Full Out and Out Commercial Entertainer ‘Gangster Gangaraju’ Review

Cinemarangam.com
Review Rating 3.25/5
సినిమా : “గ్యాంగ్ స్టర్ గంగరాజు”
సమర్పణ : చదవలవాడ బ్రదర్స్
బ్యాన‌ర్‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
నిర్మాత‌:  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్
ద‌ర్శ‌క‌త్వం:  ఇషాన్ సూర్య‌
నటీ నటులు : లక్ష్, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో లక్ష్.’ వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. తాజాగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండ గా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “గ్యాంగ్‌స్టర్ గంగరాజు” చిత్రం ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
ఒక ఫిక్షనల్ టౌన్ అయిన దేవర లంక అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది.. ఎమ్మెల్యే శివారెడ్డి మరణంతో ఆయన అనుచరులైన సిద్దప్ప, నర్సారెడ్డి ఎమ్మెల్యే పదవి కోసం పాకులాడుతూ ఉంటారు. ఈ ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ ఆ ఊరిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకుంటున్న సమయంలోనే రైల్వే లో గ్యాంగ్ మెన్ గా పని చేస్తున్న గోపరాజు రమణ కొడుకు గంగరాజు అనే యువకుడు సిద్ధప్పను హత్య చేసి కొత్త గ్యాంగ్ స్టర్ గా అవతరిస్తాడు. అదే ఊరికి ఎస్.ఐ. గా వచ్చిన ఉమాదేవితో గంగరాజు ప్రేమలో పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ కు – పోలీస్ ఆఫీసర్ కు మధ్య ఏర్పడిన ప్రేమ బంధం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? తండ్రి సిద్దప్ప హత్యతో కొడుకు రుద్రప్ప ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? సిద్ధప్ప మరణం తర్వాత గ్యాంగ్ స్టర్ గంగరాజు నర్సారెడ్డికి ఎందుకు టార్గెట్ అయ్యాడు?బావ నర్సారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బావమరిది బసిరెడ్డి ఎలాంటి అరాచకాలు చేశాడు? అనేది తెలుసుకోవాలి అంటే థియేటర్ వెళ్లి సినిమా చూడవలసిందే…

నటీ నటుల పనితీరు
గంగరాజు (లక్ష్ )యాక్షన్ సన్నివేశాలే కాదు ఎంటర్ టైన్ మెంట్స్ సీన్స్ లలో కూడా బాగా చేయగలననిపించాడు. ఈ సినిమాతో తో తెలుగు తెరకు పరిచయమైన యస్ ఐ. ఉమాదేవి (వేదిక దత్) పోలీస్ గెటప్ లోను, చీరలోనూ బాగుంది. హీరో స్నేహితుడు గా నటించిన ఆత్రేయ రవితేజ నన్నిమాల ప్రేక్షకులను నవ్వించాడు . హీరో తండ్రిగా నటించిన గోపరాజు రమణ మీద చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ఈ మూవీకి అదనపు ఆకర్షణ. సీనియర్ నటి జయసుధ కొడుకు నిహార్ కపూర్ విలన్ పాత్రకు కరెక్ట్ సూటవ్వడమే కాకుండా టాలీవుడ్ కు సరికొత్త విలన్ దొరికాడు అనిపించేలా చాలా చక్కగా నటించాడు.ఇందులో ఉన్న నలుగురు విలన్స్ కూడా డిఫ్రెంట్ డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తూ చాలా చక్కగా నటించారు.శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్‌ దీప్, సమ్మెట గాంధీ, రాజేంద్ర, రాజేశ్వరీ నాయర్, సత్యకృష్ణ, అను మానస, లావణ్యరెడ్డి,అన్నపూర్ణమ్మ తదితరులు వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు ఇషాన్ సూర్యకు ఇది మొదటి సినిమానే అయినా
సాధారణ జీవితాన్ని గడిపే ఓ కుర్రాడు రాత్రికి రాత్రి గ్యాంగ్‌ స్టర్ గా మారిపోవడానికి బలమైన కారణాలే ఉండాలి అనే
చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని ఇందులో ఫాదర్, మదర్, సిస్టర్, లవర్ సెంటిమెంట్స్ ను జోడిస్తూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని లాజిక్స్ జోలికి పోకుండా హీరో క్యారెక్టర్ కు చక్కటి ఎలివేషన్ ఇచ్చాడు దర్శకుడు.అలాగే నటీనటుల నుండి చక్కని నటనను రాబట్టాడు.ఈ సినిమాలో సెంటిమెంట్ తో పాటు వినోదానికి తగిన చోటు కల్పించాడు. ఇందులోని పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి.నర్సిరెడ్డి చేసిన దారుణాలను గురించి విన్న ఎస్. ఐ. ఉమాదేవి చలించిపోయి దైర్యంగా నర్సిరెడ్డి పై పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టే సన్నివేశం వారి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు ఉద్వేగాన్ని, ఎమోషన్ ను కలిగిస్తాయి.క్లైమాక్స్ లో జరిగే ఫైట్స్ కు ప్రేక్షకులు విజిల్ విశేలా భారీ సెట్స్ లో హీరో, విలన్స్ చేసే ఫైట్స్ ప్రేక్షకులకు గూస్ బమ్స్ తెప్పిస్తాయి. కన్నా సినిమాటోగ్రఫీ, సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోరు అద్భుతంగా ఉంది.చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం హిస్తున్న ఈ చిత్రాన్ని చదవలవాడ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఖర్చుకు వెనుకాడకుండా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా “గ్యాంగ్ స్టర్ గంగరాజు” చిత్రాన్ని నిర్మించారు. మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే.. ఈ  సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “గ్యాంగ్ స్టర్ గంగరాజు” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.

Cinemarangam.com   Rating..3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here