Gore Mati (Rajput) Movie Lyrical Song launched by R Narayana Murthy

బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ ,కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషలలో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్),బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ) .ఈ చిత్రం పోస్టర్ అండ్ టీజర్ ను హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాత శ్రీ ఆర్ నారాయణ మూర్తి ,శ్రీ సర్దార్ పటేల్, నిర్మాత శ్రీ సురేష్ కొండేటి గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రం పోస్టర్, టీజర్ ను విడుదల చేశారు అనంతరం

దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ... ఈ చిత్రం ట్రైలర్ బావుంది. విడుదల చేసిన పాటలు కూడా చాలా బాగున్నాయి. రామ్ రామ్ అనే సాంగ్ వింటుంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతర గీతం భారతదేశాన్ని ఎలా ఏకం చేసిందో ఈ రాం రాం పాట బంజారాలను ఏకం చేసే చేస్తున్నట్లు ఉందీ పాట. భారతదేశంలో అనేక జాతులతో విభిన్న మతాలతో , భాషలతో ఉన్న మన భారతదేశంలో నేను బంజారాని అంటూ బంజారా యొక్క గొప్పతనం గురించి ఎలుగెత్తి చాటిన ఎంతో మంది మహనీయులు బంజారా జాతి కోసం పోరాడారు. బంజారాల గొప్ప తనాన్ని చాటి చెపుతూ బంజారాలో నిర్మించిన గోర్ మాటి చిత్రంలోని రాం రాం పాట అద్భుతంగా ఉంది. సిక్కులకు గురునానక్ ఎలాగో.. బంజారాలకు సేవాలాల్..మహమ్మద్ ఘోరీ తో డీ అంటే ఢీ అని తలపడి భారతదేశ అస్తిత్వాన్ని ,పౌరుషాన్ని నిలబెట్టిన రాణా పృథ్వి సింగ్ చౌహాన్ బంజారా .. శ్రీ వెంకటేశ్వర వైభవం సినిమాలో సాక్షాత్తూ వెంకటేశ్వరుని తో పాచికలు ఆడింది ఎవరో కాదు అదీరాం బాబా కూడా బంజారా.. బంజారాలు ఈ మధ్యకాలంలో అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు.బంజారా జాతి కోసం ఎందరో మహానుభావులు త్యాగం చేశారు. ప్రస్తుతం తెలుగులో తీస్తున్న బంజారా సినిమా సంస్కృతి, సంప్రదాయం గురించి తెలియజేస్తూ మేము ఎవరి కంటే కూడా తక్కువ కాదు అంటూ బంజారాలో మొదటగా చౌహాన్ తీసిన గోర్ జీవన్ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత రేఖా నాయక్ నాయకత్వంలో వస్తున్న బంజారలో గోర్ మాటి గా తెలుగులో రాజ్ పుత్ గా వస్తున్న ఈ సినిమాను ఇండియా లెవెల్ లో విడుదల చేసి సక్సెస్ సాధించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. బంజారా లో వచ్చిన గోర్ జీవన్ ఫంక్షన్ కు రావడం జరిగింది. మళ్లీ ఈరోజు బంజరలో వస్తున్న గోర్ మాటి, రాజ్ పుత్ రెండు భాషల్లో విడుదల అవుతున్న ఈ ఫంక్షన్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషల సినిమాల్లాగే ఈ బంజారా సినిమాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి. పాటలోనే బంజారా హిస్టరీ గురించి రాశి కంపోజ్ చేసి పాట రూపంలో అద్భుతంగా చెప్పడం జరిగింది.అదిరే అభి ఇందులో నటించడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో తెలుగు తెలుగు , తమిళ్ ,
మలయాళం సినిమాలు ఎలా విడుదల అవుతున్నాయో బంజారా సినిమాలు కూడా అలా విడుదల కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

జబర్దస్త్ అదిరే అభి మాట్లాడుతూ.. బంజారా లోతీసిన ఈ సినిమా ఎంతమందికి రీచ్ అవుతుందని నేను దర్శక నిర్మాతలను అడగడం జరిగింది. జనాలకి ఈ సినిమా రీచ్ అవుతుందా అని అడిగాను. మా బంజారా వారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు వారందరూ మా సినిమా చూస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు
ఆ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా తీశారు, మీరందరూ ఈ సినిమాను చూసి హిట్ చేస్తే..ఇంకొక పది సినిమాలు వస్తాయి . హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ లాగా బంజారా సినిమా కూడా ఉండాలి. ఈ సినిమా సరదా కోసం తీసిన సినిమా కాదు రైతుల ప్రాబ్లం గురించి ఒక సైంటిఫిక్ సొల్యూషన్ని ఇంక్లుడ్ చేసి తీసిన సినిమా ఇది.ఈ సినిమా అందరికీ ఉపయోగ పడుతుంది.. రామ్ రామ్ సాంగ్ చూస్తుంటే నాకు రెండు పాటలు గుర్తు వచ్చాయి. బాహుబలి లో బలి బలి బలి రా బలి అనే సాంగ్ వింటుంటే ఎలాంటి ఫీల్ కలుగుతుందో ఈ సాంగ్ వింటుంటే అలాంటి ఫీల్ కలుగుతుంది. మన తెలుగులో ఎన్టీఆర్ సాంగ్ పుణ్యభూమి నాదేశం నమో నమామి సాంగ్ ప్రతి స్కూల్ ఫంక్షన్ లోను, ఈవెంట్ లోనూ మా దేశభక్తిని చాటడానికి ఆ సాంగ్ ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు బంజారా లో జరిగే అన్ని ఈవెంట్లలో ప్లే చేసే రకంగా రామ్ రామ్ సాంగ్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శక, నిర్మాతలు ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. పాటలాగే ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన శంకర్ జాదవ్ మాట్లాడుతూ.. .సినిమా అనేది నా కళ, ఆ కళ నెరవేరడానికి 17సంవత్సరాలు పట్టింది. ఆ 17సంవత్సరాల కళ ఈ రోజు రేఖ్య నాయక్ అన్న తీసిన “గోర్ మాటి” సినిమాతో తీరింది. ఈ అన్నయ్య తో నేను గత కొన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను. మేమిద్దరం కలసి బంజారా బిగ్ ఛానెల్ పెట్టి యూట్యూబ్ లో ఎన్నో బంజారా షాట్ ఫిల్మ్స్ తీశాము. బంజారా బిగ్ ఛానెల్ నుండి నేడు బంజారా బిగ్ సినిమాస్ స్థాయికి ఎదిగాము. ఈ బ్యానర్ లో వస్తున్న గోర్ మాటి సినిమాతో ఆగిపోదు.బంజారాను స్థాయిని పెంచుతూ బంజారా జాతి గురించి తెలుపుతూ అందరి మెప్పు పొందేలా ఎన్నో సినిమాలు ఈ బ్యానర్ లో వస్తాయని అన్నారు. డైరెక్టర్, హీరో గా చేయడం అంటే అంత ఈజీ కాదు సినిమా టీమ్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అందరి సపోర్ట్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు..

నిర్మాత రేఖ్య నాయక్ మాట్లాడుతూ... ఈ సినిమాకోసం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. అలా హెల్ప్ చేసిన వారిలో ముఖ్యంగా మా తమ్ముడు రవి, చిన్నప్పటి నుండి కలిసే ఉన్నాము. నేనెంతో ఇబ్బందులు వున్నాయని పదవ తరగతి వరకు నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాడు. ఇలాంటి తమ్ముడు ప్రతి ఒక్కరికీ దొరికితే నాలాగా అందరూ పైకి వస్తారు. ఇలా చాలామంది నాకు తోబుట్టువుల్లా ఉండి హెల్ప్ చేశారు.వారందరి సపోర్ట్ తోనే నేనీ రోజు ఈ స్టేజ్ పై నిలుచున్నాను. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్, డి.ఓ.పి గోపి ,మ్యూజిక్ డైరెక్టర్ యమ్. యల్.రాజా,ఎడిటర్ క్రాంతి ఇలా చిత్ర యూనిట్ అందరూ కూడా ఏంతో డెడికేషన్ తో వర్క్ చేశారు . ఇందులో హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శంకర్ ని తమ్ముడు గా భావిస్తాను.ఒకే కడుపులో పుట్టకపోయినా దానికంటే మించి ఉన్నాము. శంకర్ లా డెడికేషన్ వర్క్ చేసే వారిని నేను ఇప్పటివరకు చూడలేదు.నా ఫేస్ రీడింగ్ చూసి నన్ను అర్థం చేసుకుంటాడు.అలాంటి తమ్ముడు ఈ సినిమా ద్వారా దొరికినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఈ సినిమా చాలా బాగా వచ్చింది మా సినిమాను అందరూ చూసి గొప్ప విజయం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో ఎంతో మంది పాల్గొని చిత్రం విజయం సాధించాలని తెలిపారు

నటీనటులు
శంకర్ జాదవ్ ,కరిష్మా ,అదిరే అభి, సిరి రాజ్ ,డాక్టర్ శివ శంకర, జబర్దస్త్ గడ్డం నవీన్ ,చిట్టి బాబు ,సునీత మనోహర్, మహేంద్ర ,సంపత్ నాయక్ ,శర్వన్ పెరుమాల్ ,చయాంక్,పురుషోత్తం రెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : బంజారా బిగ్ సినిమాస్
నిర్మాత : రేఖ్య నాయక్
దర్శకత్వం : శంకర్ జాదవ్
మ్యూజిక్ : ఎం యల్ రాజా
డీ ఓ పి : గోపి
ఎడిటర్ : క్రాంతి
విజువల్ ఎఫెక్ట్స్ : రాము అద్దంకి
లిరిక్స్ : ఎం శ్రీనివాస్
యాక్షన్ : దేవరాజ్
పి.ఆర్.ఓ : బాబు నాయక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here