Love & Family Entertainer ‘Gundamma Katha’ Movie Review

సినిమారంగం.కామ్
రివ్యూ రేటింగ్ 2.5 /5
టైటిల్ : గుండమ్మ కథ
నటీనటులు : ఆదిత్య, ప్రణవ్య, గెటప్ శ్రీను, భాష, కనకదుర్గ, వేణుగోపాల్, శోభారాణి తదితరులు
నిర్మాణ సంస్థ : ఆదిత్య క్రియేషన్స్
డైరెక్టర్ : లక్ష్మి శ్రీవాత్సవ
సినిమాటోగ్రఫీ : మౌనిష్ భూపతిరాజు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మ్యూజిక్ : సతీష్ సాధన
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్

ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్ లో లక్ష్మి శ్రీవాత్సవ గారు ప్రొడ్యూస్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం “గుండమ్మ కథ” వాస్తవానికి ఈ సినిమా గత సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోణా కారణంగా విడుదల వాయిదా పడుతూ శుక్రవారం( అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది? ఆదిత్య శ్రీవాత్సవ, ప్రణవ్ హీరో హీరోయిన్లుగా నటించారు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్స్ ఈ చిత్రం పైన అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను గుండమ్మకథ ఎంత మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం

కథ
ఆదిత్య (ఆదిత్య) ఇంట్లో విషయాలు పట్టించుకోకుండా కాలేజీ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు. ఆదిత్య కు కాలేజ్ లో నిహారిక  (ప్రణవ్య) పరిచయమవుతుంది. ఆదిత్య కి అక్క అంజలి (లావణ్య) అంటే చాలా ఇష్టం. కొన్ని ఫ్యామిలీ గొడవల వల్ల గుండమ్మ (కనకదుర్గ) ఆస్తి మొత్తం అంజలి (లావణ్య) పేరు మీద  రాసేస్తుంది .అప్పటి నుంచి లావణ్య ని చంపడానికి ఆటాక్స్ జరుగుతుంటాయి. అసలు ఈ అటాక్స్ అన్ని ఎవరు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ? అనేది ఆదిత్య ఎలా కనిపెట్టాడు ? అనేది మిగతా కథ

నటీనటుల పనితీరు
ఆదిత్య, ప్రణవ్య వారి పాత్రలకు న్యాయం చేశారు.కనకదుర్గ గుండమ్మ పాత్రలో ఒదిగిపోయింది. తమ పరిధి మేర బాగా నటించి సినిమాకు గ్లామర్ తో పాటు ప్రేక్షకులకు మంచి నటనను కనబరచింది. అంజలి అక్క పాత్రలో తన నటనతో హావభావాలతో మెప్పించింది. గెటప్ శ్రీను, భాష, వేణుగోపాల్ నటించిన సన్నివేశాలు అన్నీ మెప్పిస్తాయి. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర నటించారు

సాంకేతిక నిపుణుల పనితీరు
టైటిల్ కు తగ్గట్టు గానే సినిమా అంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి చూసే సినిమా. లక్ష్మి శ్రీవాత్సవ గారికి డైరెక్షన్ పరంగా ఇది మొదటి సినిమా అయినా తనదైన మార్క్ వేశారు. కథతో పాటు ఆడియన్స్ ని నవ్విస్తూ స్క్రీన్ ప్లే ముందుకు నడిపించిన తీరు బాగుంది. ఇంట్లో జరిగే ఆటాక్స్ తర్వాత వచ్చే సన్నివేశాలు బాగా చూపించారు. మొదటి సన్నివేశంలో పాత్రలను పరిచయం చేయడానికి కొంత సమయం తీసుకున్నా.. ఆ తరువాత సినిమా వేగం పుంజుకుంటుంది. అన్నిటికంటే మెచ్చుకోవాల్సింది క్లైమాక్స్ సన్నివేశం .ఎక్కువగా లాగకుండా డైరెక్టర్ ప్రేక్షకుడికి ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. మౌనిష్ భూపతిరాజు కెమెరా పనితనం బాగుంది. సతీష్ సాధన ఇచ్చి ఆ పాటలు బాగున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు  ఖర్చుకు వెనకాడకుండా తీసిన నిర్మాణ విలువలు చాలా బాగా ఉన్నాయి ఫ్యామిలీ సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు బాగా నచ్చే ప్రేక్షకులకు గుండమ్మ కథ  తప్పక నచ్చుతుంది.

Cinemarangam.com Review Rating  2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here