Emotional Political thrillar “KOTA BOMMALI PS” Movie Review

Cinemarangam.Com
సినిమా : “కోటబొమ్మాళి PS ”
విడుదల తేదీ : నవంబర్ 24, 2023
రివ్యూ రేటింగ్ : 3. 25 /5
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
దర్శకుడు: తేజ మార్ని
నటీనటులు : శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ తదితరులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
డి ఓ పి : జగదీష్ చీకాటి
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్


తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను నిర్మించింది జీఏ 2 సంస్థ. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు చక్కన స్పందన రాగా, ఇటీవల విడుదల చేసిన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.. 

కథ
ఆంధ్రప్రదేశ్ లోని టెక్కలి నియోజకవర్గానికి సంబందించిన కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్ లో ఉండే ఏ. యస్. ఐ చింతాడి రామకృష్ణ (శ్రీకాంత్ ) కు పోలీస్ శాఖలో ఎంతో అనుభవం ఉంది. అడవుల్లో కూంబింగ్ చేసి, ఎన్నో ఎన్కౌంటర్లకు కేస్ ఫైల్స్ రాసిన చరిత్ర తనది . అదే పోలీస్ స్టేషన్ లో కొత్తగా జాయిన్ అయిన రవి (రాహుల్ విజయ్ ), మల్లేటి కుమారి (శివాని రాజశేఖర్ )లు ఒక పెళ్ళికి వెళ్లి జీపులో తిరిగి వస్తుండగా అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడతాడు . హాస్పిటల్ కు తీసుకెళ్లేలోగా ఆ వ్యక్తి మరణిస్తాడు. అయితే అదే నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తారు. జీపు నడిపింది వీరు ముగ్గురు కాకపోయినా ఆ కేస్ వీరిపై పడుతుంది. దాంతో ఆ వర్గానికి చెందిన వారు వీరిని వెంబడించగా ఆ తప్పు మేము చేయలేదని నిరూపించుకోవడానికి హాస్పిటల్ నుండి తప్పించుకొని పారిపోతారు. దాంతో ఆ ఊర్లో పెద్ద గొడవ జరుగుతుంది. అదే నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ఇలాంటి సమయంలో ఈ గొడవ తలనొప్పిగా మారుతుంది. దాంతో హోమ్ మంత్రి బరిసెల జయరామ్ (మురళీ శర్మ)ను రంగంలోకి దించుతుంది. జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించుకోవడానికి పారిపోయిన నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి చెప్పి ఆ గొడవను సద్దుమనిగేలా చేస్తూ వారి ఓటు బ్యాంకును ఆయుధంగా మార్చుకోవడానికి ప్లాన్ చేస్తాడు . దీంతో యాక్సిడెంట్ కాస్త రాజకీయ సమస్యగా మారుతుంది.

మరో వైపు హోంమంత్రి ఆదేశాల మేరకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు పారిపోయిన ముగ్గురిని పట్టుకునే బాధ్యత అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది ?రామకృష్ణ ను పట్టుకోవడానికి రజియా ఆలీ ఎలాంటి ప్లాన్ వేసింది? ఆ ప్లాన్ నుండి తప్పించుకోవడానికి రామకృష్ణ ఎలాంటి పై ఎత్తులు వేశాడు. ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరికి వారు నిర్దోషులు గా నిరూపించుకున్నారా లేదా? అనేది తెలుసుకోవాలి అంటే “కోట బొమ్మాళి PS” సినిమా కచ్చితంగా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు

కోట బొమ్మాళి పీఎస్’లో ఏ. యస్. ఐ చింతాడి రామకృష్ణ పాత్రలో నటించిన శ్రీకాంత్ తన సహజమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. .క్లైమాక్స్ లో ఒక తండ్రిగా కూతురి పై తనకున్న ప్రేమను వివరించే సన్నివేశాల్లో ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. రామకృష్ణ ను పట్టుకొనే పోలీస్ ఆఫీసర్ గా రజియా ఆలీ (వరలక్ష్మి శరత్ కుమార్) పాత్రలో చాలా చక్కగా నటించింది ఇలాంటి పాత్రలు .తమిళంలో ఎక్కువ చేసినా కానీ.. తెలుగులో మాత్రం ఫస్ట్ టైమ్ నటించి మెప్పించింది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కథపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించింది.తెరపై శ్రీకాంత్, వరలక్ష్మి ల నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.రవి (రాహుల్ విజయ్), మల్లేటి కుమారి (శివాని రాజశేఖర్) లు హీరో హీరోయిన్లలా కాకుండా కేవలం పాత్రల్లో ఒదిగిపోయారు. పొలిటికల్ లీడర్ గా మురళీ శర్మ మరోసారి తన మేనరిజం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ప్రవీణ్, బెనర్జీ, సీవీఎల్ నరసింహారావు, దయానంద్, పవన్ తేజ్ కొణిదెల తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.  

సాంకేతిక నిపుణుల పనితీరు
పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ గురించి తెలిపే కథను సెలెక్ట్ చేసుకొని పోలీసులను, చట్టాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు, వారి అధికారం కోసం అధికారులను, ముఖ్యంగా పోలీసులను ఎలా పావుగా వాడుకుంటారనే దానికి ఈ మూవీ నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ సినిమా ఆద్యంతం రేసీగా సాగుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పడే పాట్లు, ఎలక్షన్ల సమయంలో పోలీసులు పడే పాట్లని అలాగే ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గాల కోసం రాజకీయ పార్టీలు వేసే ఎరలు ఎలా ఉంటాయానే ఆసక్తికర సన్నివేషాలతో పాటు ఏ పార్టీకి సంబంధం ఉండకుండా దర్శకుడు తేజ మార్ని చాలా రియలిస్టిక్‌గా తీయడంతో సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ అయినా యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాలో క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్ చేసేలా సినిమా ఉంటుంది. సంగీత దర్శకులు :రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ అందించిన సంగీతం బాగుంది రపై లింగిడి లింగిడి పాటకు ప్రేక్షకులలో మంచి ఊపు తెప్పుస్తుంది. కథకు తగ్గట్టు బ్యాగ్రౌండ్ స్కోర్ సరిపోయింది.సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకాటి తీసిన అందమైన లొకేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా.. ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ‘కోట బొమ్మాళి PS ” సినిమా ను ఫ్యామిలీ తో కలసి హాయిగా చూసి ఎంజాయ్ చేయచ్చని కచ్చితంగా చెప్పచ్చు..

Cinemarangam.Com Review Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here