Engaging Time Travel Entertainer ‘Banaras’ Review

Cinemarangam.Com
సినిమా : “బనారస్”
రివ్యూ రేటింగ్ : 2.5/5
విడుదల : 4.11.22
బ్యానర్: ఎన్ కె ప్రొడక్షన్స్
నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
రచన,  దర్శకత్వం: జయతీర్థ
తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: అద్వైత గురుమూర్తి
యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ
డైలాగ్స్: రఘు నిడువల్లి
లిరిక్స్ : డా.వి.నాగేంద్రప్రసాద్
ఎడిటర్: కె ఎం ప్రకాష్
ఆర్ట్: అరుణ్ సాగర్, శీను
కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ హర్ష
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి రెడ్డి

ఎన్ కె ప్రొడక్షన్స్ పతాకంపై జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ . త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా రిలీజ్ కానుంది.  జ‌య‌తీర్థ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి తిల‌క్‌రాజ్ బ‌ల్లాల్ నిర్మాత‌. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 4 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అయిన చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండీ.

కథ
సిద్దు (జైద్ ఖాన్ ) ఒక పెద్దింటి అబ్బాయి. తన ఫ్రెండ్స్ హ్యాపీ గా పార్టీలు చేసుకుంటూ, బెట్టింగ్ లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు తన ఫ్రెండ్స్ డీసెంట్ గా అమాయకంగా ఉండే ధని (సోనాల్ మోంటెరో) ను చూపించి ఆ అమ్మాయిని లవ్ లో దింపి తన బెడ్ రూమ్ లో తన బెడ్ పై కలసి ఉన్న ఫోటో తీసుకురమ్మని ఛాలెంజ్ చేస్తారు.ఆ తరువాత దని తన ఫ్రెండ్ తో ఉన్నపుడు దని తో మాట్లాడాలి దని తో ఉన్న అబ్బాయిని పక్కకు వెళ్ళమని చెప్పి. హీరోయిన్ ధనితో నా పేరు సిద్ధు. నేనొక ఆస్ట్రోనాట్. ఐయామ్ ఎ టైమ్, ట్రావెలర్ అండ్ ఐ హేవ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్” అని చెపుతాడు.అలాగే నీతో ఉన్న అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు తను మంచి వాడు కాదు అని చెపుతూ ధని సంబందించిన అన్ని విషయాలు చెప్పి ఆక్షర్యానికి గురి చేస్తాడు. అలాగే ఫ్యూచర్ లో నేను నువ్వు ప్రేమించుకోబోతున్నాము, అలాగే పెళ్లి కూడా చేసుకొంటాము కాబట్టి ”నేను నీ ఫ్యూచర్ భర్త’ని అని నమ్మేలా చెప్పి రేపు ఎక్కడ కలవాలో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత రోజు కలసిన ధని తో టైమ్ ట్రావెల్ నుండి వచ్చాను అక్కడ కరెన్సీ ఇక్కడ చెల్లదు కనుక నా దగ్గర బంగారు కాయిన్స్ ఉన్నాయి వాటితో ఇక్కడ కరెన్సీ మార్చి ఇవ్వు, అలాగే నాకు రూమ్ లేదని, నీ రూమ్ లో ఉంటానని కన్విన్స్ చేసి ధని రూమ్ కు వెళ్తాడు. ఆ రూమ్ లో ధని గాఢ నిద్రలో ఉన్నసమయంలో తనతో బెడ్ పై ఉన్న ఫోటో తీసి ఫ్రెండ్స్ కు షేర్ చేస్తాడు. దానిని తన ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఉదయం రూమ్ లో సిద్దు కనిపించడు. ఆ తరువాత షోషల్ మీడియాలో దని ఫోటో వైరల్ అవ్వడంతో తను చదువుకునే కాలేజ్, ఫ్రెండ్స్ అందరికీ తన ముఖం చూయించలేక వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత తన తండ్రికి జరిగిన ఒక సంఘటన గురించి సిద్దుతో చెప్పగా..తండ్రి మాటలకు రియలైజ్ సిద్దు తన ద్వారా ధని లైఫ్ స్పాయిల్ అయిందని ధని కి సారీ చెపుదామని వస్తే తను కనిపించదు. దాంతో తనని వెతుక్కుంటూ బనారస్ కు వస్తాడు.తనను వెతికే క్రమంలో ధని కి ఏ అబద్దం చెప్పి దగ్గరయ్యాడో ఆ టైమ్ ట్రావెల్ అనే లూప్ హోల్ లో సిద్దు నిజంగా చిక్కుకుంటాడు. అందులో తనకు ముందు జరగబోయే సంఘటనలు కనిపిస్తాయి. అందులో దని, వాళ్ళ పేరెంట్స్ ను ఎవరో చంపినట్టు ఇమాజినేషన్ చేసుకుంటాడు.ధని ని తన పేరెంట్స్ కు కాపాడాలను క్రమంలో అనేక సంఘటనలు జరుగుతాయి. వాటన్నిటినీ సిద్దు ఎలా ఎదుర్కొన్నాడు? ఆ టైమ్ ట్రావెల్ అనే లూప్ హోల్ లో నుండి సిద్దు బయట పడ్డాడా.. లేదా? దనిని, తన పేరెంట్స్ ను ఎలా కాపాడుకున్నాడా.. లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా బనారస్ సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
సిద్దుగా నటించిన జైద్ ఖాన్ కొత్తవాడైనా చక్కటి ఎక్స్‌ప్రెషన్స్,ఎమోషన్స్‌, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, . లతో చక్కటి నటనను కనబరచాడు.యాక్షన్ సీన్స్ ని చాలా ఈజ్ తో చేశాడు ఎన్నో సినిమాలు చేసిన నటుడులా తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయాడు. ధని (సోనాల్ మోంటెరో) అమాయకమైన సాధారణమైన మద్య తరగతి అమాయకమైన యువతిగా అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. సిద్దును ప్రేమించిన తరువాత తనపై చూపించే ప్రేమ, భావోద్వేగాల సన్నివేశాలలో చక్కగా నటించి యూత్ ను ఆకట్టుకుంది. జైద్ మరియు సోనాల్ మధ్య ప్రేమ సన్నివేషాలు బ్యూటీఫుల్ గా వున్నాయి. సిద్దు తండ్రి గా దేవరాజ్, దని పేరెంట్స్ గా నారాయణ్ శాస్త్రి (అచ్యుత్ కుమార్), స్వప్న రాజ్ లు వారి పాత్రలకు న్యాయం చేశారు.. ఫోటోగ్రాఫర్ మరియు ఆటో డ్రైవర్‌గా శంభో (సుజయ్ శాస్త్రి) భావోద్వేగమైన డైలాగ్స్ తో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు
జీవితం చాలా చిన్నది. అందరితో ప్రేమగా వుండి నలుగురికి సాయపడటమే జీవితం అని తెలియజేస్తూ..ఒక రొమాంటిక్ లవ్  స్టొరీ తో పాటు థ్రిల్లర్, టైం ట్రావెల్, టైం లూప్,  పునర్జన్మ  ఎలిమెంట్స్  వంటి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో కొత్త  అనుభూతి ని కల్పిస్తూ దర్శకుడు జయతీర్థ అద్భుతంగా తెరకెక్కించాడు. అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం ,పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు.ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన పార్టీ సాంగ్,బ్యూటీ ఫుల్ మెలోడి సాంగ్ మాయ గంగ, తొలితొలి వలపే సాంగ్స్ బాగున్నాయి. సింగర్స్ వెస్ట్రన్,  క్లాసిక్, ఫ్లోక్, డివైన్ ఇలా అన్ని   కోణాలు  వున్న సంగీతాన్ని అందించారు. మాయ గంగా పాట ను కె.కె. బ్యూటీఫుల్‌గా రాశాడు. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి బనారస్ అందాలను తెరపై చాలా అందంగా చూపించాడు. స్క్రీన్ ప్లే చాలా  వైవిధ్యంగా ఉంది కె ఎం ప్రకాష్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఎన్ కె ప్రొడక్షన్స్ పతాకంపై మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మాత తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన బనారస్‌ చిత్రంలో ’ మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉండేలా చాలా ఫ్రెష్ కంటెంట్ తో బానారస్ చిత్రాన్ని ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా ఒక వినూత్నమైన ప్రయోగం చేశారని చెప్పచ్చు .. పాన్ ఇండియా మూవీగా వచ్చిన “బనారస్” చిత్రం చిన్న, పెద్ద తేడా అనేది లేకుండా అన్ని వర్గాల వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com..Review Rating 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here