DiscoRaja Movie Freaking Block Buster Celebrations

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా రామ్‌ తాళ్ళూరి ప్రొడక్షన్‌పై సాయి రిషిక సమర్పణలో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రజిని తాళ్లూరి నిర్మించిన సైన్స్‌ ఫిక్షన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ‘డిస్కోరాజా`. న‌భా న‌టేష్‌, పాయ‌ల్ రాజ్‌పూత్‌, తాన్య‌హోప్ హీరోయిన్స్‌. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. జ‌న‌వ‌రి 26 మాస్ మ‌హారాజ ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఆవాస హోట‌ల్‌లో ఫ్రీకింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ ను ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో…

మాట‌ల ర‌చ‌యిత అబ్బూరి ర‌వి మాట్లాడుతూ… మా `డిస్కోరాజా` చిత్రాన్ని ఇంత బాగా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు . నాకు ఈ సినిమా కోసం ముందు ర‌వితేజ‌గారి నుంచి ఫోన్ వ‌చ్చింది. ర‌వి నా సినిమాకి నువ్వు వ‌ర్క్‌చెయ్యాలి అన్నారు. ఏడాదికి మూడు సినిమాలు ఇవ్వ‌గ‌ల స‌త్తా ఉన్న హీరో ర‌వితేజ. ఆయ‌న ఎన‌ర్జీ అంత పీక్స్‌లో ఉంటుంది. అలాగే ఆయ‌నతో క‌లిసి ప‌ని చేసే ఏ ఆర్టిస్ట్ కైనా అదే ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ని ఇస్తారు. వి.ఐ. ఆనంద్‌గారు ఈ చిత్రం కోసంచాలా కేర్ తీసుకున్నారు. ప్ర‌తి చిన్న విష‌యంలో కూడా ఎంతో శ్ర‌ద్ధ వ‌హించారు. సునీల్‌, స‌త్యంరాజేష్ క్యారెక్ట‌ర్లు చాలా బావున్నాయి. రామ్‌తాళ్ళూరి ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ గురించి ఆడియ‌న్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. త‌మ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న ఊపేస్తున్నాడు“ అన్నారు.

న‌టుడు రాంకీ మాట్లాడుతూ… ర‌వితేజ‌గారు చాలా పెద్ద ఆర్టిస్‌. ఆయ‌న ఎన‌ర్జీ లెవ‌ల్స్ అన్నీ నేను సెట్స్‌లో చూశాను. డైరెక్ట‌ర్ వి.ఐ. ఆనంద్‌కి మంచి క్లారిటీ ఉంది. ఆయ‌న‌కి ఏం కావాలో ఆయ‌న‌కు బాగా క్లారిటీతో ఉంటారు. సినిమాల‌ని చాలా బాగా తెర‌కెక్కించారు. పాయ‌ల్ అద్భుత‌మైన న‌ట‌న‌ని క‌న‌బ‌రిచింది. సునీల్ డ్యాన్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఈ చిత్రంలో న‌టించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.

న‌టుడు సునీల్ మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో చాలా గొప్ప క్యారెక్ట‌ర్ ఇచ్చారు. నా కెరిర్ లోనే చాలా మంచి క్యారెక్ట‌ర్. అంతేకాక సిక్స్ ప్యాక్ చేసి అన్ని బాష‌ల‌లో విల‌న్‌గా చేయాల‌నేదే నా కోరిక. అలాగే సినిమా మొత్తం స‌స్పెన్స్ మేంటేన్ చేస్తూ చాలా బాగా తీశారు వి.ఐ. ఆనంద్‌గారు. అబ్బూరిర‌వి నా ఫ్రెండ్‌. నాకోసం డైలాగ్స్ చాలా బాగా రాశారు. అంతేకాక నేను హీరోగా న‌టించే చిత్రాల‌కు కూడా స్పెష‌ల్‌గా ఆయ‌న డైలాగ్స్ రాసిఇస్తారు. రాంకీగారి గ్లామ‌ర్ అదుర్స్‌. ఇప్ప‌టికి ఆయ‌న్నుచూస్తుంటే `సింధూర‌పువ్వు` సినిమానే గుర్తుకువ‌స్తుంది. ర‌వితేజ‌గారి స్టైల్‌ని ఈ చిత్రంలో మొయిన్‌గా గుర్తుంచుకోవాలి. ర‌వితేజ‌గారు ఎప్పుడూ కూడా ఏదో ఒక ప‌ని చేస్తూ బిజీగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఆయ‌న టైమ్ వేస్ట్ చేసుకోరు. ఇంకొక‌రి టైమ్‌ కూడా వేస్ట్ చెయ్య‌రు. ఇక పాయ‌ల్ విష‌యానికి వ‌స్తే డైలాగ్స్ లేక‌పోయినా చాలా అద్భుతంగా న‌టించింది“ అన్నారు.

ప్రొడ్యూస‌ర్ రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ… ర‌వితేజ‌గారి పుట్టిన‌రోజు కి ఆయ‌న‌కు మంచి సినిమాను ఇచ్చాము అని అనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మిమ్మ‌ల్ని కూడా ఈ సినిమా అంతే అల‌రిస్తుంద‌ని భావిస్తున్నాను అన్నారు.

న‌టుడు బాబిసింహా మాట్లాడుతూ… ఈ మూవీకి ఇంత స‌పోర్ట్ చేస్తున్నందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. హండ్రెడ్ ప‌ర్సంట్ శాటిస్‌ఫై చెయ్య‌డం చాలా క‌ష్టం. ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా చేశారు. నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశ‌మిచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పూత్‌ మాట్లాడుతూ… నా కొత్త సినిమా ఇంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ చేసినందుకు మీ అంద‌రికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. మీరిచ్చే ఈ ప్రేమాభిమానాలు నేనెప్పుడూ మ‌ర్చిపోలేను. హెలెన్ పాత్ర నాకు పెద్ద ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ అనే చెప్పాలి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా మొత్తం కేవ‌లం నా హావ‌భావాల‌ను ప‌లికిస్తూ సినిమా అంతా చెయ్యాలి. నాకు ఇంత మంచి క్యారెక్ట‌ర్‌ని ఇచ్చినందుకు డైరెక్ట‌ర్ ఆనంద్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. నాకు సునీల్‌గారి పాత్ర బాగా న‌చ్చింది. ఎక్కువ‌గా నాకు నెగిటివ్ క్యారెక్ట‌ర్స్ బాగా న‌చ్చుతాయి. ర‌వితేజ‌గారితో క‌లిసి పని చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు వి.ఐ. ఆనంద్ మాట్లాడుతూ… ఈ చిత్రం కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఒక ప్రేమ‌, ఒక‌త్యాగం, అలాగే ఎంతో హ్యాపీనెస్‌తో ప‌ని చేశారు. ఈ మూవీ కోసం ప్ర‌తి ఒక్క‌రూ బ్ల‌డ్ అండ్ స్వెట్ పెట్టి ప‌నిచేశార‌నే చెప్పాలి. ర‌వితేజగారు ఈ సినిమా కోసం ఎక్కువ కాలం స్పెండ్ చేశారు. నిర్మాత‌లు రామ్‌, ర‌జ‌నీగార్లు క్యార‌వాన్ ఉన్నా లేక‌పోయినా ఎంతో క‌ష్ట‌ప‌డి షూటింగ్ స్పాట్‌కి వ‌చ్చి మ‌రీ అన్నీ దగ్గ‌రుండి చూసుకునేవారు. రామ్‌గారు మాతో క‌లిసి ఐస్‌ల్యాండ్‌కి కూడా వ‌చ్చారు. అక్క‌డ ఆయ‌న ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, కెమెరామెన్‌కి అసిస్టెంట్‌గా ఇలా ఏమాత్రం ఇగో ఫీలింగ్స్ లేకుండా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. బాబి సింహాగారు కూడా బాగా న‌టించారు. నేను ఆయ‌న సీన్స్ కొన్ని క‌ట్ చేయ‌డం జ‌రిగింది. అయినా కూడా ఆయ‌న ఏమాత్రం ఫీల‌వ్వ‌లేదు. న‌రేష్‌గారు కూడా ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర‌ని పోషించారు. సునీల్ పాత్ర కూడా చాలా బాగా వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్ కి వెళ్ళి మా సినిమాని చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. అబ్బూరిర‌విగారు డైలాగ్స్ కూడా చాలా బాగా వ‌చ్చాయి. ఆయ‌న హెల్త్ బాలేక‌పోయినా మ‌ధ్య‌లో ఎప్పుడూ ర‌మ్మ‌న్నా కూడా ఏమాత్రం ఆలోచించ‌కుండా మా కోసం వ‌చ్చేవారు. ఇంకా సినిమా చూడ‌ని వారు ఎవ‌రైనా ఉంటే వెళ్ళి చూడండి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు“అన్నారు.

మాస్ మ‌హారాజ ర‌వితేజ మాట్లాడుతూ… అబ్బూరి ర‌వి నాకు చాలా చిత్రాల‌కు ప‌ని చేశారు. ఆయ‌న నాకు మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి. ఆయ‌న‌కు నేనంటే చాలా ఇష్టం. నాకు ఆయ‌నంటే చాలా ఇష్టం. ఆర్ట్ డైరెక్ట‌ర్‌నాగేంద్ర‌గారు ఆయ‌న క‌నిపించ‌రు. కేవ‌లం ఆయ‌న ప‌నిత‌నం మాత్ర‌మే క‌నిపిస్తుంది. రాంకీగారు సింధూర‌పువ్వు స‌మ‌యంలో ఎలా ఉన్నారో ఇప్ప‌టికీ అలానే ఉన్నారు. బాబిసింహా మీ పాత్ర చాలా బాగా వ‌చ్చింది. మీ పాత్ర మా అబ్బాయికి బాగా న‌చ్చేసింది. సునీల్ నేను ఇప్ప‌టివ‌ర‌కు చాలా చిత్రాల్లో క‌లిసి న‌టించాం. కానీ ఈ చిత్రంలో మాత్రం చాలా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించాం. పాయ‌ల్ క్యారెక్ట‌ర్ చాలా బావుంటుంది. ఎంతో బాగా న‌టించింది. ఘ‌ట్ట‌మ‌నేని కార్తిక్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. చాలా బావుంది. త‌మ‌న్ ప్ర‌స్తుతం రాక్ స్టార్‌. ఇప్పుడు ఆయ‌న శుక్ర‌మ‌హాద‌శ శివ‌తాండ‌వం చేస్తోంది. రామ్ తాళ్ళూరిగారు రెగ్యూల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. ఆయ‌న ఏదో ఒక కొత్త‌ద‌నం కోరుకుంటారు. చాలా ప్యాష‌నేట్ నిర్మాత ఆయ‌న‌. నా పాత్ర‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నాకు ఇంత మంచి స‌క్సెస్‌ని ఇచ్చినందుకు ఆడియ‌న్స్‌కి బిగ్ థ్యాంక్స్‌. అలాగే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి ఎంతో స‌పోర్ట్‌ని అంద‌జేశారు వాళ్ళ‌కి కూడా థ్యాంక్స్ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో స‌త్యంరాజేష్‌, డిఒపి కార్తీక్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ నాగేంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here