‘Bhagat Singh Nagar’ in post production programs.

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్ ముఖ్య పాత్ర‌ల్లో గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ పై వాలాజా క్రాంతి ద‌ర్శ‌క‌త్వంలో రమేష్ వుడత్తు నిర్మాతగా తెలుగు ,తమిళ భాష‌ల‌లో రూపొందుతున్న చిత్రం `భగత్ సింగ్ నగర్`. భగత్ సింగ్ నగర్ లో జరిగిన ఒక ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా..

నిర్మాత రమేష్ వుడత్తు మాట్లాడుతూ...భగత్ సింగ్ నగర్(తెలుగు & తమిళ్) సినిమాను గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్పై నిర్మించినందుకు గర్వంగా ఉంది. భగత్ సింగ్ నగర్ లో జరిగిన ఒక ప్రేమకథ ను దర్శకుడు అందంగా చూపించారు. దర్శకుడు వాలాజా క్రాంతి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశాను. నా రెండో సినిమా కూడా వాలాజా క్రాంతి తోనే చెయ్యబోతున్నాను“ అన్నారు.

డైరెక్టర్ వాలాజా క్రాంతి మాట్లాడుతూ...భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక అందమైన ప్రేమకథ ఇది. భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుంని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో తీసుకొస్తాం“అన్నారు…

తారాగ‌ణం : విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య

సాంకేతిక నిపుణులు : ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, పి ఆర్ ఓ : తేజస్వి సజ్జా ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ వుడత్తు, కథ-కథనం, దర్శకత్వం : వాలాజా క్రాంతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here