Feel-Good Family Entertainer ‘Ala Ninnu Cheri’ Movie Review

Cinemarangam.Com
Movie Name  : “‘Ala Ninnu Cheri’ ”
Release Date : November 10, 2023
Review Rating : 3 /5
Presenter: Kommalapati Sridhar
Banner: Viision Movie Makers
Producer: Kommalapati Sai Sudhakar
Ex-Producer: Karnati Rambabu
Story, Screenplay, Dialogues, Direction: Maresh Shivan
Cast: Dinesh Tej, Hebah Patel, Payal Radhakrishna, Shivakumar Ramachandravarapu, ‘Rangasthalam’ Mahesh and others.
DOP: I Andrew 
Music: Subhash Anand
Editor: Kotagiti Venkateshwara Rao
Art: Vithal
Lyrics: Chandrabose
Fights: King Solomon, Ramakrishna (RK)
Choreography: Bhanu
Costume Designer: Madasar Mohammed
Publicity Designer: Dhani Aelay
PRO: Sai Satish, Rambabu

ఫీల్ గుడ్ లవ్ కాన్సెప్ట్‌తో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పించగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాశారు.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నవంబర్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం పదండి.


కథ:
చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. మంచి దర్శకుడై… పేరు తెచ్చుకోవాలనే తపన ఉన్న యువకుడు. గణేష్ (దినేష్ తేజ్). అదేగ్రామానికి చెందిన దివ్య(పాయల్ రాధాకృష్ణ)అనే అమ్మాయి ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కెరీర్ లో స్థిరపడిన తరువాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటాడు గణేష్. ఇంతలో దివ్యకి తన మేనమామ (శత్రు)తో వివాహం అవుతుంది. మరి గణేష్ తాను అనుకున్నట్లుగా దర్శకుడిగా స్థిరపడినాడా? అందుకు సహకరించిన వారు ఎవరు? మేన మామను పెళ్లి చేసుకున్న దివ్య లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు
హీరోగా నటించిన దినేష్ తేజ్ దర్శకుడు కావాలనే తపన ఉన్న యువకుని పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్, డ్యాన్స్ ల విషయంలో చాలా కేర్ తీసుకుని చేశారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మెచ్యురిటీని చూపించారు. అతనికి జంటగా ఫస్ట్ హాఫ్ లో నటించిన పాయల్ కూడా హోమ్లీగానే కనిపిస్తూ… తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఎక్కడా ఒల్గారిటీ లేకుండా చక్కగా నటించింది. హెబ్బాపటేల్ పాత్ర కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సన్నివేశాల్లో కొంచెం హాట్ గా కనిపించి యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శత్రు పాత్ర కూడా పర్వాలేదు. ఇక విలన్ గా నటించిన వ్యక్తి కూడా బాగానే చేశారు. జబర్దస్థ్ మహేష్ టైలర్ గాను, సేల్స్ మేనేజర్ గానూ కనిపించారు. చమ్మక్ చంద్ర కాసేపు ఉన్నా నవ్వించారు. యాంకర్ ఝాన్సీ… హీరోయిన్ తల్లి పాత్రలో నటించి మెప్పించారు.


సాంకేతిక నిపుణులు పనితీరు
సినిమా మీద ప్యాసన్ ఉండే ఓ యువకుడు దర్శకుడు కావాలనే గోల్ ను నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ప్రేమించిన అమ్మాయిని కూడా ఎలా త్యాగం చేశాడనే కథను సందేశాత్మకంగా తెరమీద చూపించి సక్సెస్ అయ్యారు.దర్శకుడికిది మొదటి సినిమా అయినా ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమికుల మధ్య ఉండే బంధాన్ని చాలా భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు.ఇలాంటి కథలు ఈ మధ్య కాలంలో చాలా అరదుగానే వచ్చాయని చెప్పొచ్చు. అలాగే నటీనటుల నుండి చక్కని నటన రాబట్టుకున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అదనపు ఆకర్షణ. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పాటలు, యాక్షన్ సీన్స్ ను చాలా చక్కగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గానే ఉంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన నిర్మాణ విలువులు చాలా రిచ్ గా ఉన్నాయి. రొమాంటిక్ గా యూత్ కి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఉన్న ఈ సినిమా యూత్ ని బాగా కనెక్ట్ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలి అంటే ఓ క్లీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన “ఆలా నిన్ను చేరి” సినిమా ఈ దీపావళి కి ఫ్యామిలీ తో కలసి హాయిగా చూసి ఎంజాయ్ చేయచ్చని కచ్చితంగా చెప్పచ్చు..

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here