Harror, Thriller Rgv “Deyyam” Movie Review

Release date :-April 16,2021
Cinema rangam :- Rating 3.25/5
Movie Name :- “’Rgv Deyyam
Banner: Nuttis Entertainments, Pegasus Cine Corp.
Cast: Rajasekar, Swathi Dixit, Tanikella Bharani, Anita Chaudhary, Jeeva, Banerjee etc.
Music: DSR
Editor : Satya, Anwar
DOP : Satish Muthyala
P.R.O: – Madhu VR
Line Producers : Kommuri Premsagar, J Sai Karthik Goud
Producers: Jeevita Rajasekhar, Nutty Karuna, Nutty Kranti, Bogaram Venkata Srinivas
Directer: Ram Gopal Varma

కథ
శంకర్ (రాజశేఖర్),,అనితా చౌదరి (రాజశేఖర్ భార్య),
టీనేజ్ కూతురైన విజ్జి (స్వాతి దీక్షిత్) కాలేజ్ స్టూడెంట్. శంకర్ మెకానిక్ గ్యారేజ్‌ను నడుపు కుంటూ తన ఫ్యామిలీ తో సంతోషంగా ఉంటాడు. శంకర్ జీవితం సక్రమంగా సాగుతున్న సమయంలో 20 హత్యలు చేసిన సైకో గురు విజ్జి శరీరంలోకి ఆత్మగా ప్రవేశిస్తుంది. దాంతో శంకర్ కుటుంబంలో అలజడి, అశాంతి నెలకొంటుంది. ఈ క్రమంలో సైకో గురు తనను ఎన్ కౌంటర్ చేసి చంపిన రానా(బెనర్జీ) పోలీస్ ఆఫీసర్లు ఇంకా కొంతమందిని చంపకుండా వదిలిన వారిని విజ్జి శరీరంలో ఆవహించి పలు హత్యలకు పాల్పడుతుంటాడు.

విజ్జి శరీరంలోకి గురు ఆత్మ ఎందుకు ప్రవేశించింది. తన శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన తర్వాత విజ్జి చేసిన వీరంగం ఏమిటి? విజ్జి మానసిక పరిస్థితిని చూస్తూ శంకర్ అనుభవించిన మనోవేదన ఏమిటి? విజ్జి శరీరంలో చేరిన దెయ్యాన్ని బయటకు పంపించడానికి శంకర్ ఎలాంటి పాట్లు పడ్డాడు. చివరకు విజ్జి శరీరాన్ని దెయ్యం రూపంలో ఉన్న గురు వదిలాడా? విజ్జి రూపంలో ఉన్న దెయ్యం తన పగ, ప్రతీకారాన్ని ఎలా తీర్చుకొన్నది అని తెలుసుకోవాలంటే రాంగోపాల్ వర్మ తీసిన దెయ్యం కథ.చూడాల్సిందే..

నటీనటులు
శంకర్‌గా రాజశేఖర్ తన ఆ పాత్రలో అద్భుతమైన నటనను కనబరచి తన పాత్రకు న్యాయం చేశాడు. తాను అత్యంత ఇష్టంగా, ప్రేమించే కూతురుకు ఎదురైన సమస్యను చూసి పరితపించే పాత్రలో అద్బుతంగా నటించాడు. విజ్జీ గా స్వాతి దీక్షిత్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో తన హావభావాలతో ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.స్వాతి దీక్షిత్‌తో ఒకే ఎక్స్‌ప్రెషన్‌‌తో సినిమా అంతా నడిపించి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించిన తీరు అభినందనీయం.

సాంకేతిక విభాగం

ఇక దర్శకుడు రాంగోపాల్ వర్మ హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్‌ ఫీల్ అవుతారు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. దెయ్యం సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. లైటింగ్, ఎడిటింగ్ అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగించేలా చేశాయి.

హారర్, థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడేవారికి వారాంతంలో థియేటర్‌లో ఎంజాయ్ చేసే సినిమా దెయ్యం అని చెప్పవచ్చు. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగానే ఉన్నాయి. సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం స్థాయిలో ఉన్నాయి. కథ, కథనాల విషయంలో జాగ్రత పడి ఈ బ్యానర్‌లో ఓ మంచి చిత్రం తీశాడు. రాంగోపాల్ వర్మ సినిమాలను, హారర్, థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే వారికి దెయ్యం మూవీ తప్పకుండా నచ్చుతుంది.

           Cinema rangam.com  3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here