Emotional family entertainer ‘Mr PREGNANT’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : మైక్ మూవీస్
సినిమా : “Mr ప్రెగ్నెంట్”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 18.08.2023
నిర్మాతలు : అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
దర్శకుడు : శ్రీనివాస్ వింజనంపాటి
నటీనటులు : సోహెల్, రూపా కొడవాయుర్, సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు
కెమెరామెన్ : నిజార్ షఫి
సంగీతం : శ‌్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో : జీఎస్‌కే మీడియా

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన సయ్యద్ సోహైల్ రియాన్ పలు క్రేజీ మూవీస్ తో టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఇందులో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో సోహైల్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రూపా కొడవాయుర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నైజాంలో విడుదల చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న గ్రాండ్ గా రిలీజైన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’  సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ :
గౌతమ్‌(సోహైల్‌) సిటీలో మంచి ట్రెండింగ్ టాటూ ఆర్టిస్ట్ తన అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగా పెరిగి . ఫేమస్‌ టాటూ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. మహి (రూపా కొడువయుర్‌) గౌతమ్ ను చూసి ప్రేమలో పడుతుంది.ఆ విషయం తనకు చెప్పాలని వెంటపడినా కానీ ఆమెని పట్టించుకోడు గౌతమ్‌. ఒక రోజు పార్టీ లో మందు తాగిన టైంలో నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అంటే జీవితాంతం పిల్లలు వద్దనుకుంటేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెడతాడు. తరువాత గౌతమ్ ను కన్విన్స్ చేయచ్చు అనుకొని ఓకే చెపుతుంది.ఆ తరువాత గౌతమ్ కొంతమంది పెద్దలతో మహి వారి అమ్మ నాన్నలతో పెళ్లి గురించి మాట్లాడాలని వారి ఇంటికి వెళ్ళగా గౌతమ్ ను ఇంటిలోకి కూడా రానివ్వకుండా అవమానిస్తారు. అలాగే గౌతమ్ కావాలా తల్లి తండ్రి కావాలా అని అడగగా గౌతమ్ కావాలని తనతో వెళ్ళిపోయి తరువాత రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు.ఎంతో అన్యోన్నంగా వీరి లైఫ్‌ సాగుతున్న క్రమంలో సడెన్‌గా నేను ప్రెగ్నెంట్‌ అని గౌతమ్ కు షాకింగ్ న్యూస్ చెపుతుంది మహి. తను చెప్పిన మాటలకు పిల్లలు వద్దనుకున్న గౌతమ్ రియాక్షన్ ఏంటి? ఆ తరువాత ఎం జరిగింది ? మహి ప్రెగ్నెంట్ అయితే.. గౌతమ్ ఎలా ప్రెగ్నెంట్‌ అయ్యాడు? దాని వెనకాల ఉన్న బ్యాక్‌ స్టోరీ ఏంటి? వీరికి డాక్టర్ వసుధ (సుహాసిని మణిరత్నం) ఎలాంటి సహాయం అందజేసింది. మేల్ ప్రెగ్నెంట్‌ ద్వారా సమాజంలో గౌతమ్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి మేల్ ప్రెగ్నెంట్‌ డెలివరీ జరిగిందా లేదా ? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ‘Mr ప్రెగ్నెంట్’ సినిమా చూడాల్సిందే…

నటీనటుల పనితీరు : 
గౌతమ్ పాత్రలో నటించిన సొహైల్ తనకిచ్చిన పాత్రలో జీవించాడని చెప్పవచ్చు . ఫస్టాఫ్ మొత్తం తన రెగ్యులర్ నటనను కనపర్చిన సొహైల్.. సెకండాఫ్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా.. గర్భవతిగా జాగ్రత్తగా వ్యవహరించే సొహైల్ నటన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. అలాగే.. గర్భవతులైన మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను, కష్టాలను తెలిపే విధంగా చాలా బాగా నటించి మహిళల మనసును గెలుచుకొన్నాడు.రూప పాత్రలో నటించిన కొడవయూర్ మరోమారు ఆకట్టుకుంది.అయితే..లవ్ సీన్స్ లలో సహజంగా నటించి మెప్పించింది. సోహైల్, రూపా పోటీ పడి ఫర్ ఫార్మ్ చేశారు. సోహైల్ కు ఎంత పేరొస్తుందో, రూపకు కూడా అంతే మంచి పేరు వస్తుంది.వైవా హర్ష ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో ఇరగ నవ్వించాడు. బ్రహ్మాజీ, అభిషేక్ ల కామెడీ ట్రాక్ చాలా ఫన్ క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. డాక్టర్ వసుధ పాత్రలో నటించిన సుహాసిని మణిరత్నం ఉన్నంతలో చక్కగా నటించింది. ఇంకా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : 
అమ్మతనం అనే బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచతో Mr ప్రెగ్నెంట్ అనే సెన్సిటివ్ సబ్జెక్ట్ ఉన్న కథ రాసుకుని హుందాగా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా చాలా జాగ్రత్తగా, కత్తి మీద సాములా రూపొందించి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.సినిమా చూశాక మీ సిస్టర్స్, మదర్ ను హగ్ చేసుకునేలా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం & నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్..“హే చెలి అడిగాను కౌగిలి తీయ‌గా తీరాలి ఈ చ‌లి..“ వంటి పాటల చిత్రీకరణ, సంగీతంతో పాటు ఇందులో ఉన్న పాటలన్నీ వినసోంపుగా ఉన్నాయి. నేపధ్య సంగీతం మాత్రం హృద్యంగా ఉంది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పని తీరు బాగుంది.

మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కదిలించే ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాను కుటుంబ సభ్యులు , లవర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కలిసి చూసేవిధంగా ఉన్న మిస్టర్ ప్రెగ్నంట్ వంటి న్యూ జానర్ మూవీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here