Village Revenge Comedy Entertainer ‘Thurum Khanlu’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ :స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సినిమా : “ తురుమ్ ఖాన్ లు”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 08.09.2023
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్
నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ సింగం, శ్రీయాంక, బాస్కర్ కర్నాటి, లక్ష్మణా చారి.తదితరులు
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల,
సినేమోటోగ్రఫీర్: అంబటి చరణ్,
సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్.
ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్
మిక్సింగ్ : సంతోష్ కుమార్
ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి
ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్
సహా నిర్మాత: కే. కళ్యాణ్ రావు
పీఆర్ఓ: హరీష్, దినేష్


తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలంగాణ మట్టి కథలను, తెలంగాణ నేపథ్యంలో వస్తున్న పల్లె కథలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా “తురుమ్ ఖాన్ లు”.స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ సింగం, శ్రీయాంక నటీ నటులుగా శివకళ్యాణ్ దర్శకత్వంలో ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం “తురుమ్ ఖాన్ లు”..పల్లెటూరు రివెంజ్ కామె జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కింది. అన్ని కార్యక్రమాలు ముగించుకొని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 8వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ

తుపాకులగూడెం అనే ఒక విలేజ్ లో శంకర్ , విష్ణు, ఈశ్వర బ్రహ్మ అనే ముగ్గురు క్యారెక్టర్ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. శంకర్ (నిమ్మల శ్రీరామ్) ఆ ఊరిలో చిన్నపాటి పొలిటికల్ యూత్ లీడర్. కరోనా సమయంలో మరదలు లలిత ( ఐశర్య ఉల్లింగాల) ను పెళ్లి చేసుకోవాలనుకుని అన్ని సెట్ చేసుకుంటాడు. అదే ఊరికి చెందిన విరాజ్ బ్రహ్మ (దేవరాజ్ పాలమూర్) పట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌. 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. ఊరికి వచ్చిన బ్రహ్మం కు తనకు తప్ప అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయినని ప్రెస్టేట్ అవుతూ తన నోటి దూలతో అందరిని తిడుతూ ఉంటాడు. ఊర్లోకి వచ్చింది మొదలు తాగుడే పనిగా పెట్టుకుంటాడు.మరో వైపు ఒకే కాలేజ్ లో చదువుకుంటున్న విష్ణు( అవినాష్ చౌదర), పద్మ (పులి శీత )లు లవ్ చేసుకుంటుంటారు .అయితే పద్మను ఒక చిన్న అపార్థం వల్ల దూరం పెడతాడు.దాంతో నమ్మకం లేని చోట ప్రేమకు చోటు ఉండదు ఇక నీకు కనిపించను అని వెళ్ళిపోతుంది. తన తప్పు తెలుసుకొని పద్మకు దగ్గరవుదామని అనుకుంటున్న టైంలో లాక్ డౌన్ విధిస్తారు.అయితే పద్మతో కలపడానికి సాయం చేస్తానన్న స్వప్న విష్ణుపై ప్రేమను పెంచుకుంటుంది. మరో వైపు పెళ్ళికి అంతా సెట్ చేసుకున్న శంకర్ మరదలు లలితకు తాళి కట్టే సమయంలో పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు బ్రహ్మం. తన పెళ్లి ఆపిన బ్రహ్మం పై రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. భర్త చనిపోయినా స్ట్రెయిట్ ఫార్ఫర్డ్ గా ఉంటూ ఎవరికీ లొంగకుండా ఇద్దరు పిల్లలతో సంసారం చేస్తున్న భారతి(విజయ ) తో ఎఫైర్ పెట్టుకోవాలని చూస్తాడు బ్రహ్మం . తన పెళ్లి చెడగొట్టిన బ్రహ్మం ఎలా హ్యాపీ గా ఉంటావో చూస్తానని ప్రతి డానికి అడ్డుపడతాడు శంకర్. ఇలా రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లా గొడవపడుతూ ఒకర్ని ఒకరు ఏడిపించుకుంటుండే ముగ్గిరి కథే “తురమ్ ఖాన్”లు సినిమా. వీరు ముగ్గురు కూడా లలిత, భారతి, పద్మలని చేరుకునేందుకు ఆరాటపడుటుంటారు. అయితే శంకర్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.? దానికి కారణం ఎవరు.? విష్ణు, పద్మ కలిశారా.? స్వప్న స్టోరీ ఏంటి.? బ్రహ్మం, భారతి ఎఫైర్ ఎంత వరకు దారి తీసింది.? అసులు ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి.? చివరకు వీరందరూ కలుసుకున్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే “తురమ్ ఖాన్ లు” సినిమా తప్పక చూడాల్సిందే…


నటీ నటుల పనితీరు
పొలిటికల్ లీడర్ గా శంకర్ పాత్రలో నటించిన (శ్రీరామ్ నిమ్మల( చాలా మెచ్చూడ్ గా నటించారు. బ్రహ్మం పాత్రలో దేవరాజ్ పాలమూర్ జీవించేశాడు. అసలు ఆయన రియల్ గా కూడా ఇలానే ఉంటాడేమో అనేంత సహజంగా చేశాడు. విష్ణు పాత్రలో అవినాశ్ చౌదరి గా తన పాత్రకు న్యాయం చేశాడు. శంకర్ మరదలు గా లలిత పాత్రలో జబర్దస్థ్ ఐశర్య తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇక భారతి పాత్రలో నటించిన (విజయ) తన స్క్రీన్ స్పేస్ లో అలరించింది. ఎమోషనల్ గా చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. పద్మ పాత్రలో పులి సీత ఉన్నంతలో బాగా చేసింది.నటీనటులు అందరూ కొత్తవాళ్లే అయినా సినిమా చూస్తున్నంత సేపు వాళ్లతో ట్రావెల్ అవుతుంటాము. సినిమాలో ఇక షేట్ క్యారెక్టర్, బుగ్గ, ట్రాక్టర్ డ్రైవర్, అలాగే బ్రహ్మం తండ్రి పాత్ర చేసిన వారు కూడా మంచి నటనను కనబరిచారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
తెలంగాణ యాస, భాష, వ్యహారిక పదాలతో వినోద భరితమైన, ఎమోషనల్ ప్రేమ కథ తురుము ఖానులు. గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తుల తీరు తెన్నులు, భావోద్వేగాలను చక్కగా చూపించారు. తనకిది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో పరిణితితో.. సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. సినిమాలో స్టార్ క్యారెక్టర్ లేకపోయినా, అందరూ కొత్తవాళ్ళైనా సరే రెండున్నర గంటలసేపు ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేయడంలో డైరెక్టర్ శివ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమాకు ముఖ్యమైన బలం నేపధ్య సంగీతం. సిచువేషన్ కు తగ్గట్టుగానే పాటలు అద్భుతంగా ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్లను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడంలో నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ అఫ్ లో షార్ప్ గా పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి బొంతల సెకండ్ హాఫ్ లో తన కత్తెరకు ఇంకాస్త పదులు పెట్టి ఉంటే చాలా బాగుండేది. మొత్తానికి ఎడిటర్ గా తన పని అద్భుతంగా నిర్వర్తించారు అని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ అంబటి చరణ్ పల్లే నేపథ్యంలో సాగే కథను ఏ విధంగా చూపించాలో అదేవిధంగా చూపించి తన పనితనాన్ని కనబరిచారు. ఇక ఫైనల్ గా సినిమాను నిర్మించిన ఎండి ఆసిఫ్ జానీ తురుమ్ ఖాన్ లు తెరకెక్కించడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా, మంచి ప్రొడక్షన్ తో రూపొందించారు. ఇది చిన్న సినిమా అని ఎక్కడ అనిపించదు అంటే దానికి కారణం ప్రొడక్షన్ వ్యాల్యూస్ అని చెప్పవచ్చు.”తురుమ్ ఖాన్ లు “సినిమాను ఒక్కసారి చూస్తే రెండోసారి చూడకుండా ఉండలేరు అనేలా తెలంగాణ ఫ్లేవర్‌తో ఉన్న మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విలేజ్ నేటివిటి సినిమాలను ఇష్టపడే వారికి “తురుమ్ ఖాన్ లు ” సినిమా తప్పకుండా నచ్చుతుంది. గో & వాచ్

Cinemarangam.com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here