‘Clap’ Movie will connect to everyone…Hero Aadi Pinisetti

ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథే “క్లాప్”.ఐ.బి కార్తికేయన్ సమర్పణలో  శిరిడిసాయి మూవీస్,సర్వంతరాం క్రియేషన్స్ పతాకాలపై  ఆది పినిశెట్టి,ఆకాంక్ష సింగ్ జంటగా పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి, ఎం రాజశేఖర్ రెడ్డి లు సంయుక్తంగా కలిసి నిర్మించిన చిత్రం “క్లాప్” ది సౌండ్ ఆఫ్ సక్సెస్ అనేది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 11న సోనీ లివ్ లో విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత రమాంజనేయులు జువ్వాజి మాట్లాడుతూ... స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథను దర్శకుడు చెప్పినపుడు నచ్చి ఆది గారితో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను.ఇందులో నాజర్,ప్రకాష్ రాజ్,బ్రహ్మజీ వంటి పెద్ద స్టార్స్ యాడ్ అవ్వడంతో  పెద్ద సినిమా అయ్యింది. ఇళయరాజా గారు మా సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. ఇళయరాజా కు ప్రత్యేక ధన్యవాదాలు.ఇది చాలా ఏమోషనల్ మూవీ..మేము ఏదైతే అనుకున్నామో అంతకంటే ఎక్కువ ఔట్ ఫుట్ ఇచ్చాడు దర్శకుడు పృద్వి..అది,ఆకాంక్ష లు చాలా బాగా చేశారు.ఈ నెల 11 న సోనీ లివ్ ఓటిటిలో వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

 

మరో నిర్మాత యం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది చాలా ఎమోషనల్ మూవీ.ఈ కథను ఆది గారే సెలెక్ట్ చేశారని దర్శకుడు చెప్పడంతో ఈ మూవీ చేయడానికి నా ఫ్రెండ్ రమాంజి తో ముందుకు వచ్చాను..ఆ తరువాత ఈ సినిమాకు పని చేయడానికి పెద్ద పెద్ద లెజెండ్స్ ముందుకు రావడంతో  ఈ సినిమాకు పెద్ద సినిమా అయ్యింది. మేము షూటింగ్ చేసే టప్పుడే మంచి కంటెంట్ తో తీస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో అయితే బిగ్ హిట్ అవుతుందని థియేటర్స్ లోనే విడుదల చేద్దాం అనుకున్నాము.ఇంతలో కోవిడ్ రావడంతో మేము సోనీ లివ్ ఓటిటి కి కమిట్ అయ్యాము.నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. ఇకముందు కూడా ఆది తో సినిమాలు చేస్తాము.ఈ నెల 11 న సోనీ లివ్ లో  విడుదల అవుతున్న మా సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని నమ్ముతున్నాను అన్నారు.

 

హీరో అది పినిశెట్టి మాట్లాడుతూ..”రంగస్టలం” సినిమా తరువాత ఒక మంచి సినిమాను సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కథ నా దగ్గరికి వచ్చింది.అయితే ఈ కథను హీరోగా కాకుండా ఒక అడియన్ గా విన్నాను. కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను.ఈ “క్లాప్” తో జర్నీ స్టార్ట్ అయ్యినప్ప్పుడు నిర్మాతలు ఆరు నెలల్లో లో షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాను సోనీ లివ్ లో విడుదల చేస్తున్నారు.ఈ”క్లాప్” సినిమాతో రెండున్నర సంవత్సరాలు గా జర్నీ చేస్తున్నాను.ఇందులో సీనియర్ నటులు నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మజీలు నటించడం ఆలాగే ఇళయరాజా మ్యూజిక్ చెయ్యడం ఇలా అందరూ పెద్దలు కలవడంతో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.హీరోయిన్ చాలా చక్కగా నటించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు రానటువంటి ఈ సినిమాను దర్శకుడు చాలా హానెస్ట్ గా తెరకెక్కించాడు.ఇందులో  విష్ణు,స్మిత క్యారెక్టర్స్ ను చాలా చక్కగా డిజైన్ చేశాడు.ఇందులో వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా ఎంతో అర్థవంతంగా,జన్యున్ గా ఉంటాయి. మేమంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యి సినిమా చేశాము.ఈ సినిమాలో ఫైట్స్, పాటలు ఇవేమీ ఉండవు కానీ ప్రేక్షకులందరూ మా సినిమాకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ చిత్ర నిర్మాతలు ఎంతో హానెస్ట్ కథ ను మాత్రమే నమ్ముకొని ఈ సినిమా చేశారు.వారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో నేను చాలా ఎమోషనల్ జర్నీ చేశాను.స్క్రీన్ పై పృథ్వి గారు నన్ను చాలా చక్కగా చూయించారు.ఇది చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ స్టోరీ.చూసిన వారందరూ కూడా కచ్చితంగా కనెక్ట్ అవుతారు.నాకిలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు  అన్నారు.

నటీనటులు
ఆది పినిశెట్టి,ఆకాంక్ష సింగ్,నాజర్,ప్రకాష్ రాజ్,బ్రహ్మజీ తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రజెంట్ : ఐ.బి కార్తికేయన్
బ్యానర్ : సర్వంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ ,బిగ్ ప్రింట్ పిక్చర్స్
చిత్రం : క్లాప్ (ది సౌండ్ ఆఫ్ సక్సెస్ అనేది ట్యాగ్ లైన్ )
కో డైరెక్టర్ : గడ్డం రమేష్
ప్రొడ్యూసర్స్ : రామాంజనేయులు జవ్వాజి ,ఎం రాజశేఖర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కుమార్ సంతాన కృష్ణన్,
రైటర్ డైరెక్టర్ : పృధ్వి ఆదిత్య
మ్యూజిక్ :  మాస్ట్రో ఇళయరాజా
డి ఓ పి : ప్రవీణ్ కుమార్
ఎడిటర్ : రగుల్
ఆర్ట్స్ : వైరా బాలన్ , ఎస్ హరిబాబు
డైలాగ్స్ : వనమాలి
లిరిక్స్ :;సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్
కొరియోగ్రఫీ : దినేష్
స్టంట్ : శక్తి శరవణన్
పి.ఆర్.ఓ :  వంశి శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here