Film industry & Politicians PM & CMs relief funds of TS and AP to fight aganist Coronavirus

‘‘క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) కార‌ణంగా  అంతర్జాతీయ విప‌త్తు ఏర్ప‌డింది.ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారత దేశం లో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది . ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా పై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలి.
దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు అది ఎంత చిన్న‌దైన కావ‌చ్చు,‘‘మనం  ఇది వరకు మనం చూడనటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నాం.
దాని కోసం మనం అందరం కలిసే ఉన్నాం. అలాగే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈరోజు అంద‌ర్నీ వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను మ‌న ఇళ్ల‌ల్లో మ‌నం ఉండి వ‌ణికించాలి.అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌నీ ప్ర‌జ‌ల‌ను కోరారు.ఇంట్లోనే ఉండండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి.. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది.కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం,  ప్రభుత్వాలకి, అండగా ఉండేందుకు ఇప్పటికే పలువురు.సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
తాజాగా కరోనా పై పోరాటానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4 కోట్ల రూపాయలు ప్ర‌క‌టించారు.పీ ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సి ఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.పవన్ కళ్యాణ్  ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. కోటి,ఆంధ్రప్రదేశ్ కు రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు ప్ర‌క‌టించారు..సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం  కోటి విరాళాన్ని మెగా స్టార్ చిరంజీవి ప్ర‌క‌టించారు
శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషన్ కెఐ వరప్రసాద్ రెడ్డి కోటి 116 రూపాయలు.కెఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహరెడ్డి తమ కంపెనీ తరుఫున కోటి రూపాయల చెక్కును సిఎంఆర్ఎఫ్ కు అందజేత.మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సిఎంఆర్ఎఫ్ కు రూ.5 కోట్ల విరాళం.హైదరాబాద్ కు చెందిన మీనాక్షి గ్రూప్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం.లారస్ ల్యాబ్స్ సిఇఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి తమ ల్యాబ్ తరుఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటన.అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ కు రూ.50 లక్షల చెక్కును సిఎంకు అందజేత.
యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నారు.మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌రోనా నిర్మూలనా చర్యలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షల రూపాయలను అందిస్తున్నాను.డైరెక్ట‌ర్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్  క‌రోనా నివార‌ణా చ‌ర్య‌ల కోసం రూ.20ల‌క్ష‌ల విరాళాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు  దిల్‌రాజు, శిరీష్ తెలిపారు.*కరోనాపై పోరాటానికి రూ.20 లక్షల విరాళం ప్రకటించిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ . తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చెరో 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని నితిన్ ప్ర‌క‌టించారు.
మైత్రీ మూవీ మేక‌ర్స్‌ క‌రోనాపై పోరాటానికి మ‌ద్ద‌తుగా రూ. 20 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాం. వీటిలో రూ.10 ల‌క్ష‌లు తెలంగాణ ప్ర‌భుత్వానికీ, రూ. 10 ల‌క్ష‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికీ అందిస్తున్నాం.  ప్ర‌ముఖ నిర్మాత, వైజ‌యంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5 ల‌క్ష‌లు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు.సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని’ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు.అనిల్ రావిపూడి  రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా మొత్తం రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధుల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు గురువారం ట్వీట్ చేశారు.సుప్రీమ్ హీరో సాయితేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి త‌న వంతుగా రూ.10 ల‌క్ష‌లువిరాళాన్ని ప్ర‌క‌టించారు.
ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్లు, డాన్స‌ర్లు, ఫైట‌ర్లు.. ఎవ‌రైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. వాళ్ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 ల‌క్ష‌ల చెక్కును మ‌నం సైతం కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్‌కు అంద‌జేస్తున్నాని వినాయ‌క్ తెలిపారు.నిజంగా ఎవ‌రికి అవ‌స‌ర‌మో వారు కాదంబ‌రి కిర‌ణ్ గారిని సంప్ర‌దించి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా” అని చెప్పారు.క‌రోనా పై పోరాటానికి యంగ్ హీరో సుధీర్ బాబు 2 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here