‘Average Student Nani’ Pre-release event held grandly, Movie Releasing on August 2nd

మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి ఈ సారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అంటూ దర్శకుడిగా, హీరోగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
 *పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ..* ‘రెండేళ్లుగా ఈ కథతో ప్రయాణం చేశాను. తల్లి అంటే ఝాన్సీ, తండ్రి అంటే రాజీవ్ కనకాల గారే అనుకున్నా. లక్కీగా నాకు వాళ్లే దొరికారు. కాలేజ్‌ అంటే రకరకాల కారెక్టర్లు కనిపిస్తాయి. నాని పాత్రలో జెన్యూనిటీ ఉంటుంది. కాలేజ్ కుర్రాడంటే జాలీగా ఉంటాడని అంతా అనుకుంటారు. కానీ అదే ఛాలెంజింగ్ ఫేజ్. పిల్లలు, తల్లిదండ్రుల పడే బాధ, ఆవేదన ఇలా అన్నీ చూపించాను. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌ను చూపించాను. నేను స్నేహ, సాహిబలను డామినేట్ చేద్దామని అనుకుంటే.. వాళ్లే నన్ను డామినేట్ చేసేశారు. దర్శకుడిగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. రొమాంటిక్ సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించింది. కార్తీక్ మంచి ఆర్ఆర్ ఇచ్చాడు. సాజిష్ అద్భుతంగా చూపించారు. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఆగస్ట్ 2న రాబోతున్నాం. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 *హీరోయిన్ సాహిబ బాసిన్ మాట్లాడుతూ..* ‘ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. టాలీవుడ్‌లో ఇదే నా మొదటి చిత్రం. నన్ను నమ్మి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్ గారికి థాంక్స్. సాజీష్ సర్ మా అందరినీ అందంగా చూపించారు. కార్తీక్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆగస్ట్ 2న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 *హీరోయిన్ స్నేహా మాల్వియ మాట్లాడుతూ..* ‘ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన నా హీరో, డైరెక్టర్, నిర్మాత పవన్ గారికి థాంక్స్. సహిబతో పని చేయడం ఆనందంగా ఉంది. మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ, సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థాంక్స్. అందరికీ ఈ మూవీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఆగస్ట్ 2న మా చిత్రం రాబోతోంది’ అని అన్నారు.
 *నటి ఝాన్సీ మాట్లాడుతూ..* ‘యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాల్లో నటించినా.. ఈ సినిమా ఈవెంట్‌కు వచ్చాను. పవన్ కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చాను. యావరేజ్ స్టూడెంట్ నాని ఎలా ఉన్నా.. ఆ నాని తల్లి కూడా ఇలానే ఉంటుంది.. ప్రతీ తల్లికి తన నాని తప్పు చేయడనే నమ్ముతుంది. ఫోన్‌లోనే కథ చెప్పాడు. సరైన టీంను వెతికి పట్టుకున్నాడు. నానికి తన రైటింగ్ మీద నమ్మకం ఉంది. సినిమా చూసిన తరువాత నాని కథ, పవన్ గురించి అందరికీ అర్థం అవుతుంది. ఆగస్ట్ 2న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 *మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి కొడకండ్ల మాట్లాడుతూ..* ‘పవన్‌తో ఇది వరకు నేను మెరిసే మెరిసే చిత్రానికి పని చేశాను. ఈ చిత్రంలోనూ మంచి పాటలు పడ్డాయి. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా పెద్ద విజయం అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 *ఎడిటర్ ఉద్దవ్ మాట్లాడుతూ..* ‘విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించేశారు. సాంగ్స్ బాగా వచ్చాయి. ఇలా అన్నీ అద్భుతంగా వచ్చాయి. టైటిల్ మాత్రం యావరేజ్ అని పెట్టారు. కానీ ఇది థియేటర్లో బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని అన్నారు.
 *కెమెరామెన్ సజీష్ రాజేంద్రన్ మాట్లాడుతూ..* ‘పవన్ నాకు పూర్తి స్క్రిప్ట్ ఇచ్చారు. కథ చదివాక నాకు బాగా నచ్చింది. పవన్‌కు, నాకు సేమ్ సెన్సిబిలిటీస్ ఉన్నాయనిపించింది. హీరోయిన్స్ అద్భుతంగా ఉన్నారు.  ఈ మూవీ షూటింగ్ ఎంతో సరదాగా సాగింది. పవన్ అందరినీ కంఫర్టబుల్‌గా చూసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 *అనుదీప్ దేవ్ మాట్లాడుతూ..* ‘కార్తీక్ నాకు మంచి  స్నేహితుడు. ఈ సినిమాలో ఓ పాటను పాడాను. నాకు అవకాశం ఇచ్చిన పవన్ గారికి థాంక్స్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here