Hanisika’s ‘105 Minuttess’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “105 మినిట్స్”
విడుదల తేదీ : 26.1.2024
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యానర్: రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్
ప్రొడ్యూసర్: బొమ్మక్ శివ
దర్శకత్వం : రాజు దుస్సా
నటీనటులు: హన్సిక
సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయిడపు
సంగీతం: సామ్ సీఎస్
పి.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, దీరజ్, ప్రసాద్ 


ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన హన్సిక… ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది. ఇటీవల మై నేమ్ ఈజ్ శ్రుతితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హన్సిక తాజాగా ఒకే క్యారెక్టర్ని సింగిల్ టేక్ కాన్సెప్ట్‌ తో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఎక్స్పరిమెంటల్ సినిమా “105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మించారు .ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్‌‌ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న గ్రాండ్‌గా .ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ:
ఇందులో ఫస్ట్ షాట్లోనే… ఓ దట్టమైన కారు చీకటిలో ఉన్న అడవిలో కారు డ్రైవ్ చేసుకొంటూ వెళ్లే అందమైన అమ్మాయి జాను(హన్సిక మోత్వానీ)…తో ఓ ఇంట్రెస్టింగ్ సీన్‌తో కథ మొదలవుతుంది.అయితే తను ఓ ఇంట్లో సింగిల్ గా జీవిస్తూ ఉంటుంది. అయితే ఆమెను ఓ విధమైన శక్తి వెంటాడుతూ ఉంటుంది. అదే శక్తి… జానుని బంధించి… చిత్ర హింసలకు గురి చేస్తూ ఉంటుంది. మరి ఆ శక్తి ఎవరు? ఎందుకు బంధించింది? ఆ నిర్భందం నుంచి జానుకి విముక్తి కలిగిందా? లేదా తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “105 మినిట్స్’ సినిమా చూడాల్సిందే…


నటీ నటుల పనితీరు
సింగిల్ ఆర్టిస్ట్… సింగిల్ టేక్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. సినిమాలో హన్సికది ఒక్క క్యారెక్టర్‌ ఉండటంతో సినిమా భారాన్నంత ఆమెనే మోసిందనే చెప్పాలి.అలాగే తన మార్క్ ఫెర్ఫార్మెన్స్‌ తో కొన్ని సీన్లను ప్రేక్షకుల్ని కుర్చీలో నుంచి కదలనీయకుండా చేసింది.సినిమా మొత్తం సింగిల్ ఎమోషన్ మీదనే ఉండడంతో ఆ ఎమోషన్‌ ను క్యారీ అయ్యేలా హన్సిక మెప్పించే ప్రయత్నం చేయడమే కాకుండా తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఇది ఒక ఎక్స్ పరిమెంటల్ మూవీ కథ…ఇలాంటి కథ… కథనాలతో హాలీవుడ్ మూవీస్ వస్తుంటాయి. కానీ తెలుగులో ఇలాంటి సినిమాలు రాలేదు. అయితే
కథనం బలంగా ఉంటే తెలుగు ఆడియన్స్ కూడా ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను పొందుతారని నమ్మి చిత్ర నిర్మాత, దర్శకులు ఎంతో దైర్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఒకే ఒక క్యారెక్టర్‌ చుట్టూ కొన్ని ఎమోషన్స్‌ తో అల్లుకొన్న కథ ఇది. ఈ పూర్తిగా ప్రయోగమనే చెప్పాలి. ఈ ప్రయోగంలో కథ, కథనాలు కాస్త రెగ్యులర్‌గా, రొటీన్‌గా ఉన్నా… ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా దర్శకుడు బాగా తెరకెక్కించాడు.ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.సస్పెన్స్, థ్రిల్లర్‌గా మారే ఈ సినిమాకు సామ్ సీఎస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు… కిషోర్ బోయిడపు సినిమాటోగ్రఫి బాగుంది. రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ పతాకంపై సంయుక్తంగా బొమ్మక శివ, సుమన్ లు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా పై ఉన్న ప్యాషన్ తో ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం “105 మినిట్స్” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com Review Rating .. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here