Feel-good family entertainer ‘Kalyanam Kamaneeyam’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : యువి కాన్సెప్ట్స్
సినిమా : “కళ్యాణం కమనీయం”
విడుదల తేదీ : 14.01.23
రివ్యూ రేటింగ్ : 3/5
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్,
రచన, దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.
నటీ, నటులు : సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంక‌ర్‌, దేవి ప్రసాద్, పవిత్ర నరేష్, రూపా లక్ష్మి, సత్యం రాజేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని,
ఎడిటర్ – సత్య జి,
సంగీతం – శ్రావణ్ భరద్వాజ్,
సాహిత్యం – కృష్ణ కాంత్,
కొరియోగ్రాఫర్స్ – యష్, విజయ్ పోలంకి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు,
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్,
లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్,
సహ నిర్మాత – అజయ్ కుమార్ రాజు
పీఆర్వో – జీఎస్కే మీడియా,

పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఇందులో ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కళ్యాణం కమనీయం” సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి


కథ:
చదువులో బెస్ట్ స్టూడెంట్ గా ఉన్న శివ (సంతోష్ శోభన్) కు ఉద్యోగం లేక తన తల్లిదండ్రుల (కేదార్ శంక‌ర్‌, రూపా లక్ష్మి ) డబ్బుతో తన బ్యాచిలర్ జీవితాన్ని ఆనందిస్తూ ఉంటాడు.అయితే ఓ సాఫ్ట్ వేర్ కంపీలో ఉద్యోగం చేసే శ్రుతి (ప్రియ భవానీ శంకర్)ను ప్రేమిస్తుంటాడు.శృతి తల్లి,దండ్రులు (దేవి ప్రసాద్, పవిత్ర నరేష్) లు శివతో వివాహం చేయాలని భావించి ఇరు పెద్దల అంగీకారంతో శివ, శృతి ల వివాహం చేస్తారు. పెళ్లి అయిన తరువాత శివ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా.. ఏదో ఒక కారణం చేత ఉద్యోగం రాదు. దాంతో శృతి అతనికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటుంది. అయితే అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో శృతి, శివను ఉద్యోగం చేయమని అడుగుతుంది. దాంతో శివ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని అబద్దం చెప్పి…క్యాబ్ డ్రైవర్ గా మారతాడు..అయితే శివ క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు మారల్సి వచ్చింది? దానికి గల కారణమేంటి? శృతి కోరుకున్న విధంగా శివ ఉద్యోగం సాధించుకున్నాడా లేదా? చివరకు వారి వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలు ఏమిటి? వారి వివాహ సంబంధాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది తెలుసుకోవాలి అంటే “కళ్యాణం కమనీయం” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
నేటిత‌రం యువ‌త మ‌నోభావాల‌ అద్దం పట్టే విధంగా నటించిన శివ (సంతోశ్ శోభ‌న్ ) తన పాత్ర‌లో ఒదిగిపోయాడు.భార్యగా మారిన ప్రియురాలిని ఎంతో ప్రేమగా చూసుకునే ప్రేమికుని పాత్రలో చక్కగా నటించారు.ప్రియా భ‌వానీ శంక‌ర్‌కు ఇది తెలుగులో మొదటి సినిమా అయినా ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌గా న‌టించింది. సంతోష్ శోభ‌న్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్ కెమిస్ట్రీ బాగా ప‌డింది.సప్తగిరి పాత్ర కొంచెం సేపే అయినా…పర్వాలేదు అనిపిస్తుంది. హీరోయిన్ తల్లిదండ్రులు దేవీ ప్రసాద్, పవిత్ర నరేష్, రూపా లక్ష్మి  చక్కగా నటించారు. హీరో తండ్రి పాత్ర వేసిన నటుడు కూడా బాగా చేశారు. సత్యం రాజేష్ నటన బాగుంది. ఇంకా ఇందులో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న వారు భార్యా,భర్తలుగా మారిన తరువాత కూడా ఎలాంటి రిలేషన్ లో ఉంచుతుందనేది చాలా భావోద్వేగంగా తెరమీద చూపిస్తూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల వారు ఎలా బిహేవ్ చేస్తారు, వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు తలెత్తాయి,అనే విషయాలను తెలియజేయడమే కాకుండా పెళ్లి బంధం గొప్ప‌త‌నాన్ని చాటిచెపుతూ ప్రేమ, న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడే క‌ళ్యాణం క‌మ‌నీయంగా ఉంటుంద‌నే సందేశంతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల చాలా చక్కగా తెరకెక్కించాడు .శ్రవ‌ణ్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. పాట‌లు బాగున్నాయి. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. సత్య జి ఎడిటింగ్ పనితీరు బాగుంది.యువి కాన్సెప్ట్ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎమోషన్ తో పాటు రియల్ లైఫ్ లో కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ లు సినిమాలో చాలా ఉన్నాయి.ఇగో సమస్యలు లేని ఒక భార్య భర్త మధ్య జరిగిన సంఘటనలు, వాటితో కూడిన సన్నివేశాలతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. పనిలేని భర్త శివ, ఉద్యోగానికెళ్ళే భార్య శృతి, ఇద్దరి మధ్య చుట్టూ ఉన్నవాళ్ళ మాటలు, అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్ళిందనేది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com   Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here