Beautiful Romantic Entertainer ‘Dear Megha’ Movie Review

Cinema rangam. com..Rating..3.25/5
Release Date: September 3, 2021
Banner: Vedaansh Creation Works
Cast: Arun Adith, Arjun Somayajulu , Megha Akash, Pavithra Lokesh
Cinematography: I Andru
Editor: Prawin Pudi
Art Director: PS Varma
PRO: GSK Media
Music Director: Hari Goura
Producer: Arjun Dasyan
Director: Sushanth Reddy

వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తొలి చిత్రంగా డియర్ మేఘను నిర్మించారు నిర్మాత అర్జున్ దాస్యన్. మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ ఎమోషనల్  సెన్సిటివ్ ట్రయాంగిల్  లవ్ స్టోరిగా తెరకెక్కిన “డియర్ మేఘ” ఈ నెల 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
మేఘ(మేఘా ఆకాష్),.అర్జున్(అర్జున్ సోమయాజులు) ఇద్దరూ కాలేజ్ మేట్స్. మేఘా.. అర్జున్ ని  ప్రేమిస్తుంటుంది. అయితే ఆ విషయం అర్జున్ ముందు చెప్పలేక  భయపడిపోతుంటుంది అలాగే అర్జున్ కూడా మేఘాను కు ప్రేమిస్తుంటాడు.ఇలా ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించు కున్నా కూడా వారు తమ ప్రేమను చెప్పుకోలేక పోతుంటారు. చివరకు ధైర్యం తెచ్చుకొని అర్జున్ మేఘా కి ప్రేమిస్తున్న విషయం చెబుతాడు.  ఇలా ఒకరినొకరు బాగా ఇష్టపడి ప్రేమించుకున్న జంట జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? మేఘా జీవితంలోకి అదిత్ ఎలా వచ్చాడు?అతన్ని మేఘ ఎందుకు ప్రేమిస్తుంది? అర్జున్.. అదిత్ ల లవ్ స్టొరీ సక్సెస్ అయ్యిందా లేదా అనే తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…!!!

నటీనటుల పనితీరు
రాజ రాజ చోర’లో అన్యాయానికి గురైన అమ్మాయిగా నటించిన మేఘా ఆకాష్ ఇందులో టైటిల్ రోల్ పోషించి  ఈ పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్ అని నిరూపించింది. టీనేజ్ లవ్ స్టొరీలోనూ… అడల్ట్ లవ్ స్టొరీలోనూ వెరీయేషన్ చూపించి  తన హావ భావాలతో అద్భుతమైన నటనను కనపరచింది. గరుడ వేగ’ మరియు ’11 th అవర్’ సినిమాలలో భావోద్వేగ సన్నివేశాలలో నటించి మెప్పించిన ఆదిత్ అరుణ్ ఈ సినిమాలో తన ఎనర్జీ లెవల్స్ తో స్టోరీని ముందుకు నడిపించడమే కాకుండా ఆడియన్స్ బాగా గుర్తుంచుకొనే పాత్రలో నటించి మెప్పించాడు. తల్లీ కొడుకుల మధ్య వచ్చే ప్రేమానురాగాల సన్నివేశాల లోనూ…అదిత్ అరుణ్ చాలా బాగా నటించి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు తన నటనకు థియేటర్ లో ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. టీనేజ్ లవ్ కథలో నటించిన అర్జున్ సోమయాజులు కూడా మెప్పించారు. మేఘ పై తనకున్న ప్రేమను చెప్పలేని  ఓ టీనేజ్ యువకుని పాత్రలోనూ… ఆ తరువాత  మళ్లీ హీరోయిన్ కి దగ్గరయ్యే ప్రేమికుని పాత్రలో ఆకట్టుకున్నాడు.అర్జున్ సోమయాజుల భవిష్యత్తులో సరైన పాత్రలు వస్తే మంచి నటుడిగా ఎదిగే అవకాశం ఉంది. తల్లి పాత్రలో కనిపించిన పవిత్ర లోకేష్   చాలా చక్కగా నటించి మెప్పించింది. మిగిలిన నటులంతా వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఓక సెన్సిటివ్ ప్రేమ కథను ఎంచుకొని  అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా  తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న కథ… కథనాలు బాగున్నాయి. ఇంతకుముందు తను తీసిన “సూపర్ స్టార్ కిడ్నాప్” తరువాత మంచి కథను రాసుకొని డియర్ మేఘ వంటి సెన్సిటివ్ ట్రయాంగిల్ ప్రేమ కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డైరెక్టర్ సుశాంత్ రెడ్డి… ఇంతకుముందు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం  సాధించిన సినిమాల ప్రేరణ గా తీసుకొని ట్రయాంగిల్ లవ్ స్టోరిస్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాడు. మంచి కంటెంట్ తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మళ్ళీ అలాంటి కథను  ఎంచుకుని  మరోసారి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు  దర్శకులు. ఈ సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా…చాలా చక్కగా తెరకెక్కించాడు . నటీనటుల ఎంపికలో దర్శకుడి టేస్ట్ బాగుంది.మొదటి భాగంలో మేఘా ఆకాష్… అర్జున్ సోమయాజులతో టీనేజ్ లవ్ స్టొరీని నడిపించి… సెకెండ్ హాఫ్ నుంచి అదిత్ అరుణ్ తో అడల్ట్ లవ్ స్టొరీ ని నడిపించి.. ఆ తరువాత వచ్చే రెండు మూడు ట్విస్ట్ లతో మూవీని ఒక సాడ్ ఎండ్ తో శుభం కార్డు వేసిన విధానం ఆడియన్స్ ని భావోద్వేగాలకు గురిచేస్తుంది. అద్భుతమైన కెమిస్ట్రీ కారణంగా అరుణ్ ఆదిత్‌తో మేఘ ఆకాష్ సన్నివేశాలు బాగా పండాయి.. హరి గౌర అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి .ఈ సినిమాకు ఆండ్రూ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు .ప్రవిన్ పూడి ఎడిటింగ్ మరియు పిఎస్ వర్మ ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత అర్జున్ దాస్యం ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.మూవీ ఆద్యంతం ఉత్కంఠను రేపుతూ తెలుగు ఆడియన్స్ ను బోరింగ్ లేకుండా థియేటర్లో కూర్చోబెడుతుంది.ఈ సినిమా ఎక్కడా బోరింగ్ లేకుండా ఓ కొత్త తరహా అందమైన ప్రేమ కథ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ”డియర్ మేఘ” .ఫ్యామిలీతో  పాటు కలసి చూడవలసిన ఈ సినిమా  అందరికీ తప్పక నచ్చుతుంది.

Cinemarangam.com..Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here