Full out & out comedy thriller ‘Dochevarevaruraa’ Movie review

Cinemarangam.Com
సినిమా : “దోచేవారెవరురా”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 10.03.2023
బ్యానర్ : ఐ క్యూ క్రియేషన్స్
నిర్మాత : బొడ్డు కోటేశ్వరరావు
దర్శకత్వం : శివనాగేశ్వరరావు
నటి నటులు : ప్రణవచంద్ర ..మాళవిక సతీషన్ ..అజయ్ గోష్. ..ప్రణతి..బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. అతిధి పాత్రలలో కోట శ్రీనివాసరావు,తనికెళ్ళ భరణి, బెనర్జీ .
లైన్ ప్రొడ్యూసర్ : శ్యాం సన్
కెమెరా : గణేష్ ఆర్లి
మ్యూజిక్ : రోహిత్ వర్ధన్. కార్తీక్
సినిమాటోగ్రఫీ: ఆర్లి
ఎడిటర్: శివ వై ప్రసాద్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్


ఈ కథ మొత్తం డబ్బుకు సంబందించిన అంశం చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు.ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము.ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే “దోచేవారెవరురా” .IQ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణవచంద్ర, మాళవిక సతీషన్ అజయ్ గోష్. బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. నటీ నటులుగా బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి,.బెనర్జీ అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన టీజర్ కు, దర్శకులు సుకుమార్,అనిల్ రావి పూడి, విజయేంద్ర ప్రసాద్ లు విడుదల చేసిన పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11. న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ:
సిద్దు సీనియర్ (ప్రణవ చంద్ర) సిద్దు జూనియర్ (చైల్డ్ ఆర్టిస్ చక్రి) తమ జీవనోపాధి కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో సీనియర్ సిద్దు, లక్కీ (మాళవిక సతీషన్) ని తొలి చూపులోనే ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడడం, ఆపై ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే లక్కీ కి ఎదురైన పలు సమస్యలని పరిష్కరించేందుకు సిద్దు సహాయం చేస్తాడు. మధ్యలో విమల్ (అజయ్ ఘోష్) పీకే సత్తి (బిత్తిరి సత్తి)ని తన భార్య పార్వతి (ప్రణవి సాధనాల) ని హత్య చేయించేందుకు నియమిస్తాడు. అయితే పార్వతిని ఎందుకోసం విమల్ మర్డర్ చేయించాలనుకుంటాడు, మరి మధ్యలో సత్తి కి సిద్దు కి ఉన్న సంబంధం ఏమిటి, ఆపైన కథ ఏవిధంగా నడిచింది అనేవి తెలియాలి అంటే “దోచేవారెవరురా”.. మూవీ చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు

సిద్దు పాత్రలో నటించిన హీరో ప్రణవ చంద్ర చాలా చక్కటి నటనను కనబరచాడు , అలానే హీరోయిన్ మాళవిక సతీషన్ ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఎంతో ఆకట్టుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి యాక్టింగ్ తో పాటు అతడి డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మంచి కామెడీ ని పండిస్తుంది. ప్రణవి సాధనాల పాత్ర కూడా బాగుంది, సెకండ్ హాఫ్ లోని పలు సీన్స్ లో ఆమె పాత్ర మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇక మిగతా ఇతర పాత్రధారుల నటన కూడా బాగానే ఉంటుంది.


సాంకేతిక నిపుణుల పనితీరు
కొన్నేళ్ల క్రితం మనీ, సిసింద్రీ వంటి సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్న సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఎన్నో ఏళ్ళ విరామం తరువాత తాజాగా కామెడీ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చారు . నవతరనికి బాగా నచ్చే కథని తీసుకొని దానిని ఆసక్తికరంగా ముందుకు నడపడంలో శివ నాగేశ్వర రావు  సక్సెస్ అయ్యారనే చెప్పాలి.అలానే ఈ సినిమాలో విలన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన అజయ్ ఘోష్ ఈ మూవీలో హీరోగా కనిపించడంతో పాటు డ్యూయల్ రోల్ పోషించడం విశేషం.

సినిమా యొక్క సెకండ్ హాఫ్ లో ఆయన సీన్స్ బాగున్నాయి .ఆర్లి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది, అలానే కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది’ . రోహిత్ వర్ధన్ అందించిన రెండు సాంగ్స్ పర్వాలేదని పిస్తాయి. విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శివ వై ప్రసాద్ ఎడిటింగ్ పనితీరు బాగుంది.IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి, మొత్తంగా చూసుకుంటే దోచేవారెవరురా మూవీ కామెడీ సీన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఆడియన్స్ ని మెప్పించే ఈ చిత్రాన్ని కుటుంబం మొత్తం కూర్చొని చూడదగ్గ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here