Director Koratala Siva interview about ‘Acharya’ Movie

అడవిలో ఉండే ఆచార్య(నక్సలైట్)ధర్మం కోసం ఒక టెంపుల్ టౌన్ లోకి వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తీసిన కథే ఆచార్య.ఇందులో ఇద్దరు స్టార్స్ వున్నా ఎవరి పాత్రకి తగ్గట్లు వాళ్లకు ఉంటుంది అన్నారు దర్శకుడు కొరటాల శివ. శ్రీమతి సురేఖ కొనిదల సమర్పణలో  కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి ,కాజల్ అగర్వాల్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,పూజా హెగ్డే హీరో హీరోయిన్లు గా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డిలు నిర్మించిన చిత్రం “ఆచార్య”. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 29న గ్రాండ్ విడుదల చేస్తున్నారు .ఈ సందర్భంగా  చిత్ర  దర్శకుడు కొరటాల శివ  పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

ఎప్పటి నుండో ఒక ఐడియా ఉంది.ఒక స్ట్రేంజర్ కొత్త ప్రపంచంలోకి రావడం అంటే ఒక టెంపుల్ టౌన్ లో ఒక నక్సలైట్ వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్.ఆ కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా చెయ్యడం జరిగింది. ధర్మం కోసం పాటుపడే ఇద్దరు బలమైన వ్యక్తులు కథే ‘ఆచార్య’ . ఇందులో ఉన్న రెండు ప్రధాన పాత్రలలో ఒకరు గురుకులంలో చదువుకుంటున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్ సిద్ధ చాలా సౌమ్యుడు, ఆచార్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

ఇద్దరి పాత్రలు వేరు వేరుగా ఉన్నా ఫైనల్ గా ఇద్దరి గోల్ ఒకటే.రెండు కాంట్రాస్ట్ బ్యాక్ డ్రాప్స్,రెండు కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ ఫైట్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది.టెంపుల్ టౌన్ లో ఉండే సిద్ధ అడవి ఎందుకు వెళ్ళాడు. అడవిలో ఉండే ఆచార్య టెంపుల్ టౌన్ లోకి ఎందుకు వచ్చాడు అనేది ప్రేక్షకులను చాలా కొత్తగా ఉంటుంది.ఈ సినిమా తర్వాత చాలా మంది యంగ్ స్టర్స్ సిద్ధలా ఉండాలి అనుకుంటారు. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా తీసిన కమర్షియల్ కథ ఇది. ప్రయోగాత్మకంగా తీసిన చిత్రం కాదు. అన్ని రకాల ప్రేక్షకులను, అభిమానులను అలరించే విధంగా మూవీ ఉంటుంది.

మొదట ఈ సినిమా చరణ్ కు అనుకుని కలవడం జరిగింది.అప్పుడు ఆయనకు డేట్స్ కుదరనందున ఈ కథ చిరంజీవికి షిఫ్ట్ అయ్యింది. ఇందులో చరణ్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అందుకే చాలా టఫ్ అని తెలిసీ కూడా చరణ్ కోసం చాలా వెయిట్ చేశాం.చివరికి చరణ్ కూడా ఈ ప్రోజెక్టు లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. సిద్ధాంతాలు, పోరాటాల నుండి తీయలేదు, వాళ్ళ పాత్ర, వాళ్ళ ఆశయాలు గురించి తీయడం జరిగింది.

ఒక హీరో విలన్ తో ధర్మం గురించి పోరాడే విధంగా ఉంటుంది. ధర్మం అవసరం అని అండర్ లైన్ చేసే కథ ఇది. హీరో ను కొత్తగా చూపించే ప్రయత్నం చేసే విధం గా చూపించడం జరిగింది.ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఎంగేజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా. బీస్ట్ మోడ్ లో ఉన్న హీరో చాలా హనేస్ట్ గా ఉంటాడు.

ఇద్దరూ కమర్షియల్ స్టార్స్, చాలా స్ట్రాంగ్ ఎక్స్ ప్రెషన్స్,ఎమోషన్స్ వస్తూనే ఉంటాయి. ఇది కమర్షియల్ సినిమా.ఎవరి పాత్రకి తగ్గట్లు వాళ్లకు ఉంటుంది. ఇద్దరు కలిసి ఉన్న సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. రామ్ చరణ్ ఎంట్రీ నుండి ఇంకా చాలా బాగుంటుంది.

యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఫిల్మ్ ఇది. అందరికీ నచ్చాలి. ప్లానింగ్ లేకుండా,పోస్ట్ ప్రొడక్షన్ కి ప్రాపర్ టైం లేకుండా చేయడం కొంచెం ఇబ్బంది అయింది.సైరా వలన కొంచెం ఢిలే అయితే ఆ తరువాత వచ్చిన ప్యాండమిక్ స్విచ్ వేషన్ వలన లేట్ అయ్యింది.ఈ సినిమా చాలా ఎమోషనల్, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అయితే చిరు పక్కన, చరణ్ ను బ్యాలన్స్ చేయగలనా అనిపించింది. కాకపోతే ఇద్దరు చాలా ఈజ్ గా మూవ్ అయ్యారు.చాలా మంది దర్శకులు సెట్స్ కు వచ్చి చూసేవారు.

ఇందులో సాంగ్ స్విచ్వేషన్స్ కు చాలా టప్ స్విచ్వేషన్. సాంగ్స్ పై వెళ్లే సినిమా కాదిది ఇందులో ఏది పడితే అది చేయలేం. ఆ పరిమితులను దాటుకుని మణిశర్మ చేసిన విధానం అద్బుతం.

ఈ చిత్రం కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ప్రొడక్షన్ కి చాలా కేర్ తీసుకున్నారు. టెంపుల్ బ్యాక్ గ్రౌండ్, రీసెర్చ్ చాలా చేశారు.మొదటి నుండి టైటిల్ ను ఆచార్య అనే అనుకున్నాను. కేజీఎఫ్ స్క్రిప్ట్ లో ఉండటం వలన పాన్ ఇండియా గా వచ్చింది.

మెసేజ్ ఇవ్వాలని ఆలోచించను. ఒక డిఫెరెంట్ వరల్డ్ లో డిఫెరెంట్ పాత్రను, స్ట్రాంగ్ పాత్రను ఇవ్వాలని తీస్తున్నా. భరత్ అనే నేను లో ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనేది సినిమా. శ్రీ మంతుడు లాంటి చిత్రం లో మొత్తం కుటుంబం కోసం కాకుండా, ఊరు కోసం చేయడం అనేది నాకు హీరోయిజం కనిపించింది. కొందరు పాత్రలను దృష్టి లో పెట్టుకొని తీసాము.ఇందులో కూడా స్ట్రాంగ్ ఎక్స్ ప్రెషన్ ఉంటాయి.ప్రతి ఒక్కరికీ కథ నచ్చేలా సినిమా ఉంటుంది.

ప్రతి సినిమా నాకు ఎగ్జాం లాంటిదే..రిజల్ట్ కోసం టెన్షన్ పడినట్లే ప్రతి చిత్రానికి టెన్షన్ ఉంటుంది.అలాగే  నా దగ్గర నా టీమ్ నాలుగేళ్లు స్ట్రక్ అయి పోయి ఉన్నారు. వాళ్ళు దర్శకులు అయితే వాళ్ళ సినిమాలు చూడాలని ఉంది.

స్వామి వివేకానంద మీద గాంధీ లాంటి సినిమా తీయాలని ఉంది. అందుకు అనుభవం రావాలి. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అతను. ఇండియా మొత్తాన్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ అతను.తీస్తే భారీ రేంజ్ లో తీయాలి అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి.ఈ “ఆచార్య” సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని కథను లాక్ చేశాము.వారం పదిరోజుల్లో ఎన్టీఆర్ కలుస్తా..ఎన్టీఆర్ గారు కూడా నన్ను డిస్ట్రబ్ చేయడం లేదు. సినిమా అయిన తరువాత నువ్వు వస్తే నిన్ను కిడ్నాప్ చేసుకుని పోతా.. అని అంటున్నాడు అని ముగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here