Dynamic Director Maruti Birthday Special Interview

కరోనా కారణంగా వచ్చిన ఈ కాళీ సమయంలో కొన్ని కొత్త కథలు రాసుకొని వాటిని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంగా హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ మారుతి మీడియాతో ముచ్చటించారు.

కోవిడ్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది అని మీరు అనుకుంటున్నారు?

– ప్రొడక్షన్ పరంగా కొంత ఇబ్బంది ఉన్నపటికీ, ఆడియన్స్ సినిమాలు చూడటం ఆపలేదు, కొత్త కొత్త జెనెర్స్ చూస్తూ ఉన్నారు, ఐతే సినిమా నిర్మాణంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు వచ్చాయి, అవి కూడా ఇప్పుడు ఓవర్ కం అయ్యి అంత సాధారణ స్థితికి వచ్చింది అని నేను భావిస్తున్న.

50 పెర్సెంట్ ఆడియన్స్ తో థియేటర్స్ ని తెరవచ్చు అని ఆమోదం వచ్చింది, ఇది ఎలాంటి పరిణామంగా భావించవచ్చు?

– అసలు లేకపోవడం కంటే ముందు ఒకరు వచ్చిన బొమ్మ వేయడం మొదలు పెట్టడం నయం కదా, ఇప్పుడు 50 శాతం ఆడియన్స్ తో థియేటర్స్ నడిపించే అవకాశం దొరికింది, ఇది కచ్చితంగా శుభ పరిణామం, జనవరికి 100 శాతం ఆడియన్స్ తో థియేటర్స్ తెరిచే పరిస్థితి వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న

కోవిడ్ 19 లాక్ డౌన్ ని ఎలా స్పెండ్ చేశారు?

– కరోనా కారణంగా వచ్చిన ఈ కాళీ సమయాన్ని నా వరకు నేను క్రియేటివ్ గా మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకున్న, స్టోరీ డిస్కషన్స్, కొన్ని కొత్త కథలు రాసుకున్న, ముందు మాదిరిగా ఒక స్టోరీ తరువాత మరో స్టోరీ ని రెడీ చేసే పద్దితి నుంచి కాస్త బయట పడ్డాను, ఇప్పుడు నా చేతిలో ఒక మూడు నాలుగు కథలు ఉన్నాయి, అన్ని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మీ అప్ కమింగ్ మూవీస్ గురించి చెప్పండి

– నా మాతృ సంస్థలు యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న, ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి వెళ్తున్న ఇంక కొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి, త్వరలోనే ఆ విషయాలు కూడా వెల్లడిస్తాను.

వెబ్ లోకి ఎంటర్ అవుతున్నారు అని తెలిసింది, నిజమేనా?

– ఓ వెబ్ సిరీస్ కి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న, ఇది ఓ కొత్త టీం చేస్తున్నారు.c

ఓటిటి ల ప్రభావంతో థియేటర్స్ కి దెబ్బ అనే వాదన గురుంచి మీరు ఏం అంటారు?

– ఎన్ని వచ్చిన థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ని ఏది ఇవ్వలేదు, ఐతే ఓటిటి కారణంగా కూడా ఉపయోగాలు ఉన్నాయి, కొత్త టాలెంట్ వస్తున్నారు, కొత్త కథలు, కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here