Film critics association condolences to BA Raju on his Sudden Demise

సీనియర్ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పీఆర్వో, నిర్మాత, సూపర్ హిట్ పత్రిక అధినేత బి. ఎ. రాజుగారి మృతిపట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపాన్ని ప్రకటిస్తోంది. రాజుగారు లేని లోటు తీరనిది. ముఖ్యంగా సినిమా జర్నలిస్టులు పెద్ద దిక్కును కోల్పోయారు. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. రాజుగారి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాము. సినిమా రంగంలో అందరికీ బీఏ రాజుగారు తలలో నాలుక లాంటి వ్యక్తి. అలాంటి బీఏ రాజుగారి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ సందర్భంగా ఆయనకు ఇదే మా నివాళి.

ఇట్లు
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here