Feel Good Comedy Entertainer ‘Appudu Ippudu’ Movie Review

Cinemarangam.com..Rating 3 /5
Banner: U.K Films
Cinema : Appudu – Ippudu
Cast: Sujan, Tanishq, Shivaji Raja, Srinivas Perupureddy, Madhavi, Zabardast Apparao etc. Cinematography: Kalyan Sami,
Art: Tagore,
Lyrics: Chiravuri Vijayakumar,
Editing: VVNV Suresh,
Music: Padmanav Bhardwaj,
Directed by: Chalapathi Puvvala.
Producers: Usharani Kanumuri, Vijay Rama Krishnam Raju,

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.  శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య  ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన `అప్పుడు-ఇప్పుడు`.చిత్రం ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ :

హీరో అర్జున్ ( సుజన్ ) చదువంటే ఇష్టం లేని కుర్రాడు… ఎంత చదువుకున్నా ఏమి ప్రయోజనం అంటూ  చలాకీతనంగా తిరిగే ఈ కుర్రాడు అంటే వాళ్ళ నాన్నని భయం .తను ఇద్దరు ఫ్రెండ్స్ ని వెనకేసుకొని అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ఓ పెద్ద సమస్యవల్ల రెండు ఊర్లుగా విడిపోయిన ఊరిలోకి వచ్చి చేరతాడు. ఈ క్రమంలో ఆ వురి నాయకుడు కూతురు ( తనిష్క్ ) ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఆ వూరు విడిపోవడానికి కారణం ఏమిటి? అసలు నాయకుల ముసుగులో ఉన్న రెండు గ్రామాల నాయకులూ చేస్తున్న మోసాన్ని కనిపెడతాడు .. ఈ క్రమంలో అతనికి ఎదురైనా సంఘటనలు ఏమిటి ? ప్రేమించిన అమ్మాయి ఇతనికి దక్కిందా లేదా ? లాంటి విషయాలు తెలుసు కోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు పనితీరు:
హీరోగా నటించిన సుజన్ కొత్తవాడైన చాలా చలాకీగా కనిపించాడు. మంచి ఎనర్జీ తో  నటన,డాన్స్, యాక్షన్ అన్ని అంశాలు చక్కగా చేసాడు. ఇక హీరోయిన్ తనీష్క్  అందం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో అటు ట్రెడిషనల్, ఇటు మోడరన్ డ్రెస్ లో కనబడి ప్రేక్షకుల మనసు దోచుకుందనే చెప్పాలి.అలాగే హీరో , హీరోయిన్స్ ల రొమాన్స్ సీన్స్ బాగా పండింది. మరియు నాటకాల ప్రాముఖ్యతను తెలియజేసే పాత్రలో నటించిన శివాజీరాజా తనకిచ్చిన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఇక మిగతా నటీనటులు శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు చలపతి పువ్వల ఓ సరికొత్త నేపథ్యంలో ఉన్న ప్రేమ కథను ఎంపిక చేసుకున్నా తాను అనుకున్న కథ, కథనాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. అలాగే డైలాగ్స్ అక్కడక్కడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో కామెడీ బాగా పండింది .ఫీల్ గుడ్ కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు పద్మనావ్ భరద్వాజ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి . ఇందులో వచ్చే రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ చాలా బాగుంది. ఈ సినిమాకు కళ్యాణ్ సమి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు .వి.వి.ఎన్.వి.సురేష్ ఎడిటింగ్ మరియు ఠాగూర్ ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత  ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు లు ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.కొత్త హీరోతో గ్రామీణ నేపథ్యంలో లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఓ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “అప్పుడు .. ఇప్పుడు”  చిత్రం ఎక్కడా బోరింగ్ లేకుండా ఫ్యామిలీతో  పాటు కలసి చూడవలసిన ఈ సినిమా  అందరికీ తప్పక నచ్చుతుంది.

Cinemarangam.com..Rating 3 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here