Every One Should Maintain Social Distance…AlluArjun

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.కరోనా ను నియంత్రించడానికి పాటిస్తున్న లాక్ డౌన్ వలన సినీ పరిశ్రమ స్తంభించింది.కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారలంతా ఇళ్ళకే పరిమితమై స్వీయ గృహ నిర్బంధంలో గడుపుతున్నారు. సినీ హీరో అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు  ఆయన నివాసంలో నిరాడంబరంగా జరిగాయి. కొద్దిమంది అభిమానులు మాత్రమే ఆయనను కలిసి భౌతికదూరాన్ని పాటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కొంత మంది అభిమానులు భౌతికదూరాన్ని పాటిస్తూనే సెల్ఫీలు దిగారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పాటు అల్లు అర్జున్‌ కూడా పోస్ట్‌ చేశారు.స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనా ని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here