Directer Sangeetam Srinivasa Rao written ‘Ajnatha Yashaswi’ drama performance on August 7th in Raveendra Barathi Auditoriam

ప్రపంచం గర్వించదగ్గ తెలుగు శాస్త్రవేత్త  యల్లాప్రగడ సుబ్బారావు. ఐదువేల సంవత్సరాల్లో… ఆయన కనిపెట్టినన్ని  ఔషధాలు,  ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు  చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆయనను ‘ మందుల మహామాంత్రికుడు’  అంటారు.  నోబెల్  బహుమతి రావాల్సిన వ్యక్తి . పెన్సిలిన్ కంటే ప్రభావ వంతమైన  యాంటీబయోటెక్ ‘క్లోరో టెట్రా సైక్లిన్’ ను ఆవిష్కరించినది ఆయనే . అలాగే, ఫ్లోరిక్ యాసిడ్  నుకనిపెట్టారు. కీమోథెరపీకి పునాది వేసిన మెడిసిన్ ‘మేథో ట్రెక్సీట్’‌ను,  బోధకాలునునివారించే ‘పెట్రాజెన్’‌ను ఆయనే  కనిపెట్టారు. ఒక్ కటని కాదు… మలేరియా, ఫైలేరియా , ప్లేగు, క్యాన్సర్, ఎనీమియా, హృద్రోగ సమస్యలు – ఎన్నో వ్యాధు లకు ఔషధాలు  కనిపెట్టిన మహానుభావుడు యల్లాప్రగడ సుబ్బారావు. అయితే, ఆయన గురించి చాలామందికితెలి యదు.  తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవా లని, ఎవరూ మర్చి పోకూడదని ప్రముఖ  దర్శకులు సింగీతం శ్రీనివాసరావు  ఓ నాటకం రచించారు.  కాలేజీలో చదివే రోజుల నుంచి సిం గీతం శ్రీనివాసరావుకు యల్లాప్ రగడ సుబ్బారావు అంటే అమితాసక్తి.  ఎప్పటికైనా యల్లాప్రగడ బయోపిక్  తీయాలనేది సింగీతం యాంబిషన్. అమెరికాలో ప్రజలకు సీవీ రామన్, శ్రీ నివాస రామానుజమ్ గురించి తెలుసు . కానీ, యల్లాప్రగడ  గురించి తెలియదు. అందుకని, అమెరికాలోని  యూనివర్సిటీల్లో ప్రదర్శించడానికి, అక్కడి తెలుగు ప్రజలు  అందరూ యల్లా ప్రగడ గురించి తెలుసు కోవాలని ఆయనపై ఇంగ్లిష్ లో ఏడెనిమిదేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు ఓ నా టకం రాశారు. మన దేశంలోని తెలుగు  ప్రజలు చాలామందికి ఆయన గురించి తెలియదనే  ఉద్దేశంతో ‘ అజ్ఞాత యశస్వి’ పేరుతో ఆ నాటకాన్ని డాక్టర్. రామ్ మోహన్ హోళగుండి  తెలుగులో అనువదించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్  అండ్ కల్చర్ – తెలంగాణ, నిషుంబిత సమర్పణలో ఈ నెల 7వ తేదీ   సాయంత్రం ఆరున్నర గంటలకు రవీంద్రభారతిలో  నాటకాన్నిప్రదర్శించనున్నారు. 

సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ “.. నా కాలేజీ రోజుల నుంచి యల్లాప్ రగడ బయోపిక్ తీయాలనేది  నా యాంబిషన్.  ఆయనకు సంబంధించిన కంటెంట్ నా దగ్గర బోల్డంత ఉంది. ఆయన బయోపిక్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.  గ్రేట్ బయోపిక్ అవుతుంది.   మన వాళ్లకి  మన చరిత్ర తెలియాలనే ఈ  నాటకం రాశా” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here