Famous Movie star Sri Chandramohan , On behalf of old song lovers wishes to Happy Birthday

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

సుప్రసిద్ద తెలుగు నటుడు చంద్రమోహన్
జన్మ నామం
మల్లంపల్లి చంద్రశేఖర రావు
జననం
1945 మే 23 (వయస్సు 75)
పమిడిముక్కల, కృష్ణా జిల్లా, భారత్
భార్య/భర్త
జలంధర
పిల్లలు
ఇద్దరు కుమార్తెలు
క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. “ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు” అని సినీఅభిమానులు భావిస్తారు.

జీవిత సంగ్రహం 
చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. వీరు వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.

చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.

ఈయన భార్య పేరు జలంధర. ఈమె మంచి రచయిత్రి. కొన్ని కథా సంకలనాలను కూడా వెలువరించడం జరిగింది.

పురస్కారములు 
2005 : అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు.
నటించిన కొన్ని చిత్రాలు సవరించు
రంగులరాట్నం – 1966
సుఖదుఃఖాలు – 1967
బంగారు పిచ్చుక – 1968
ఆత్మీయులు – 1969
తల్లిదండ్రులు – 1970
పెళ్లి కూతురు – 1970
బొమ్మా బొరుసా – 1971
రామాలయం – 1971
కాలం మారింది – 1972
జీవన తరంగాలు – 1973
అల్లూరి సీతారామరాజు – 1974 – గోవిందు
ఓ సీత కథ – 1974
దేవదాసు – 1974
ఇల్లు – వాకిలి – 1975
కురుక్షేత్రం – 1977
ప్రాణం ఖరీదు – 1978
సిరిసిరిమువ్వ – 1978
సీతామాలక్ష్మి – 1978
పదహారేళ్ళ వయసు – 1978
ఒక చల్లని రాత్రి – 1979
తాయారమ్మ బంగారయ్య – 1979
దశ తిరిగింది – 1979
శంకరాభరణం – 1979
మామా అల్లుళ్ళ సవాల్ -1980
శుభోదయం – 1980
రాధా కళ్యాణం – 1981
రుద్రకాళి (1983)
మనిషికో చరిత్ర – 1984
ముగ్గురు మిత్రులు – 1985
చందమామ రావే – 1987
ఆస్తులు అంతస్తులు – 1988
అల్లుడుగారు – 1990
ఆదిత్య 369 – 1991
ఆమె – 1994
నిన్నే పెళ్ళాడతా – 1996
మన్మధుడు – 2002
ఫూల్స్ (2003)
వర్షం – 2004
నేనుసైతం (2004)
అతనొక్కడే – 2005
పౌర్ణమి – 2006
దాసన్నా (2010)
శంభో శివ శంభో (2010)
పంచాక్షరి
తూనీగ తూనీగ (2012)
జీనియస్ (2012)
బన్నీ అండ్ చెర్రీ (2013)
ఒక్కడినే (2013)
జేమ్స్ బాండ్ (2015)
మోసగాళ్లకు మోసగాడు (2015)
జెండాపై కపిరాజు (2015)[1]
2 కంట్రీస్ (2017)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here