్ పరంగాను బాగా అలరిస్తాయి.  కామెడీ కనిపించినప్పటికీ కథకు అటాచ్ అయి సినిమా చూస్తున్న మనల్ని నెక్స్ట్ ఎమ్ జరుగుతుంది అనే సస్పెన్స్ బాగా కట్టిపడేస్తుంది. మొత్తానికి చిన్న సినిమా అంటే వల్గర్ మాటలు, అందాలు ఆరబోస్తూ బట్టలు, ఫ్యామిలీ కి ఛీ ఛీ అనిపించే సినిమాలు అని ముద్రపడ్డ ప్రస్తుత టైం లో ఈ అసలు ఏం జరిగిందంటే సినిమా మాత్రం యూత్ తో పాటు ఫ్యామిలీ కి కూడా బాగా నచ్చేస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి. వాటితో పాటు మనం వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ లేదా సీటు బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అనే సందేశాన్ని అంతర్లీనంగా మనకు తెలియజేసారు డైరెక్టర్. దానితో పాటు నీ ప్రేమలో నిజాయతి ఉంటే సృష్టి సైతం నీ ప్రేమను నీకు మరింత దగ్గర చేయడానికే ప్రయత్నిస్తుంది అనే అంశాన్ని క్లుప్తంగా చెప్పారు.  కెమెరా మ్యాన్ కర్ణ ప్యారసాని వర్క్ బాగుంది, సినిమాను రిచ్ గా ప్రజెంట్ చేసారు . మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఈ సినిమాకు తన సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సైతం ప్రాణం పోసాడు .. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే నిన్ను అడిగే అనే పాట అయితే థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది. ఇక ఎడిటర్ పనితీరు బాగుంది.ఈ చిత్ర నిర్మాతలు  ఖర్చుకు వెనకాడకుండా తీసిన నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా ఉన్నాయి ఫ్యామిలీ సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు బాగా నచ్చే ప్రేక్షకులు వెళ్లి హ్యాపీ గా సినిమా చూసి ఒక మంచి కంటెంట్ అండ్ హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ సినిమా చూసాము అన్న ఫీలింగ్ తో బయటకు వస్తారు.  అలాగే  ఈ సినిమా చూసిన  ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది.

Cinemarangam Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here