Dhanush’s music album ‘Jagamethanthiram’ will be released on June 7

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరు ఎంతో ఆసక్తిగా ‘జగమే తంతిరం’ సినిమాను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘జగమే తంతిరం’.  వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18న ప్రసారం కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ముంచి స్పందన లభిస్తుంది. అలాగే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన ఈ సినిమా కంప్లీట్‌ మ్యూజిక్‌ ఆల్భమ్‌ను సోనీ మ్యూజిక్‌ సంస్థ మార్కెట్‌లోకి తీసుకురానుంది.

ట్రైలర్‌ కంటే ముందే విడుదలైన ‘రకిట రకిట’, ‘బుజ్జి’, మ‌రియు ఇటీవల విడుదలైన రొమాంటిక్‌ సాంగ్‌ ‘నేతూ’ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ పాట రిధమ్, బీట్స్‌ శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ‘రికట రకిట’ సాంగ్‌కు లిరిక్స్‌ అందించడంతో పాటుగా ఈ పాటను ధనుష్‌ పాడారు. ఈ సినిమాకు సంతోష్‌ నాయరణన్‌ అందించిన సంగీతం సూపర్భ్‌ అనే చెప్పాలి. ‘జగమే తంతిరం’ సినిమా నుంచి మూడు పాటలకే వస్తేనే ఊగిపోయిన శ్రోతలు…ఇప్పుడు ఈ సినిమా ఎంటైర్‌ ఆల్భమ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణం రానే వచ్చింది. ప్రముఖ సోనీ మ్యూజిక్‌ సంస్థ ప్రేక్షకుల ముందకు తీసుకు వస్తున్న ‘జగమే తంతిరం’ ఈ జ్యూక్‌ బ్యాక్స్‌లో 8 పాటలు ఉన్నాయి. ఈ ఎనిమిది పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉండబోతుండటం విశేషం. సో…‘జగమే తంతిరం’ పాటలను లూప్‌లో పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాందించేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోండి. సురలి (జగమే తంతిరం’ చిత్రంలోని ధనుష్‌ పాత్ర)కు విజిల్స్, చప్పట్లతో గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పండి.

జగమే తంతిరం’ మ్యూజిక్‌ ఆల్భమ్‌ లాంచ్‌ సందర్భంగా సోనీ మ్యూజిక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజత్‌ కక్కర్ మాట్లాడుతూ – “జగమేతంతిరం’ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘రకిట రకిట’, ‘బుజ్జి’, ‘నేతూ’ పాటలకు శ్రోతల నుంచిమంచి స్పందన లభిస్తుంది. అలాగే ఈ సినిమా కంప్లీట్‌ ఆల్భమ్‌ శ్రోతలను మరింత ఊర్రూతలూగిస్తుందని నమ్ముతున్నాం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జగమేతంతిరం’ వంటి ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయినందుకు సంతోషంగా ఉంది. ధనుష్, కార్తీక్‌ సుబ్బరాజు, సంతోష్‌ నారాయణన్‌ వంటి ప్రతిభావంతులు కలిసి చేసిన ఈ సినిమా మాకు ఎంతో స్పెషల్‌. ఓ మ్యాజికల్‌ ప్రాజెక్ట్‌. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీ ఇంటర్‌నేషనల్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ప్రముఖ సంస్థలతో అసోసియేషన్ మాకు ఎప్పుడూ సంతోషకరమే. భవిష్యత్‌లో కూడా వారితో కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్‌ చేయటం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’’ అని  అన్నారు.

ఈ సినిమాకు సంగీతం అందించిన సంతోష్‌ నారాయణన్‌ మాట్లాడుతూ – ‘‘జగమేతంతిరం’ సినిమాలోని పాటల కోసం మ్యూజిక్‌ స్టూడియోలో ఎంతో టైమ్‌ స్పెండ్‌ చేశాం. ఈ ఆల్భమ్‌లోని ప్రతి సాంగ్‌ కొత్తగా
ఉండేలా ప్రయత్నించి సఫలమైయ్యాం. నాకు అవసరమనిపించిన ప్రతి చోట ఓ సరికొత్త సంగీతాన్ని అందించాను. ఈ సినిమాకు సంగీతం సమకూర్చడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. రకిట పాట విడుదలైనప్పుడు ఈ పాట మనలోని ఒత్తిడిని తగ్గించేలా స్ట్రెస్‌ బస్టర్‌గా బాగా ఉందని చెబుతుంటే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు సోనీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ‘జగమేతంతిరం’ లోని మొత్తం పాటలను విడుదల చేయనుంది. ర‌కిట‌ పాటకు దక్కిన స్పందనే ఈ సినిమాలోని అన్ని పాటలకు దక్కుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.

తమిళం
రకిట రకిట
(సింగర్స్‌:ధనుష్, థీ, లిరిసిస్ట్‌:వివేక్‌)
బుజ్జి
(సింగర్స్‌:అనిరుథ్‌ రవిచంద్రన్, లిరిసిస్ట్‌: వివేక్‌)
నేతూ
(సింగర్స్‌: ధనుష్, లిరిసిస్ట్‌: ధనుష్‌)
అలా ఓలా
(సింగర్స్‌: అంథోనీ ధాసన్, సంతోష్‌ నారాయణన్, లిరిసిస్ట్‌: వివేక్‌)
తీంగు తక్క
(సింగర్స్‌: అరివు, జీకేబీ, సంతోష్‌ నారాయణన్, లిరిక్స్‌: అరివు)
తీపరై
(సింగర్స్‌: మీనాక్షీ ఇళయరాజా, సంతోష్‌ నారాయణన్, లిరిక్స్‌:మధురై బబరాజ్‌)
కలరే కలర్వాసమ్‌
(సింగర్స్‌: అంథోనీ ధాసన్, లిరిక్స్‌: అంథోనీ ధాసన్‌)
నాన్‌దాన్‌దా రా మాస్‌
(ఓఫ్రో, సంతోష్‌ నారాయణన్,అరివు, లిరిక్స్‌: అరివు)

తెలుగు
రకిట రకిట (అనంతు, సుష, సంతోష్‌ నారాయణన్, భాస్కరభట్ల)
బుజ్జి (సంతోష్‌ నారాయణన్, భాస్కరభట్ల)
నీతో (విజయ్‌ నరైన్, భాస్కరభట్ల)
రేలా రేలా (ఆంథోనీ దాసన్, భాస్కరభట్ల)
వేట వేట వేట (సంతోష్‌ నారాయణన్, భాస్కరభట్ల)
వెళ్తున్నారా (సవిత సాయి,భాస్కరభట్ల)
నూరేళ్లు నిండిపోయాయా(సన్నిధానందన్, భాస్కరభట్ల)
నాతోటి రేస్‌–యు (ఓఫ్రో, సంతోష్‌ నారాయణన్,భాస్కరభట్ల)

తారాగణం: ధనుష్, జేమ్స్‌ కాస్మో, ఐశ్వర్యా లక్ష్మీ, జోసెఫ్‌ జోజు జార్జ్, కలైయారసన్, శరత్‌ రవి, రోమన్‌ ఫియోరీ, సుందరరాజ, దురై రామచంద్రన్, మాస్టర్‌ అశ్వత్‌

సాంకేతిక నిపుణులు
రచయిత–దర్శకుడు: కార్తిక్‌ సుబ్బరాజ్‌
సంగీతం: సంతోష్‌ శివన్‌
డీఓపీ: శ్రేయాస్‌ కృష్ణ
ఎడిటర్‌: వివేక్‌ హర్షన్‌

About Netflix:
(నెట్‌ఫ్లిక్స్‌ గురించి)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడింగ్‌ ఓటీటీ సంస్థల జాబితాలో  ముందువరుసలో ఉన్న స్ట్రీమింగ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌. 190 దేశాల్లో 208 మిలియన్ల పెయిడ్‌ మెంబర్‌షిప్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. డాక్యూమెంటరీలు, టీవీ సిరీస్‌లు, ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇలా భిన్నరకాలైన వినోదాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తమ వ్యూయర్స్‌కు అందిస్తుంది. ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉన్న ఓ స్క్రీన్‌పై అయిన…ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసులను పొందవచ్చు. వ్యూయర్స్‌ తమ సౌకర్యానికి వీలుగా ‘ప్లే, పాజ్, రీ ప్లే, ఫార్వర్డ్, బ్యాక్‌వార్డ్‌’ ఆఫ్షన్లు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా నుంచి మరిన్ని వార్తలు, సమాచారం, అప్‌డేట్స్‌ వంటి వివరాలను ఈ క్రింది విధంగా పొందవచ్చు.
follow us on IG @Netflix_IN, TW @NetflixIndia and FB @NetflixIndia

About YNOT Studios:
(వై నాట్‌ స్టూడియో గురించి)
చెన్నైలో ఉన్న ప్రముఖ నిర్మాణసంస్థ వై నాట్‌ స్టూడియోస్‌. 2009లో శశికాంత్‌ ఈ నిర్మాణసంస్థను ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ సంస్థ నుంచి 18 ఫీల్మ్‌ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విక్రమ్‌ వేదా సినిమాను నిర్మించింది వై నాట్‌ స్టూడియోనే. ఈ చిత్రానికి పుష్కర్‌ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు పలు భాషల్లో రీమేక్‌కు సిద్ధమవుతుంది. ఇక వై నాట్‌ స్టూడియో నుంచి వచ్చిన చివరి చిత్రం యోగిబాబు నటించిన మండేలా. పొలిటికల్‌ సెటైర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ తమిళ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్‌ నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ నిర్మాణసంస్థ నుంచి ధనుష్‌ నటించిన ‘జగమే తంతిరం’ సినిమా రానుంది. జూన్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Key People : S Sashikanth @sash041075
YNotStudios Twitter & Instagram – @studiosynot

About Reliance Entertainment:
రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి

www.relianceentertainment.net రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది రిల‌య‌న్స్‌ గ్రూప్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మీడియా విభాగానికి చెందినది. సినిమాలు, టెలివిజన్, డిస్ట్రిబ్యూటన్, డిజిటల్, గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వంటి విభాగాల్లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్యకాలాపాలను నిర్వహిస్తుంది. అలాగే ఐకానిక్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పిల్‌బర్గ్‌తో డ్రీమ్‌ వర్క్స్‌తో 2009 నుంచి రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌ అసోసియేట్‌ అయ్యింది. ఈ అసోసియేషన్‌లో ఎన్నో మంచి, విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ‘ది హెల్ప్, వార్‌ హౌస్, లింకోన్, ది హాండ్రెడ్‌ ఫూట్‌ జర్నీ, ది గళ్‌ ఆన్‌ ది ట్రైన్, ఏ డాగ్స్‌ పర్‌పస్, బ్రిడ్జ్‌ ఆఫ్ స్ప‌యిస్‌,  ది పోస్ట్‌ వంటి చిత్రాలు వచ్చాయి. ఇక 2019 గోల్డెన్‌ గ్లోబ్, ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌. గ్రీన్‌ బుక్‌ అండ్‌ 2020 అకాడమీ అవార్డు నామినీ అండ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ విన్నర్ `1917`మూవీని కూడా ఈ సంస్థ నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here