“ Devarakondalo Vijay Premakatha” Movie Review

Release date :-March 11,2021
Cinema rangam :- Rating 3/5
Movie Name :- “ Devarakondalo Vijay Premakatha”
Banner:- Sivatri Films
Starring:– Vijay Shankar, Mouryani, Naginidu, Venkata Govindarao, Sivannarayana, Koteshwara Rao, Rachcharavi, Sunita, Shiriraj, Chalapathirao, Saimani, Subhash Reddy Nallamilli etc…
Editor:- K.A.Y.Paparao,,
Music:- Sadachandra,
Cinematography:- G Amar ,
P.R.O .: – Ramesh
Line Producer :- Santosh S,
Producer:- Paddana Manmadarao,
Story Screenplay Direction :-Venkataramana S.

శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్ శంకర్‌, మౌర్యాని జంటగా వెంకటరమణ.ఎస్ దర్శకత్వంలో పడ్డాన మన్మథరావు నిర్మించిన చిత్రం ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ .మహాశివరాత్రి సందర్భంగా విడులైన ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’. రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ..
బతుకు తెరువు కోసం దేవరకొండకు వచ్చే ప్రతి మనిషికి దేవరకొండ ఊరు పెద్ద అయిన సీతారామయ్య (నాగినీడు) ఆశ్రయమిస్తూ అందరినీ అదుకుంటుంటాడు. అలా ఊరిలో సగం జనాభా అలా వలస వచ్చిన కుటుంబాలే ఉంటాయి. అందరినీ అక్కున చేర్చుకున్న సీతారామయ్య గారంటే స్థానికుల్లో చాలా గౌరవం ఉంటుంది.ప్రాణం పరువు ఒకటే అనుకునే సీతారామయ్య కు కూతురు దేవకి ( మౌర్యాని)ని తన హోదాకు సమానమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తల్లిదండ్రుల ఆలోచనలు, పిల్లల మనసు ఒకేలా ఉండవు కదా. దేవకి, విజయ్ (విజయ్ శంకర్) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. అతనో ఆటో డ్రైవర్. మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. దేవకి, విజయ్ ల ప్రేమను పరువు కోసం ప్రాణం పెట్టే సీతారామయ్య నిరాకరిస్తాడు.తల్లిదండ్రులను కాదని విజయ్, దేవకి ఊరు వదిలి బయటకొచ్చి, పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంబిస్తారు. గ్రామపెద్ద సీతారామయ్య గారి కూతురు అలా చేయడంతో విజయ్ నడుపుతున్న ఆటోలో దేవరకొండ ప్రజలు ఎవరు ఎక్కకుండా, మాట్లాడకుండా వారిని దూరం పెడతారు. ఆ తరువాత అనుకోని సంఘటనలు విజయ్, దేవకి జీవితాలను కుదిపేస్తాయి. ఆ పరిస్థితులు ఏంటి, దేవరకొండ ప్రజల మనసు గెలుచుకొన్నారా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు
నాగినీడు కెరీర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ గా సీతారామయ్య నిలిచిపోతుంది. ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ చూసినప్పుడు కోపం వచ్చినా చివరలో ఏడిపిస్తారు. విజయ్ శంకర్ హీరోగా మంచి ఫ్యూచర్ ఉంది అనిపించేలా చాలా బాగా నటించాడు .అతనికి ఇది తొలి సినిమా. అయినా మంచి ఫర్మార్మెన్స్ చూపించాడు.ఇక మౌర్యాని చూపించిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కొన్ని సీన్స్ లో కళ్లతోనే ఎక్స్ ప్రెషన్ పలికించింది.ఈ తరం నాయికల్లో ఇలాంటి క్యారెక్టర్ చేసేందుకు తనకే గట్స్ ఉన్నాయని ప్రూవ్ చేసింది. ఇంకా ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల విషయానికొస్తే వారంతా సహజమైన పాత్రలతో చాలా చక్కగా నటించారు.దేవరకొండలో విజయ్ ప్రేమ కథ చిత్రం కూడా సినిమా చూస్తున్నంతసేపూ ఇలాంటి సహజమైన అనుభూతినే కలిగిస్తుంది.

సాంకేతిక నిపుణులు
మనకున్న వ్యసనాలు పిల్లల జీవితాలకు, ప్రేమించిన వారి జీవితాలకు శాపం కాకూడదు అనే మంచి విషయాన్ని దర్శకుడు సినిమాలో చెప్పాడు.ఈ సినిమాను చూస్తే బాలచందర్ సినిమాలు గుర్తొచ్చేలా తీశాడు దర్శకుడు.అలాగే “అంతులేని కథ”, “ఇది కథ కాదు” లాంటి సినిమాలు చూస్తే ఎంతో సహజత్వం కనిపిస్తుందో..ఈ సినిమా కూడా మన చుట్టూ ఉన్న జీవితాలను తెరపై ప్రతిబింబించాయి.సహజమైన పాత్రలు, సందేశాత్మ కథా కథనాలు ఈ చిత్రాన్ని రొటీన్ ఆరు పాటలు, నాలుగు ఫైట్ల కాన్సెప్ట్ చిత్రాలకు భిన్నంగా నిలబెట్టాయి. కమర్షియల్ అంశాల కోసం దారి తప్పకుండా నిజాయితీగా కథను తెరకెక్కించారు దర్శకుడు వెంకటరమణ ఎస్. క్లైమాక్స్ ఒక్కటి చాలు ఆయన నిజాయితీ చెప్పేందుకు.చివరకు ఒక ప్రేమ జంట కోసం ఊరు ఊరే తరలివస్తే ఎలా ఉంటుందో దేవరకొండ విజయ్ ప్రేమ కథలో చూస్తాం. మొత్తంగా సందేశం, వినోదం కలిపిన ఓ చక్కటి ప్రేమ కథను ప్రేక్షకులు ఈ చిత్రంతో ఆస్వాదించవచ్చు.

                               Cinema rangam : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here