Bunny vasu interview about ‘prathiroju pandage’

యు.వి. క్రియేష‌న్స్‌, జి.ఎ.2 పిక్చ‌ర్స్ ప‌తాకాలపై అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నివాస్‌ నిర్మాత‌గా రూపొందించిన‌ చిత్రం `ప్ర‌తిరోజూ పండ‌గే` సాయితేజ్‌, రాశీఖ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన‌ ఈ చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల‌వుతున్న‌సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బ‌న్నివాస్‌ ఇంట‌ర్వ్యూ…

ఈ సినిమా గురుంచి చెప్పండి?
– ఈ సినిమాకు ముందు మారుతి నాకు వేరే స్టోరీ లైన్ చెప్పారు. దానిమీద వర్క్ చేస్తున్నాం. అప్పుడు మారుతి డార్లింగ్ ఇంకో కథ ఉంది దాన్ని కూడా ఒక సారి విను అని నాకు యూ వి క్రియేషన్స్ వంశీ కి క‌లిపి ఈ కథ చెప్పాడు. ఇది బాగా సెన్సిటివ్ ఇష్యూ అవడంతో తరువాత చూద్దాం అనుకున్నాం. అలా డిస్క‌ష‌న్స్ టైమ్ లో మా అమ్మ ఫోన్ చేస్తే లిప్ట్ చేయ‌లేక‌పోయాను. ఆ తరువాత ఒకేసారి మారుతి చెప్పిన లైన్ స్ట్రైక్ అయ్యి నేను ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోతే అమ్మ ఎలా ఫీల‌వుతుంది అనిపించి కాల్ చేసి అడిగాను `ఏముంది నాన్న నీ పనిలో నీవు బిజీగా ఉంటావు కదా ఏదయినా అర్జంట్ ఉంటే మాత్రం మీ ఆవిడకో, మేనేజర్ కో కాల్ చేస్తాను అని చెప్పింది. నాలాగే చాలామంది త‌మ వ‌ర్క్ బిజీలో ప‌డి త‌ల్లిదండ్రుల‌కు స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. ఈ క‌థ త‌ప్ప‌కుండా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని భావించి మొద‌లు పెట్టాం. అలా ఈ సినిమా స్టార్ట్ అవ‌డ‌నానికి మా అమ్మ కూడా ఓర‌కంగా కార‌ణం.

ఈ సినిమాకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
– పుట్టిన‌రోజు, పెళ్ళిరోజు త‌ర‌హాలో చావుని కూడా సెలెబ్రేట్ చేసుకోవాల‌న్న‌కాన్సెప్ట్‌ ను ఒకే కోణంలో సీరియస్ గా చూపిస్తూనే అదే సమయంలో ఎంటర్టైనింగ్ గా చెప్పడం అనేది క‌త్తిమీద సాము లాంటి స్క్రీన్‌ప్లే. దానికి మారుతి జాగ్రత్త గా ఫస్ట్ రీల్ లోనే ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది అని డిఫైన్ చేశారు. దాంతో సీరియస్ క్యారెక్టర్ అయినా ఎంటర్టైనింగ్ గానే వెళ్తుంది.

సాయితేజ్ కొరకే కథ వ్రాసుకున్నారా?
– తేజు ఫస్ట్ మూవీ ‘పిల్లా నువు లేని జీవితం’ నేనే ప్రొడ్యూస్ చేశాను. ఆ తరువాత ఇద్దరం కలిసి ఇంకో సినిమా చేద్దాం అని కొన్ని కథలు పంపాను. అయితే ఈ కథ పంపగానే తేజ్ కి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే చేద్దాం అన్నాడు.

సిక్స్ ప్యాక్ చేయించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది?
– ఆ ఐడియా అతనిదే! ‘చిత్రలహరి’ సినిమాలో కొంచెం బొద్దుగా కనపడ్డాను అన్న ఈ సినిమాలో ఫిట్ గా కనపడాలి అనుకుంటున్నా నాకు కొంచెం టైమ్ కావాలి అని రెండు మూడు నెలలు తీసుకొని సిక్స్ ప్యాక్ చేశాడు. కథలో భాగం కాదు

సాయితేజ్ నటన లో ఎలాంటి మార్పులు గమనించారు?
– ఫస్ట్ మూవీ నుండి చూస్తున్నాను కాబట్టి అతని నటనలో డిఫరెన్స్ నాకు తెలుస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా చాలా డెవ‌లప్ అయ్యాడు. యాక్టింగ్ లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. డబ్బింగ్ విషయంలో కూడా చాలా క్లారిటీ గా ఉన్నాడు.

గీతా ఆర్ట్స్2 లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించడానికి గల కారణం?
– కథ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆయనతో చెప్పిస్తాను. ఆ తరువాత ఏమైనా సందేహాలు ఉంటే నేను వివరిస్తాను. ఆయన నన్ను పూర్తిగా నమ్ముతారు. మా ఇద్దరి మధ్యలో ఆ ఫ్రీడమ్ ఉండడం, జి.ఏ2 పిక్చర్స్ లో మూడు జెనరేషన్స్ అల్లు అరవింద్ గారు, నేనే, ఈ త‌రం యువ ద‌ర్శ‌కులు పనిచేస్తుండడం వ‌ల్లే మేము సక్సెస్ అవుతున్నాం.

మంచి స్నేహితులు గా ఉన్న మారుతిగారు మీరు కలుసుకున్నప్పుడు మీ మధ్య ఎలాంటి చర్చలు జరుగుతుంటాయి?
– బేసిక్ గా మేము నలుగురం. మారుతి, నేను, ఎస్ కె ఎన్, యు వి క్రియేషన్స్ వంశి. మా ఫ్రెండ్ షిప్ ‘ఆర్య’ నుండి స్టార్ట్ అయింది. అప్పటినుండి అందరం కలిసే జర్నీ చేస్తున్నాం కాబట్టి మా మధ్యలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనే భేదాలు ఉండవు. డబ్బులైన, ఐడియాస్ అయినా అందరివీ అనుకొనే పనిచేస్తాం. కాకపొతే ఏమైనా భిన్న అభిప్రాయాలు వస్తే మాత్రం ‘మారుతి’ గారి సలహాకు రెస్పెక్ట్ ఇస్తాం.

నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి?
– ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీలో రీమేక్ చేస్తున్నాం. అఖిల్, బొమ్మ‌రిల్లు భాస్కర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సుకుమార్ రైటింగ్స్ లో నిఖిల్ హీరోగా సూర్య‌ప్రతాప్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాం. కార్తికేయ‌తో కౌశిక్ అనే కొత్త దర్శకుడితో `చావుక‌బురు చ‌ల్ల‌గా`.. సినిమా నిర్మించ‌నున్నాం. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కి చర్చలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here