Dynamic Star Manchu Vishnu’s Love & Action Comedy Entertainer ‘Ginna’ Movie Review

Cinemarangam.Come
సినిమా : “జిన్నా”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల : 21.10.22
నిర్మాతలు : అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకత్వం ::ఈషన్ సూర్య హెల్మ్
నటీ నటులు : మంచు విష్ణు,సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, నరేష్, రఘుబాబు, అన్నపూర్ణమ్మ తదితరులు
సినిమాటోగ్రఫి : ఛోటా కె. నాయుడు
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
పి. ఆర్. ఓ : పవన్ పాల్


డైనమిక్ హీరో మంచు విష్ణు టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘జిన్నా’. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే ను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు.పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్ హీరోయిన్స్‌. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ.. 


కథ
జిన్నా అనేది నలుగురు స్నేహితుల కథ. చిత్తూరు జిల్లాలోని రంగం పేటలో ఉండే గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా (మంచు విష్ణు) తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక టెంట్ హౌస్ నడుపుతుంటాడు. కానీ ఏ పెళ్లికి వెళ్లి టెంట్ వేసినా కూడా ఆ పెళ్లి ఆగిపోతూ ఎప్పుడూ ఏదో ఒక చేదు జరుగుతూనే ఉంటుంది. దాంతో ఊరి నిండా అప్పులు ఉంటాయి. తన బాబాయ్ ఆ ఊరి ప్రెసిడెంట్ కానీ జిన్నా అంటే పడదు. జిన్నా ఎలక్షన్ లో నిలబడి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు కానీ దానికి కావాల్సినంత డబ్బు ఉండదు. ఆ ఊరిలో ఉండే ఒక  గుండా జిన్నా కి అప్పు ఇచ్చి అప్పు తీర్చలేక ఇబ్బంది పడుతుంటాడు.ఇంతలో అనుకోకుండా చిన్నప్పుడు విదేశాలకు వెళ్లిపోయిన తన ఫ్రెండ్ డెఫ్ & డమ్ అయిన రేణుక (సన్నీ లియోన్) తిరిగి వస్తుంది. తాను జిన్నా ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటా అంటుంది. కానీ జిన్నా స్వాతి (పాయల్) ని ప్రేమిస్తాడు. కానీ డబ్బు కోసం రేణుక ని ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు.కానీ ఒక సందర్భంలో సన్నీ లియోన్ తన చిన్నప్పటి ఫ్రెండ్ రేణుక కాదని తెలుస్తుంది. ఇంతకీ సన్నీ ఎవరు, తన చిన్నప్పటి ఫ్రెండ్ కి ఏమైంది, జిన్నా అప్పులు తీర్చుకిని ప్రెసిడెంట్ అయ్యాడా లేదా అనేది తెలుసుకోవాలంటే జిన్నా సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు …
జిన్నాగా మంచు విష్ణు పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంది.తను చాలా ఎనర్జీటిక్ గా యాక్షన్, కామెడీ సన్నివేశాల్లో, డైలాగ్స్ లలో అద్భుతంగా నటించాడు. అయితే ఈ సారి మాత్రం విష్ణు తన స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాయల్ రాజ్‌పుత్ తన అందంతో ఆకట్టుకోవడమే కాకుండా  రా & రఫ్ క్యారెక్టర్ లో మేకప్ లేకుండా విలేజ్ గర్ల్ గా స్వాతి పాత్రలో పికిల్స్ అమ్మే అమ్మాయిగా చాలా బాగా నటించింది . సన్నీ లియోన్ కొన్ని పోర్షన్స్‌లో బాగుంది, ఎప్పటిలాగే, ఆమె తన గ్లామర్‌తో మెరిసి పోయినా డెఫ్ & డమ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. . కమెడియన్స్‌గా సద్దాం, మైసూర్ బాబ్జీ పాత్రలో వెన్నెల కిషోర్,రాకేష్ మాస్టర్ పాత్రలో చమ్మక్ చంద్ర పాత్రలు సినిమా ఆద్యంతం నవ్విస్తాయి. మరియు నరేష్, రఘుబాబు, అన్నపూర్ణమ్మ తమ వంతు పాత్రలకు న్యాయం చేసారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో టైటిల్ లో వున్న కొత్తదనం సినిమాలో వుండేలా కోన వెంకట్ స్క్రీన్ ప్లే తో జి.నాగేశ్వరరెడ్డి గార అందించిన కథను దర్శకుడు సూర్య ఎక్కడా  కాంప్రమైజ్ కాకుండా ఎక్స్ప్రెషన్స్ విషయంలో కానీ , కామెడీ విషయంలో కానీ, నటనలో కానీ  ప్రతి దానికి సీరియస్ గా తీసుకుని నటీ, నటుల దగ్గరనుండి చక్కని నటనను రాబట్టుకుంటూ ఊహకందని మలుపులతో అద్భుతంగా తెరాకెక్కించాడు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.. మంచు విష్ణు కూతుర్లు అరియనా, వివియానాలు పాడిన ఇదీ స్నేహం అనే పాట అందరినీ ఆకట్టుకుంటుంది చోటా కే నాయుడు అందించిన విజువల్స్ అద్భుతంగా నిలుస్తాయి ,ప్ర‌భుదేవా, ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ. ఛోటా కె.ప్ర‌సాద్‌ ఎడిటింగ్ బాగుంది , ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అందరి పనితనం ఈ సినిమాలో కనిపిస్తుంది..అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన “జిన్నా” సినిమా ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉన్న ఈ సినిమా చివరవరకు ప్రేక్షకుడిని యంగేజ్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అలాగే పార్ట్ 2 కోసం కూడా లైన్ వదిలేశారు. ఈ సినిమా చూడాలని టికెట్ కొనుక్కొని వచ్చిన ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నిరాశపర్చదు అని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam. Com Reviews Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here