Bellamkonda SaiSrinivas interview

ఈ ఏడాది `రాక్ష‌సుడు`తో మంచి హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సినిమా చేస్తున్నారు. జ‌న‌వ‌రి3 బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

రేపు మీ పుట్టిన రోజు క‌దా! జ‌న‌ర‌ల్‌గా ప్రతి పుట్టిన రోజుకి ఎలా ఆలోచిస్తారు?
‍ ‍- కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాననే ఫీలింగ్ తో ఉంటాను. ఇక కొత్తగా ఆలోచించాలి ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటాను.

వయసు పెరిగిపోతుందనే ఫీలింగ్ ఏమి లేదా?
– నాకు మ‌రీ అంత వ‌య‌సు ఎక్క‌వేం కాదు. ఈ సంవ‌త్స‌రం 26వ పుట్టిన రోజు. మరో నాలుగేళ్లు గడిచి ముప్పైలోకి అడుగు పెట్టాక అప్పుడు అనిపిస్తోందేమో వయసు పెరుగుతుంద‌ని ఇప్ప‌టినైతే ఆ ఆలోచ‌న కాని అలాంటి భయాలు కాని ఏమి లేవు.

సంతోష్ శ్రీనివాస్ సినిమా గురించి చెప్పండి?
– అదోక ప్రాప‌ర్ రామ్‌కామ్‌. మంచి లవ్ స్టోరీ అలాగే పూర్తి కామెడీ మూవీ చేస్తున్నాం. లాస్ట్ ఇరవై నిముషాలు తప్ప.. మిగతా భాగం మొత్తం ఫుల్ కామెడీనే ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. మెద‌టి సారి క్యారెక్ట‌ర్ బేస్డ్ ఫిలిం చేస్తున్నాను. సినిమాలో నా అవ‌స‌రానికి తగ్గ‌ట్లు మారుతుంటాను. నా క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉంటుంది.

కామెడీ చేయటం కష్టం అంటారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తోందా?
– అన్ని ఎమోషన్స్ కంటే కామెడీ చేయడం కష్టమే. నా మెద‌టి సినిమా అల్లుడుశీనులో కామెడిచేశాను.
కానీ ఫస్ట్ టైమ్ నేను ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నాను. నా కెరీర్ లో మొదటిసారి ఫుల్ కామెడీ మూవీ చేస్తున్నాను. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారి, నా ట్రాక్ సినిమాలో చాలా బాగుంటాయి. ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్‌.

రాక్ష‌సుడు స‌క్సెస్ త‌ర్వాత క‌థ‌ల ఎంపిక‌లో మీ ఆలోచ‌న ఏమైనా మారిందా?
డెఫినేట్‌గా మారింద‌నే చెప్పాలి. త‌క్కువ సినిమాలు చేసినా జాగ్ర‌త‌గా చేయాలి. రాక్ష‌సుడు సినిమాతో మంచి పేరు వ‌చ్చింది. కమర్షియల్ గా కూడా పెద్ద సక్సెస్ సాధించింది. ఇప్ప‌టినుండి దాన్ని నిల‌బెట్టుకోవాలి. క్వాలిటి మూవిస్ మాత్ర‌మే చేయాల‌నుకుంటున్నా..

రీసెంట్‌గా సిక్స్ ప్యాక్స్ చేశారు మీ సంతోష్ శ్రీనివాస్ తో చేస్తోన్న సినిమా కోసమేనా?
– అలా అనేం లేదండి! రాక్ష‌సుడు షూటింగ్ అయిపోగానే రెండు నెల‌లు యూఎస్ వెల్లి ట్రైనింగ్ అయ్యాను. అలా డైటింగ్ చేసి సిక్స్ ప్యాక్ చేశాను. అలానే నేను ఇంత వ‌ర‌కూ ఎప్పుడూ గ‌డ్డం పెంచ‌లేదు అందరూ పెంచుతున్నారు ఎలా ఉంటుందో చూద్దాం అని నేనూ పెంచాను. కానీ మా డైరెక్టర్ గారు నాకు గెడ్డం వద్దు, పూర్తి యంగ్ లుక్ లో కావాలన్నారు. ఈ సినిమాలో యంగ్ లుక్ లో కనిపిస్తాను.

`రాక్ష‌సుడు` సినిమా నుండి ఏం నేర్చుకున్నారు?
– రాక్ష‌సుడు` సినిమా నుంచి నేను చాల నేర్చుకున్నాను. కంటెంట్ ఈజ్‌ కింగ్ అని ఆ సినిమా నిరూపించింది. సినిమాలో రెండు మూడు కాదు ప్ర‌తి సీన్ బాగుంటేనే సక్సెస్ అవుతుంది. ఇక నుంచి నేను చేయబోయే సినిమాల పై ఖచ్చితంగా `రాక్ష‌సుడు` ప్రభావం ఉంటుంది. అంతలా ఆ సినిమా నా కెరీర్ ను ప్రభావితం చేసింది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒక కొత్త దర్శకుడు మంచి కథతో వస్తే సినిమా చేస్తారా?
– కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. నేను ఇప్పటివరకూ కూడా ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ‘కవచం’ కొత్త దర్శకుడు. అలాగే రమేష్ వర్మ తో ‘రాక్షసుడు’ సినిమా చేశాను. వినాయక్, బోయపాటి, తేజ లాంటి సీనియర్ దర్శకులతో చేసిన సినిమాలు తప్పితే మిగతా వన్ని ఒకటి రెండు సినిమాలు తీసిన దర్శకులతోనే చేశాను. ఇండస్ట్రీ లో కూడా అందరికి అందుబాటులో ఉంటాను.

కథల ఎంపిక విషయంలో మీ నాన్న గారి ప్ర‌మేయం ఎంతవరకు ఉంటుంది?
– హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది. మొదట నాన్నగారే కథ విని ఫిల్టర్ చేసి నాకు పంపుతారు. ఆ తర్వాత ఇద్దరం కూర్చొని ఏది బెటర్ అని డిసైడ్ చేస్తాం. ఆయన క‌థ‌ని బాగా జడ్జ్ చేస్తారు.

మీ సినిమాలకు హిందీ లో మంచి రెస్పాన్స్ ఉంది కదా రెండు భాషలలో సినిమా చేసే ఆలోచన ఉందా?
– మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం. ఒక మంచి కథ దొరకగానే తప్పకుండా ఉంటుంది.

ఈసినిమా ప్రోగ్రెస్ ఏంటి?                             – సినిమా చాలా బాగా వస్తోంది. ఇప్పటికి 20 రోజులు షూటింగ్ అయింది. మార్చి చివరి నాటికి షూటింగ్ పూర్తిచేసి, ఏప్రిల్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, మే నెలలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. వీలైనంత తొందరగా సినిమా పూర్తిచేయాలనేది ప్లాన్.

సంతోష్ శ్రీనివాస్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?
– చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడూ యంగ్ టీమ్ తోనే వర్క్ చేయాలనుకుంటాను. డూడ్లీ అని హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేశారు. మంచి డిఓపి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే నభా నటేష్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.

మీ తమ్ముడు గణేష్ సినిమాకి ఏమైనా ఇంపుట్స్ ఇచ్చారా?
– వాడు నాకే ఇంపుట్స్ ఇచ్చేలా ఉన్నాడు. నాన్న గారితో షూటింగ్ కి ఎక్కువ వెళ్ళేవాడు కాబట్టి అంత బాగా చేస్తున్నాడు. ఈ మద్యే సెట్స్ కి వెళ్ళాను. చాలా ఎక్ట్రార్డినరీ గా చేస్తున్నాడు. ఈ మద్యే సాంగ్ కూడా చూసి ఎమోషనల్ అయ్యాను. త్రీ షేడ్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఆ సినిమాలో అందుకే వేరే వేరే లుక్స్ లో కనిపిస్తాడు. మంచి టీమ్ దొరికింది.

మరి ఈ బర్త్ డేకి ఏమి ప్లాన్ చేశారు?
—ప్రత్యేకంగా ప్లాన్ ఏమి చేయలేదండి. రేపు కూడా షూటింగ్ ఉంది. పైగా కంటిన్యూగా షూట్ చేస్తున్నాం. సో ఈ బర్త్ డే షూటింగ్ లోనే గడిచిపోనుంది. ఇక ఈ ద‌శాబ్దం నాకు కీల‌కంగా ఉండ‌బోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here