‘Average Student Nani’ Movie Review (youthful love, action, and family entertainer)

Cinemarangam.Com
బ్యానర్ : శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి 
సినిమా : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 02.08.2024
నిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్
రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
తారాగణం: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
DOP: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: ఉద్ధవ్ SB,
సాంగ్స్ కొరియోగ్రఫీ : రాజు మాస్టర్
ఫైట్స్: నందు
PRO: ఎస్ ఆర్ ప్రమోషన్స్ , Sai Satish

టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. ఆడియెన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాలను సైతం ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకులు హీరోలుగా.. హీరోలు దర్శకరచయితలుగా మారుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు.ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. . శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.
 

కథ
.ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న నాని (పవన్ కుమార్) చదువుల్లో యావరేజ్ స్టూడెంట్. అయితే.. తన తండ్రి మాత్రం తను యావరేజ్ కాకుండా.. బ్రిలియంట్ స్టూడెంట్ గా ఇంట్లో వాళ్లకు మంచి పేరు తీసుకురావాలని ఆరాటపడుతుంటాడు. కానీ నాని మాత్రం చదవును పక్కనపెట్టి కాలేజ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను తనకు సీనియర్ అయిన సారా (స్నేహ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో అతని జీవితంలో అనుకోని సంఘటన జరగుతుంది. ఈ నేపథ్యంలో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ క్రమంలో కాలేజీలో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని.. జీవితంలో సక్సెస్ అందుకున్నాడా.. ? లేదా అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
కాలేజీ కుర్రాడి గా నాని పాత్రలో కుమార్ ఒదిగిపోయాడు. నిజ జీవితంలో ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ఉంటాడో తెరపై అలాగే కనిపించాడు. తల్లి, తండ్రులు, చెల్లి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ , హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ రొమాన్స్ మరియు యాక్షన్ సీన్స్ లలో బాగా నటించాడు.. గ్లామర్ గాల్స్ స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్‌ లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తమ అందంతో, అభినయంతో ప్రేక్షకులకు మత్తు ఎక్కిచ్చేలా అద్భుతంగా నటించేశారు. రాజీవ్ కనకాల, ఝాన్సీ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
యూత్‌కి కావాల్సిన రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ  కాలేజ్ కుర్రాడంటే జాలీగా ఉండటమే కాకుండా వారు ఎదుర్కొనే ఛాలెంజింగ్స్, తద్వారా తల్లిదండ్రుల పడే బాధ, ఆవేదన, ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌ను ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, ఎమోషన్ సీన్స్ ను మిక్స్ చేస్తూ సినిమాను ఎంగేజ్ చేయడంలో దర్శకుడుగా పవన్ సక్సెస్ అయ్యాడు.
‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి’,, ‘కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌తో బాగా పేలాయి. మరియు సారా సారా అంటూ సాగే మెలోడీ పాట మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా ఎంతో వినసొంపుగా ఉంది.ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తిక్ బి కొడకండ్ల ఇచ్చిన ఆర్ఆర్, మ్యూజిక్ చాలా బాగుంది .సినిమాటోగ్రఫర్ సజీష్ రాజేంద్రన్ ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఉద్ధవ్ సబ్ ఇచ్చిన ఎడిటింగ్ పనితీరు బాగుంది. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్ లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. యూత్ కు కావలసిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాకు యావరేజ్ అని పెట్టారు. కానీ ఇది థియేటర్లో యాత్ కు మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ అవుతుందని చెప్పచ్చు.

Cinemarangam.Com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here