‘Crazy Fellow’.. Good Family Entertainer.. Laughs Guaranteed for Audience : Director phani Krishna Siri interview

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యం సినిమా దర్శకుడు ఫణి కృష్ణ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీ ప్రయాణం గురించి చెప్పండి ?
పదేళ్ళుగా ఇండస్ట్రీలో వున్నాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశాను. కొన్ని చిన్న సినిమాలకు పని చేశాను. కళ్యాణ్ కృష్ణ గారి దగ్గర రచన విభాగంలో కూడా చేశాను. క్రేజీ ఫెలో కథ రాధమోహన్ గారికి చెప్పాను. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ పైకి రావడం అనందంగా వుంది.

క్రేజీ ఫెలోలో వుండే యునీక్ పాయింట్ ఏమిటి ?
క్రేజీ ఫెలో క్యారెక్టర్ బేస్డ్ మూవీ. హీరో పాత్రని చాలా క్రేజీ గా డిజైన్ చేశాం. చెప్పిన మాటని పూర్తిగా వినకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ని హిలేరియస్ గా చూపించాం. చాలా మంచి వినోదం వుంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఎప్పుడూ వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతాను. ఆది గారిని ఫుల్ లెంత్ లవ్ ఎంటర్ టైనర్ లో చూసి చాలా కాలమైయింది. క్రేజీ ఫెలో తప్పకుండా వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మంచి చిరునవ్వుతో బయటికి వస్తారు.

ఆది నటన గురించి ?
ఆది ఇందులో కొత్తగా వుంటారు. ఆయన నటన కూడా కొత్తగా వుంటుంది. ఒక కొత్త ఆదిని చూస్తారు. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఇందులో యాక్షన్ కూడా వుంది. అయితే ఇందులో విలన్ కూడా హీరోనే. అతని వలన అతనికే సమస్యలు( నవ్వుతూ). చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటుంది.

ఇతర పాత్రల గురించి ?
వినోదిని వైద్యనాధన్, అనీష్ కురివిల్లా, నర్రా శ్రీనివాస్ , సప్తగిరి కీలక పాత్రలు చేశారు. ఇందులో అనీష్ గారు బ్రదర్ గా కనిపిస్తారు. ‘నన్ను బ్రదర్ పాత్రలో చూసింది నువ్వే’ అని అనిష్ గారు చాలా సర్ ప్రైజ్ అయ్యారు. పాత్రలు చాలా ఫ్రెష్ గా వుంటాయి.

నిర్మాతల సహకారం గురించి ?
సినిమాకి కావాల్సింది సమకూర్చారు. మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. అది పక్కాగ చేయడం వలన షూటింగ్ త్వరగా పూర్తి చేయగలిగాం.

చిన్న సినిమాలకి ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గింది కదా..క్రేజీ ఫెలో కి ఎలాంటి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు?
మంచి సినిమాకి ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వస్తారని నమ్ముతాను. సినిమా బావుందని తెలిస్తే మాత్రం తప్పకుండా  థియేటర్ కి వస్తారు. క్రేజీ ఫెలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు మంచి సినిమా చుశామనే ఫీలింగ్ తో బయటికి వస్తారు. ఆది గారికి ఖచ్చితంగా విజయం వస్తుందని నమ్ముతున్నాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here