“Dear Megha” Movie Censored with Clean U. Releasing on Sep 3rd

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్,పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్ పనులు కూడా మెదలు పెట్టింది టీమ్. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు  300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు.

నటీనటులు – మేఘా ఆకాష్,అదిత్ అరుణ్,అర్జున్  సోమయాజుల, పవిత్రా లోకేష్ తదితరులు.

ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ -ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, పీఆర్వో – జి.ఎస్.కె
మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here