Emotional Family Entertainer ‘KrishnaRama’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “ కృష్ణారామా ”
విడుదల తేదీ : అక్టోబర్ 22, 2023
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యాన‌ర్‌: అద్వితీయ మూవీస్
నిర్మాత‌లు : వి వెంకట కిరణ్, హేమ మాధురి
స్క్రీన్ ప్లే, డైలాగ్, స్టోరీ, ద‌ర్శ‌క‌త్వం: రాజ్ ముదిరాజు
న‌టీనటులు : నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్, చరణ్ లెక్కరాజు, రవి వర్మ త‌దిత‌రులు
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రాఫ‌ర్‌: రంగనాథ్ గోగినేని
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖీ


‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ మాదిరాజు మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ప్రస్తుతం చాలామంది పిల్లలు ఉద్యోగ, వ్యాపార రీత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు .అలాంటి తల్లిదండ్రులు తమ మనసులో భావాలను పంచుకునేవారు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని తీసిన సరికొత్త సినిమానే “కృష్ణారామా”.. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో, అనన్య శర్మ శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్, చరణ్ లెక్కరాజు, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని దసరా సందర్బంగా ఓటిటి లో విడుదలైన “కృష్ణారామా”..సినిమా ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం పదండి.


కథ:
ఎంతో అన్యోన్యంగా జీవించే కృష్ణవేణి అలియాస్ కృష్ణ (గౌతమి) రామతీర్థ అలియాస్ రామ (రాజేంద్ర ప్రసాద్).. ఇద్దరూ రిటైర్డ్ టీచర్లు.వీరికి ముగ్గురు పిల్లలు. వారికి మంచి చక్కని భవిష్యత్తు ఇవ్వాలని ఎంతో శ్రమించి చదిస్తారు.. వారిశ్రమ ఫలితం పిల్లలు ఎంచక్కా ఫ్యామిలీలతో సహా విదేశాలలో బాగా సెటిల్ అయిపోయారు. పిల్లల సక్సెస్ తో బిజీగా ఉన్న వీళ్ళు తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే కేవలం ఒంటరితనం మిగిలింది. అయితే ఇక పిల్లలకి వీళ్ళకి మధ్య దూరం పెరగడం, నెలకు ఒక్కరోజు మాత్రమే విడియో కాల్ మాట్లాడడం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియా ద్వారా అయినా పిల్లలకు దగ్గరవ్వాలని “కృష్ణారామా” పేరుతో ఫెస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి వారి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటారు. అయితే షోషల్ మీడియా ప్రభావంతో వీరి జీవితంలో ఊహించని మార్పులు రావడమే కాకుండా ఎంతో అన్యోన్యంగా వీరి జీవితంలో కలహాలు ఏర్పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అసలు వీరి జీవితంలో జరిగిన మార్పులు ఏంటి? వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి? పిల్లలతో కలసి ఉండాలనే వీరి కోరిక వేరిందా లేదా? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “కృష్ణారామా” సినిమా చూడాల్సిందే…


నటీ నటుల పనితీరు
కృష్ణవేణి ,రామతీర్థ అనే పాత్రలు రాజేంద్రప్రసాద్, గౌతమి కోసమే రాశారా అనిపిస్తుంది. అంతగా వారు ఆ పాత్రలో ఇమిడిపోయారు. అనన్య శర్మ చేసింది చిన్న పాత్ర అయినా సినిమాపై ఆమె ప్రభావం చాలా ఉంది.శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్, చరణ్ లెక్కరాజు, రవి వర్మ వంటి నటీనటులు అందరూ తమ వంతు పాత్ర అద్భుతంగా పోషించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి ఒక వృద్ధ జంట
50 ఏళ్లు కలిసి బతికిన తర్వాత ఇద్దరి మనసుల్లో నిండిన నిరసనలు, తమ మనసులోని ఒంటరితనం బాధను పెయిన్ గెస్ట్ ద్వారా తగ్గించుకోవాలని చూడడం.. ఈ మధ్యలో సోషల్ మీడియా వాళ్ల జీవితాల్లో తెచ్చే మార్పు. ఒకపక్క సోషల్ మీడియా వల్ల కలిగే మంచిని చూపిస్తూనే రెండో వైపు పెద్దలకే కాదు పిల్లలకి కూడా ఇది ఒక రంగుల ప్రపంచం లా కనిపించినా ఇది సాలిగూడు లాంటిది. వెళ్లి చెప్పుకుంటే బయటకు రావడం ఎంతో కష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతామని దర్శకుడు రాజ్ మాదిరాజు అద్భుతంగా తెరకెక్కించాడు.

సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన పాటలు కూడా జరుగుతున్న కథకు అనుగుణంగా ఎంతో బ్యాలెన్స్ గా ఉన్నాయి. రంగనాథ్ గోగినేని సినిమాటోగ్రఫీ బాగుంది. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ పనితీరు బాగుంది. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వి వెంకట కిరణ్, హేమ మాధురి లు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ దసరా సమయంలో ఫ్యామిలీ తో కలసి హాయిగా చూసే సినిమా అని కచ్చితంగా చెప్పచ్చు.

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here