Distributor Prasanth Goud Support for Small Movies

చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలను విడుదల చేయడమంటే మామూలు విషయం కాదు. మధ్యతరహ సినిమాలను విడుదల చేయాలంటేనే నిర్మాతలకు తలప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది చిన్న నిర్మాతల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సంవత్సరాలుగా కొన్ని చిత్రాలు ల్యాబుల్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సినిమా అంటే ప్యాషన్ తోనే ఈ రంగంలోకి వస్తారు. అదేవిధంగా సినిమాను వ్యాపారంగా చేసుకొని ఉన్నదాంట్లో నిజాయితీగా నాలుగు రుపాయాలు సంపాదించుకుందామనే ఆలోచనతో, ఆస్తులు అమ్మి, ఫైనాన్స్ తీసుకొని ఎంతో కష్టపడి నిర్మిస్తారు. కాని ఆ చిత్రాలు విడుదలకు నోచుకోవు. సొంతంగా విడుదల చేద్దామనే సాహసం చేస్తే థియేటర్లు కూడా రెంట్ కు దొరకని పరిస్థితుల్లో ఆర్థకలితో నిద్రించే నిర్మాతలు తెలుగు పరిశ్రమలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారికి అండగా, చిన్న సినిమాలకు పెద్దన్నగా నిలబడుతున్నాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్. తమకున్న బడ్జెట్లో సినిమాలను తీసి, వాటిని రిలీజ్ చేసి వచ్చే డబ్బులను మళ్లీ సినిమాలపై పెట్టే నిర్మాతలకు అండదండగా ఉండే ఒకే ఒక వ్యక్తి ప్రశాంత్ గౌడ్.

ప్రశాంత్ గౌడ్ ఈ పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతల పట్ల భరోసా. ఒకరకంగా చెప్పాలంటే చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ధైర్యశాలి. గత 12 సంవత్సరాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దేనికి సడలక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటూ ఇప్పటికి 45 కు పైగా చిన్న సినిమాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసి ఆ నిర్మాతల కుటుంబంలో సంతోషానికి కారకుడయ్యడు. సార్ధక మూవీస్ పతాకంపై పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఫైనాన్సర్ గా వ్యవహరించారు. ఇతర భాషా చిత్రాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేశారు. తనకున్న ఎగ్జీబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ల పరిచయంతో స్క్రీన్స్ లీజ్ తీసుకొని మరి చిన్న సినిమాలను ఆదుకునే ఘనుడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు మంచి సినిమానా కాదా అనేది ఆయన సిద్దంతం. అందుకే పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు, పెద్ద నిర్మాతలు ఉన్నప్పటికీ తనను నమ్ముకున్న నిర్మాతల కోసం నిలబడే మానవతా వాది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిన్న సినిమాలు కూడా బ్రతకాలి అనే ఒకే ఒక ఆకాంక్షతో చిన్న నిర్మాతలకు పెద్దన్నగా మారారు ప్రశాంత్ గౌడ్.

ప్రశాంత్ గౌడ్ ఉన్నారన్న ధైర్యంతోనే చిన్న నిర్మాతలు సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో సినిమాలను తన భుజస్కందాలపైన మోసిన డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ తాజాగా విడుదలైన తురుమ్ ఖాన్ లు చిత్రాన్ని కూడా ఆయనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకవైపు జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి లాంటి సినిమాలు ఉన్నా సరే మంచి సినిమాలు ఎన్ని వచ్చినా ప్రేక్షకులు ఆధారిస్తారనే నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి… చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరని మరోసారి రుజువు చేశారు. మామూలుగా ఒకరికి సాయం చేస్తేనే మనందరం అతన్ని మహాత్మునిలా చూస్తాము, అలాంటిది ఒక సినిమాకు సాయం చేయడం అంటే దాదాపు ఒక వంద, రెండోందల మందికి సాయం చేసినట్లే. అందుకే తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలను నిర్మించే నిర్మాతలు ప్రశాంత్ గౌడ్ పెద్దన్న అనడంలో సందేహం లేదు. ఇంకా ఇలాంటి ప్రశాంత్ గౌడ్ లు తెలుగు ఇండస్ట్రీకి కావాలని చిన్న నిర్మాతలు కోరుకుంటున్నారు. మరిన్ని మంచి సినిమాలు రావలంటే ప్రశాంత్ గౌడ్ విజయవంతంగా ముందుకు సాగాలని ఇండస్ట్రి వర్గాల్లో చిన్న నిర్మాతలు చర్చించుకుంటున్నారు. ఏదేమైన సినిమా బతకాలంటే ఇలాంటి వారు ఇండస్ట్రిక అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here