Directer Gopichand Malineni Interview about ‘KRACK’

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న థియేట‌ర్‌ల‌లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని హైద‌రాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

*కరోనా మహమ్మారి కారణంగా నేను మార్చి నుండి అక్టోబర్ వరకు  నేను పడ్డ స్త్రగుల్ ఎవ్వరూ పడి వుండరు .ఓ.టి.టి కు వెళ్ళమని బీభత్సమైన ఒత్తిడులు వచ్చాయి. నేను ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా అని బలంగా నమ్మి..పట్టుదలగా నిలబడ్డా.వేటపాలెం బ్యాచ్,మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ థియేటర్ లో చూస్తే వచ్చే ఎక్సపీరైన్స్ ,మజా ఎక్కడా రాదు అని నమ్మాను. అందుకే అందరికీ సమాధానం చెప్పలేక నేను ఒక టైం లో ‘క్రాక్ ఇన్ థియేటర్స్ ఓన్లీ’ అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాను.సంక్రాంతికి విడుదలైన క్రాక్ చిత్రం పెద్ద విజయాన్నిసాధించడం ఆనందంగా ఉంది.

*ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నాకు విడుదల రోజు జరిగిన సంఘటనలు నన్ను షాక్ కు గురిచేశాయి. అలాంటి ఇబ్బందులు ఏ దర్శకుడికి కూడా లైఫ్ లో ఎదురు కాకూడదు. మూడు షోలు రద్దు కావడంతో బాధను వర్ణించడానికి మాటలు రాలేదు.ఆ బాధల నుండి బ్రేక్ చేసుకొని సెకెండ్ షో రిలీజ్ చేసుకున్నాము. ఈ కఠిన సమయంలో ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలిచింది.వినాయక్ గారు, త్రివిక్రమ్ గారు, వంశీ పైడిపల్లి గారు, మంచు మనోజ్, సాయి ధరమ్‌ తేజ్, ప్రసాద్ గారు, నాగ వంశీ,బోయపాటి గారు,హరీష్ శంకర్  ఇలా చాలా మంది నాకు ఫోన్ చేసి నాకు మంచి సపోర్ట్ అందించారు. అయితే ఎన్నో అవాంతరాల్ని చాటుకొని సినిమా విజాయన్ని సాధించడం సంతోషాన్నిస్తోంది.

*ఉదయం నుండి ఎదురు చూసిన ఫ్యాన్స్, సెకెండ్ షో కు విపరీత మైన క్రవుడ్ తో సినిమాను చూడడానికి రావడంతో  థియేటర్ లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.50 శాతం అక్యుపెన్సీలో ఉన్న థియేటర్ లన్నీ హౌస్ ఫుల్ అవ్వడం రవితేజ గారు కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచింది.తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంత సినిమా లవర్సో ప్రూవ్ చేశారు.

*ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం స్టోరీ,మేము తీసుకొన్న బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ గా ఉంది.అందరూ వేట పాలెం బ్యాచ్,కటారి కృష్ణ,జయమ్మ,అంకడి బ్యాచ్ గురుంచి మాట్లాడుతున్నారు. కథలోనే రేయాలిస్టిక్ అప్రోచ్ తో పాటు కొత్తదనం ఉంది.సినిమా విడుదలై వారం దాటినా.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నది. కథలోని కొత్తదనంతో పాటు వాస్తవిక కోణంలో ఒంగోలు నేపథ్యాన్నితెరపై ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మాస్ యాక్షన్ సినిమాల్లో ఎప్పుడూ విలన్స్ … హీరో ఫ్యామిలీలో ఎవరో ఒకరిని చంపడం కామన్. అందుకే ఆ లీడ్ తీసుకొని అలా జరగదు అని చూపిద్దామనుకున్నాను. అందరు అక్కడ ఏదో ఊహించారు. కానీ నేను రాసుకున్నది వేరు… శృతి హాసన్ యాక్షన్ ఎపిసోడ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది.

*మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి చాలా సేపు మాట్లాడారు. అలాగే రామ్ చ‌ర‌ణ్‌గారు కాల్ చేసి సినిమా చూడగానే ట్వీట్ చేయాలనిపించింది. చాలా బాగా తీశారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి అని చెప్పారు. మెగా కాంప్లిమెంట్స్ నాకు మంచి బూస్టప్ నిచ్చింది

*సినిమాలో మా అబ్బాయి సాత్విక్ నటన కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలియకుండా చూశాను. కానీ వాడిలో నీ పోలికలు చూసి గుర్తుపట్టాను అని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారికి వాడి నటన బాగా నచ్చింది. ఇప్పుడు వాడు నన్ను ఏదైనా టూర్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు.

*ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం వస్తే తప్పకుండా ఆ బాధ్యతల్ని స్వీకరిస్తా. `క్రాక్` సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. క్రాక్ విజయం దర్శకుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. నేను కథలు రాసుకునే విధానంలో ఈ సినిమా మార్చు తీసుకొచ్చింది. ఈ సినిమా స‌క్సెస్ విషయంలో నేను 200 పర్సెంట్ హ్యాపీ. నా తదుపరి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ లో చేయబోతున్నా, లాక్ డౌన్ సమయంలోకథ రాసుకున్నా, విభిన్నమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here