Clean family entertainer “Happy Ending” Movie Review

Cinemarangam.Com
సినిమా : “హ్యాపీ ఎండింగ్”
విడుదల తేదీ : 2nd Feb 2024
రివ్యూ రేటింగ్ : 2.75/5
బ్యానర్ : హామ్స్ టెక్ ఫిల్మ్స్ ,సిల్లీ మాంక్స్ స్టూడియోస్
నిర్మాతలు : యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల 
లైన్ ప్రొడ్యూసర్: ప్రసాద్ బిల్లకుర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రామానుజం
దర్శకత్వం :  కౌశిక్ భీమిడి 
నటీనటులు: యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష రోషన్, జియా శర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ:  అశోక్ సీపల్లి
సంగీతం: రవి నిడమర్తి
స్క్రీన్ ప్లే రైటర్ : నాగ సాయి
ఎడిటింగ్ :  ప్రదీప్ ఆర్ మోరం
ప్రొడక్షన్ డిజైనర్ : అరవింద్ మ్యూల్
పి.ఆర్.ఓ : జీఎస్ కే మీడియా  


“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలం” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “హ్యాపీ ఎండింగ్” సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.


కథ:
మహాభారతం చదువుతున్నప్పుడు అందులో అనేక శాపాల గురించి మనం విని ఉంటాము .ఆలా మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా “హ్యాపీ ఎండింగ్”. ఇలాంటి శాపాన్ని ఇప్పటి జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో “హ్యాపీ ఎండింగ్” కథ మొదలవుతుంది ,  హర్ష్‌(యస్‌ పూరి) కి సెక్స్ సినిమాల గురించి ఫ్రెండ్‌ చెప్పిన  మాటలు విని అవి ప్రదర్శించే థియేటర్‌కి వెళ్తాడు. అక్కడికి రథేశ్వర్ స్వామిజీ(అజయ్‌ ఘోష్‌) కూడా వస్తాడు. అయితే ఆ టైమ్‌లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో స్వామిజీని అందరు గుర్తుపడతారు. అందుకు హర్ష్‌ ప్రధాన కారణమవుతాడు. దీంతో స్వామిజీ హర్ష్‌పై సీరియస్‌ అయ్యి ఆవేశంతో  భవిష్యత్‌లో నువ్వు ఏ అమ్మాయిని ఆ ఫీలింగ్‌తో తలుచుకున్నా, వాళ్లంతా చనిపోతారు అని శపిస్తాడు. అలా  చిన్నప్పుడే  బాబా శాపం పొందిన హర్ష్‌ పెద్దయ్యాక  ప్యాషన్‌ రంగంలో మేకప్‌ ఆర్టిస్ట్ గా రాణిస్తాడు. అయితే ఒకరోజు హీరోయిన్ అవని(అపూర్వ రావు) పెళ్లికి మేకప్‌ చేయాల్సి వస్తుంది. మేకప్ వేసే సమయంలో హర్ష్‌ చెప్పిన మాటలకు ఇన్‌స్పైర్‌ అయి పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటుంది..ఆలా కొన్ని రోజుల తరువాత ఆమే తన ప్రేయసి అవుతుంది.కానీ తనకున్న శాపం వల్ల తనతో ఫిజికల్ గా ఉండలేకపోయినా..తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తాడు. అయితే పూర్తిగా అవని ప్రేమలో పడిన హర్ష్‌ చివరకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు. తనకు శాప విముక్తి లభించిందా లేదా ? చివరకు ఆ అమ్మాయితో తన ప్రేమను కొనసాగించాడా  లేదా? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “హ్యాపీ ఎండింగ్” సినిమా చూడాల్సిందే.. 


నటీ నటుల పనితీరు    
హర్ష్‌ పాత్రలో యష్‌ పూరి బాగా నటించాdu. రొమాంటిక్‌ లుక్ లో కూడా చాలా క్యూట్ గా  కనిపించాడు. ఇక హీరోయిన్ అపూర్వ రావు అవని పాత్రలో చాలా బాగా చేసింది.తనకిది తొలి సినిమా అయినా చాలా సెటిల్డ్ గా చేసింది. ఈ కథకు  ఇందులో  ఇద్దరూ బాగా యాప్ట్ అయ్యారు. అలాగే  యష్, అపూర్వ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా ఉంది. సినిమా పూర్తయ్యాక కూడా వీరి   క్యారెక్టర్స్  గుర్తొస్తాయి. అజయ్‌ ఘోస్‌ నటన బాగుంది. విష్ణు చేసిన కామెడీ ప్రేకక్షకులను ఆకట్టుకుంటుంది. ఝాన్సీ ఉన్నంతలో చాలా బాగా నటించింది.ఇంకా ఇందులో నటించిన వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
పురాణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితం ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనే ఫన్, ఎంటర్ టైన్ తో రాసుకొని  వాటికి ఏమోషన్స్ సీన్స్ జోడించి తెరకేక్కించడంలో దర్శకుడు కౌశిక్ భీమిడి  సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. చాలా మంది తమ ప్రమోషన్స్ లో బిగినింగ్ మిస్ అవ్వొద్దు, క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు అంటారు. కానీ ఈ సినిమాలో నిజంగానే బిగినింగ్, ఇంటర్వెల్ ఎంత ముఖ్యమో క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.వీటన్నింటినీ కనెక్ట్ చేస్తూ కథలో బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది.చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు  డైరెక్టర్  కౌశిక్ భీమిడి.రవి నిడమర్తి  అందించిన  మ్యూజిక్ చాలా డీసెంట్‌గా ఉంది.అశోక్ సీపల్లి  అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేము అందంగా ఉంది.ప్రదీప్ ఆర్ మోరం ఎడిటింగ్ పనితీరు పరవాలేదు . సౌండ్, విజువల్, మేకింగ్..ఇలా ప్రతి అంశంలో ఈ సినిమాకు టెక్నీషియన్స్ బ్యూటిఫుల్  గా వర్క్ చేశారు. హామ్స్ టెక్ ఫిల్మ్స్ బ్యానర్ పై యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల  సంయుక్తంగా నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఇప్పటిదాకా మన సినిమాల్లో రొమాన్స్, సన్నిహితంగా ఉండటాన్ని ఒకరకంగా చూపించాం. కానీ “హ్యాపీ ఎండింగ్”లో ఆ రొమాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది.అయితే ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎంటర్ టైనింగ్ తో రూపొందించిన “హ్యాపీ ఎండింగ్” సినిమా ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది .

Cinemarangam.Com Review Rating 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here