Darbar Movie Review

Release date :January 9th,2020
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Darbar
Banners:-Lyca productions,
Starring:-Rajinikanth,Suneel setti,nayanatara,Niveda Thamas,yogibabu
Music Director :-Anirudh Ravichandran
Editor:-Sreekar prasad
Cinematography:-Santhos Sivan
Director :-A.R.Murugadas
Producer :-A.subaskaran

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం’దర్బార్’లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్నినిర్మించారు .రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కించారు.నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.తెలుగు లో సంక్రాంతికి పెద్దహీరోల సినిమాల పోటీ బాగానే ఉన్నా,తెలుగులో రజినీకాంత్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే..ఇలాంటి సమయంలో నేడు సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఆయన తన గత సినిమాలతో అనేక బ్లాక్ బస్టర్లు కొట్టారు.మరి ఈ సినిమా రిజల్ట్ ఎలాఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.,థియేటర్లో రజిని తన మేజిక్ చూపించి ప్రేక్షకులనుమెప్పించాడా? సినిమా ఏ మేరకు రాణించింది అనేది చూద్దాం రండి.

కథ :

ముంబైలోని ఒక టాప్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆదిత్య అరుణాచలం స్టోరీ ఇది.ముంబైలో పోలీసులకు సరైన గౌరవం లేక పోలీస్ వ్యవస్థ పూర్తిగా వీక్ అయిన పరిస్థితుల్లో.. అక్కడి యువత డ్రగ్స్ కి బానిసలుగా బతుకుతున్న స్థితిలో.. వెరీ సిన్సియర్ అండ్ పూర్తి ఆవేశపూరితమైన పోలీస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబైకి కమీషనర్ వస్తాడు. రావడంతోనే వేలమంది ఆడపిల్లలను సేవ్ చేస్తాడు.మరో పక్క తన కూతురు వల్లీ (నివేథా థామస్)తో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే లిల్లీ (నయనతార)తో పరిచయం అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం హరి చోప్రా(సునీల్ శెట్టి) ఆదిత్య అరుణాచలాన్ని టార్గెట్ చేస్తాడు. దాంతో ఆదిత్య అరుణాచలం జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి ప్రతీకారంగా హరి చోప్రా మీద ఆదిత్య అరుణాచలం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు హరి చోప్రా గతం ఏమిటి? చివరికి ఆదిత్య అరుణాచలం తానూ అనుకున్నది సాధించాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ తో పాటు కొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో అలాగే భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సూపర్ స్టార్ అభిమానులకు.. మురగదాస్ మొత్తానికి రజిని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు.తన స్టైల్ తో మేజిక్ చేస్తూ వస్తున్న సూపర్ స్టార్ రజిని డెబ్బై ఏళ్ళు దాటినా తనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేసాడు. తన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్టెప్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసాడు, తన స్టైలిష్ ఎనర్జిటిక్ నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ లో మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో అండ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ లో రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. సినిమాకే అతి కీలక మైన పాత్రలో నటించిన నివేథా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో నివేథా నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ గా నయనతారకు పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న ఆ కొన్ని సీన్స్ లో తన గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీతో మెప్పించింది. యోగిబాబు,రజినీకాంత్ ల మధ్య కామెడీ వర్క్ ఔట్ అయ్యింది. ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. విలన్ గా సునీల్ శెట్టి పర్వాలేదు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు మురుగదాస్ తన మార్క్ స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టించే ప్రయత్నం బాగానే చేశాడు.భారీ విజువల్స్ తో భారీ యాక్షన్ తో చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు పనితనం మెచ్చుకోని తీరాలి. అయితే కొన్ని సన్నివేశాలు మరియు కథ విషయంలో మాత్రం దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన సంగీతం చాల బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కి ప్రధాన బలం.అనిరుథ్ ఈ సినిమా స్థాయిని చక్కగా పెంచాడు అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.మెయిన్ గా రజినిని చాల యంగ్ గా చూపించారు.ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. సూపర్ స్టార్ తో ఇలాంటి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అందించినందుకు సుభాష్ శరన్ ను అభినందించాలి.

Cinema rangam.com..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here