“First Show” Movie has completed thier first schedule

K.K.R సినీ ఎంటర్ టైనర్ బ్యానర్ పై కిరణ్ కుమార్ రఘుపతి నిర్మాత గా జగదీష్ కె.కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” ఫస్ట్ షో ” ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటివలే పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ కుమార్ రఘుపతి మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్ లో నటించి బెస్ట్ యాక్టర్ గా “సైమా” అవార్డ్ అందుకున్న సూర్య భరత్ చంద్ర ఈ చిత్రం తో హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరో కి జోడిగా ప్రియా దేశపాగ్ హీరోయిన్ గా నటిస్తోందన్నారు.

దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరం లో సినిమా రంగంలో హీరోగా ఎదగాలనుకునే కుర్రాడు పడే కష్టాలు. ఈ సమయంలో తనకు ఎదురుపడ్డ అమ్మాయి తో ప్రేమ ఆపై సమస్యలు. ఈ క్రమంలో తను అనుకున్న కల నెరవేరిందా!! లేదా! అనేది కదాంశం తో అద్భుతమైన కధనం తో ప్రేక్షకులను మెప్పించే విధంగా తెరకెక్కి స్తూన్నారు. ఈ చిత్రం లో మూడు ఫైట్స్. నాలుగు పాటలు ఉన్నాయి . పాటలను అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాము.ఈ చిత్రం యొక్కతదుపరి షెడ్యూల్ విజయనగరం. అరకు లలో షూటింగ్ జరిపి చిత్రాన్ని పూర్తి చేస్తామని.. తెలిపారు.

నటీనటులు:
హీరో: సూర్య భరత్ చంద్ర
హీరోయిన్: ప్రియా దేశపాగ్
రాఖీ, దశరథ్, సతీష్, రేణుక తదితరులు..

దర్శకుడు: జగదీష్ కెకె
నిర్మాత: కిరణ్ కుమార్ రఘుపతి
సహా నిర్మాతలు:శ్రీమతి బి.శారద,
వి.నర్సింహారావు
సంగీతం: వంశీ కాంత్ రేఖానా
కెమెరా: ఆర్.కె. నాయుడు
ఎడిటర్ : జె.కె
ప్రొడక్షన్ మేనేజర్ : ప్రకాష్ తుపాకుల
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here