Disco Raja Movie Review

Release date :January 24th,2020
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Disco Raja
Banners:-SRT Entertainments
Starring:-Ravi Teja,Payal Rajput,Nabha Natesh,Tanya Hope,bobby simha,Vennela Kishor,Suneel,Satya,Satyam Rajesh
Music Director :-S.S. Thaman
Editor:-Shravan Katikaneni
Cinematography:-Karthik Ghattamaneni
Director :-VI Anand.
Producer :-Ram Talluri,Rajini Talluri.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై మాస్ మాహారాజ రవితేజ హీరోగా పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో,రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి లు నిర్మించిన  స్కైఫై థ్రిల్లర్ చిత్రం ‘డిస్కో రాజా’ .ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య నేడు ‘డిస్కో రాజా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన డిస్కోరాజా మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

వాసు (రవితేజ) ఓ అనాథ. లధాక్‌లో వాసు పై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి చంపేస్తారు. అక్కడే మంచులో వదిలేసి వెళ్లిపోతారు.వాసు డెడ్ బాడీని డాక్టర్ పరిణీతి (తాన్యా హోప్) బృందం ల్యాబ్‌కు తెప్పించుకుంటారు. ఛీఫ్ డాక్టర్ తన సైన్స్ ప్రయోగంతో చనిపోయిన వాసును మళ్లీ బతికిస్తాడు. కానీ వాసు గతం మర్చిపోతాడు. తనెవరో తెలుసుకునే క్రమంలో ఎంపీతో గొడవ పెట్టుకుంటాడు. దానివల్ల వాసు ఫేమస్ అయ్యి తన వాళ్ళను చూడగలుగుతాడు. అంతే కాకుండా చెన్నై నుండి సేతు (బాబీ సింహా) డిస్కో రాజ్ (రవితేజ)కు వాసుకు సంబంధం ఉందనుకుని వెతుక్కుంటూ వస్తాడు.సేతు ఎవరు? డిస్కో రాజ్ కు వాసుకు ఉన్న సంబంధమేంటి? వాసు కు డిస్కో రాజ్ కు ఉన్న గొడవలేంటి? చివరికి ఏమైంది?అనేది అసలు కథ..

నటీనటులు :
మాస్ మహారాజా రవితేజ నటనతో ఆకట్టుకున్నాడు. వాసు పాత్రలో రవితేజ జీవించిపోయాడు.వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు ఈమూవీతో కాస్త ఉపశమనం అని చెప్పుకోవాలి. ఇంతకు ముందెన్నడూ కనిపించని ఎనర్జీతో నటించడంతో మాస్ మాహారాజా అభిమానులకు కన్నులపండుగలా అనిపిస్తుంది. గత సినిమాలతో పొల్చుకుంటే రవితేజ కు కమర్షియల్ గా హిట్ వచ్చినట్లే అని చెప్పుకోవాలి.రవితేజ రెండు షేడ్స్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ లు మెయిన్ ఎస్సెట్ గా మారగా సెకండాఫ్ లోని అక్కడక్కడా సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది.  కిక్కు రేంజ్ లో రవితేజ నటన ఉంది. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ‘డిస్కో రాజ్’ పాత్రలో రవితేజ ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఆ క్యారెక్టర్ లో రవితేజ మ్యానరిజమ్స్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, లుక్,సెటప్ మొత్తం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సినిమాలో హీరోయిన్స్ నభా నటాషా, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ లకి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. కానీ తెరపై అందంగా కనిపించారు. ముఖ్యంగా నభా పాటల్లో ఆకట్టుకుంది. ప్రతినాయకుడిగా బాబీ సింహా నటన బాగుంది. రవితేజ-బాబీ సింహా కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. చాన్నాళ్ల తర్వాత సునీల్ కి మంచి పాత్ర దక్కింది. వెన్నెలకిషోర్,రవితేజ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ బాగా నవ్విస్తాయి. రాంకీ, సత్య, సత్యం రాజేష్.. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు :
ముఖ్యంగా తమన్ సంగీతం గురించి చెప్పుకోవాలి. తమన్ ఇచ్చిన సంగీతం ఈసినిమాకు హైలెట్ గా నిలుస్తుంది పాటలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాటిని తెరపై ఇంకా బాగా చూపించారు. రెండు పాటల్లో కథ కూడా భాగంగా ఉంటుంది.విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వీఐ ఆనంద్. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాల తర్వాత  వచ్చిన రవితేజ మరియు వి ఐ ఆనంద్ ల కాంబోలో తెరకెక్కిన ఈ స్కైఫై థ్రిల్లర్ సినిమా డిస్కో రాజా.ఇటీవల కాలంలో రవితేజ ఎనర్జిని ఫుల్లుగా వాడుకున్న దర్శకుడుగా వి. ఐ ఆనంద్ పేరు చెప్పవచ్చు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టులు సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేసాయి. అప్పటి వరకు కేవలం రవితేజపైనే కథ నడుస్తుంది. కథ పాతదే అయినా కొత్తగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పుకొవాలి. ఇక కార్తీక్‌ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఐస్ ల్యాండ్ లో సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా ఫ్రేమ్స్  ఆకట్టుకుంటాయి.ఫైట్స్ ఓకే. కథ విభిన్నంగా మొదలైనా తర్వాత రెగ్యులర్ రివెంజ్ డ్రామా రూట్ తీసుకుంటుంది.ముఖ్యంగా ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.మొత్తానికి మాత్రం కేవలం ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇవ్వడమే కాకుండా మాస్ మహారాజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక థ్రిల్లింగ్ జానర్ చిత్రంగా ‘డిస్కో రాజా’ నిలుస్తుంది అని చెప్పాలి.

    Cinema rangam.com..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here