F.N.C.C 25 lakhs contributing to Ts CM Relief Fund about Covid2019

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం కరోనా బాధితుల సహాయార్తం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సిసి) తరఫున ప్రెసిడెంట్ ఆదిశేషగిరి రావు, సెక్రటరీ కె.ఎస్.రామారావు మరియు ఎఫ్.ఎన్.సి.సి ఫౌండర్ మెంబర్ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహన్ రావు సంయుక్తంగా హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో మంత్రి కె.టి.ఆర్ ను కలిసి రూ.25లక్షల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వ సహాయ నిధికి అందించారు.

 ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని కోరారు. కుటుంబాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ పోలీసులు, వైద్య సిబ్బంది అలుప‌నేది లేకుండా ప్ర‌జ‌లకు సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. వాళ్ల శ్ర‌మ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాల‌నీ, అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌నీ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here