Bigg Boss fame VJ Sunny’s Family Entertainer ‘Sakala Gunabhi Rama’ Movie Review

Cinemarangam.com
Review Rating : 3/5
చిత్రం : “సకల గుణాభి రామ”
బ్యానర్ : E.I.P.L
డైరెక్టర్ : వెలిగొండ శ్రీనివాస్
నిర్మాత : సంజీవ్ రెడ్డి
నటి నటులు : వి జె సన్నీ, అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సోనీ సరయూ. చమ్మక్ చంద్ర,మహేష్ విట్ట, చందన తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనుదీప్
కెమెరా మాన్ : నళిని కాంత్
ఎడిటర్ : వెంకట్

E.I.P.L పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ వి.జే సన్నీ, శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్, నటీనటులుగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “సకల గుణాభి రామ”. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్,పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రిలీజ్  చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సకల గుణాభి రామ” చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రామ్ (వి జె సన్నీ),పేరుకు రాముడైనా తన మనసు మాత్రం అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది.అయితే ఒకానొక సందర్బంలో రామ్ క్రిస్టియన్ అమ్మాయి నాన్సి ని చూసి ఇష్టపడతాడు. మొదట్లో నాన్సీ కి ఇష్టం లేకపోయినా తను సిన్సియర్ గా తన వెంట పడుతున్న రామ్ ని ఇష్టపడుతుంది.అయితే ఒకరోజు రామ్ నువ్వంటే ఇష్టం, నిన్ను లవ్ చేస్తున్నాను అంటాడు.నా వెంటరావడం ఆపి నీ లవ్ ని చెత్తబుట్టలో పడేయ్యి.ఎందుకంటే నువ్వు హిందు మేము క్రిస్టియన్స్ అంటుంది. అప్పుడు రామ్ చెప్పిన మాటలకు ఇంప్రెస్స్ అయిన నాన్సి నిజంగా నన్ను లవ్ చేస్తే మా ఇంటికి వచ్చి మా అన్న (జెమినీ సురేష్), వదిన(సోనీ ) లతో మాట్లాడమంటుంది. ఆ తరువాత రామ్ తన పేరెంట్స్ తో వచ్చి మాట్లాడగా జెమినీ సురేష్ ఒప్పుకోడు.చివరికి వారిని ఒప్పించి పెళ్లిచేసుకుంటారు. ఆ తరువాత నాన్సీ స్వాతి గా మారుతుంది.మరో వైపు భయ్యా గా పిలవబడే (శ్రీ తేజ్) అవసరం ఉన్న వారికి ఫైనాన్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలో బాయ్ దగ్గర రామ్ ఫైనాన్స్ తీసుకొంటాడు. ఆలా అప్పులు చేస్తూ రక రకాల కష్టాలతో ఫైనాన్సియల్ గా ఇబ్బందులు పడుతుంటాడు.సకల గుణాభి రాముడు అనుకున్న స్వాతికి రామ్ బిహేవియర్ లో మార్పు రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగినా రామ్ లో మార్పు రాకపోవడంతో స్వాతి తన పుట్టింటికి వెళుతుంది.తను వెళ్ళగానే రామ్ తన లైఫ్ లొకి కోటేశ్వరురాలైన దీపిక (తరుణీ సింగ్) ని ఆహ్వానిస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి ద్వారా రామ్ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫెస్ చేశాడు? రామ్ తన ఆర్థిక కష్టాల నుండి ఎలా బయట పడ్డాడు?, దీపిక తన లైఫ్ లొకి రావాడిని కారణమేంటి, తనని రామ్ ఎలా వదిలించుకున్నాడు?, చివరికి రామ్, స్వాతి లు ఒక్కటయ్యారా లేదా? అనేది తెలుసుకోవాలంటే “సకల గుణాభి రామ” సినిమా చూడవలసిందే

నటీ నటుల పనితీరు
“సకల గుణాభి రాముడిగా “రామ్ (వి జె సన్నీ)ఒక వైపు రొమాన్స్ పండిస్తూనే.. మరో వైపు ఆర్థిక కష్టాలతో నలిగిపోయే వ్యక్తిగా మరో షేడ్ ఉన్న పాత్రను తన పరిది మేరకు చాలా చక్కగా పోషించాడు. జనరల్ గా ఈ తరహా పాత్రలను యూత్ హీరోలు చెయ్యాలి అంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. దానికి మంచి మెచ్యూరుటీ లెవెల్స్ కావాలి. కానీ సన్నీ తన మెచ్యూరుటీ లెవెల్స్ తో తన పాత్రను రక్తి కట్టించాడు. ఫైనాన్సియర్ పాత్రలో (శ్రీ తేజ్) పాత్ర అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ఆషిమా నర్వాల్ క్రిస్టియన్ గా ఉన్నపుడు నాన్సీ గా, పెళ్లయ్యాక స్వాతి గా చక్కటి అభినయాన్ని ప్రదర్శిస్తూ తన కిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది. సన్నీ పాత్రకు ఈ అమ్మాయి నటన తొడవ్వడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.స్వాతి అన్న వదినలుగా జెమిని సురేష్, సోనీ లు బాగా నటించారు. దీపిక పాత్రలో తరుణీ సింగ్ రొమాన్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చమ్మక్ చంద్ర ,మహేష్ విట్టల కామెడీ ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇంకా ఇందులో షాలిని గా,సోఫి గా నటించిన వారంతా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
సకల గుణాలు కలిగిన రాముడు అయినా భర్తతో భార్య భర్తల మధ్య ఎమోషన్స్, రొమాన్స్ మరియు కామెడీ  ని జోడిస్తూ కొత్త టెక్నిషన్స్ తో దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఎంతపని చేసినడు ముదనష్టపు మొగుడు బొంబాయి అమ్మేశాడు పాట బాగుంది.డి.ఓ.పి నళినీ కాంత్ కెమెరా వర్క్ సూపర్బ్ అని చెప్పవచ్చు, వెంకట రెడ్డి ఎడిటింగ్ పని తీరు బాగుంది. E.I.P.L పతాకంపై నిర్మాత సంజీవ రెడ్డి ఖర్చుకి వెనకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “సకల గుణాభి రామ” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు

Cinemarangam.com Review Rating : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here