Benerjee best actor award in the LIFFT India Filmostav International Film Festival – 2019

ముంబైలోని లోనావాలాలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ సినీ ఫెస్ట్ లిఫ్ట్ ఇండియా ఫిల్మోత్సవంలో  రక్తం చిత్రానికి
గాను ఉత్తమ నటుడిగా తెలుగు బెనర్జీ  అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత  రాజేష్ టచ్ రివర్
రూపొందించారు. సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు
బెనర్జీ కావడం గమనార్హం.
విప్లవం తుపాకులతోనే సాధించాలా? లేక ప్రేమతో కూడా సాధించవచ్చా అనే సంఘర్షణతో సాగే ఈ
చిత్రం ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. ఇందులో శంకరన్న పాత్రలో విప్లవ నాయకుడిగా బెనర్జీ కనబరిచిన ప్రతిభకు
చిత్రోత్సవాలలో చక్కటి ఆదరణ లభించింది.
గతంలో అమెరికాలోని ఓహియోలో జరిగిన ఇండీ గేదరింగ్ అంతర్జాతీయ
చిత్రోత్సవంలో కూడా ఆయన పోషించిన ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా నామినేట్ అయిన
తొలి భారతీయ నటుడు బెనర్జీ కావటం విశేషం.  అంతేకాక’రక్తం‘ ఉత్తమ చిత్రంగా,  ఉత్తమ సినిమాటో గ్రఫీ అవార్డులను
సొంతం చేసుకుంది. బెస్ట్ ఎడిటింగ్, ఉత్తమ చిత్రం విభాగాలలో  పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు నామినేట్ అయ్యింది.

ఈసందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ ’ ఇప్పటి వరకు 40 ఏళ్లలో 400 సినిమాల్లో  నటించానని,లిఫ్ట్ ఇండియా
చిత్రోత్సవానికి 40 దేశాల నుంచి  250 సినిమాలు వచ్చాయని, వాటిలో తనకే ఉత్తమ నటుడిగా గుర్తింపు దక్కడం
ఆనందంగా ఉందన్నారు. తన సినిమా కెరీర్ లో ‘రక్తం’ చిత్రం మైలు రాయిలా నిలిచిపోయిందన్నారు. ఈ అవార్డు నటుడిగా
తన బాధ్యతను మరింత పెంచెందని అన్నారు.

ఈ సినిమాలో ఇంకా సంజు శివరామ్, మధుశాలిని, సన, జాన్ కొటోలి ,
హరిశ్చంద్ర, సత్యవతి, తదితరులు నటించారు. దీనికి  మాటలు: నరసింహ కుమార్, సంగీతం వివేక్ మహదేవ్,  ఆర్ట్: రాజీవ్
నాయర్, ఎడిటింగ్: శశికుమార్, కెమెరా: రామ తులసి, నిర్మాతలు:  పద్మశ్రీ గ్రహీత డా.. సునీతా క్రుష్ణన్,  సహ నిర్మాత:
మున్సీ రియాజ్ అహమ్మద్. స్టోరీ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here