Heart-touching emotional entertainer ‘Ambajipet Marriage Band’ Review

Cinemarangam.Com
సినిమా : “”అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”
విడుదల తేదీ : 2nd February 2024
రివ్యూ రేటింగ్ : 3.25 /5
బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్,
దర్శకత్వం : దుశ్యంత్ కటికినేని
నటీనటులు: సుహాస్, శివాని, శరణ్య ప్రదీప్, జబర్దస్త్ ప్రతాప్ భండారి,నితిన్ ప్రసన్న,పుష్ఫ జగదీష్ గోపరాజు రమణ, తదితరులు
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్,
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్
పి.ఆర్.ఓ : జీఎస్ కే మీడియా


కులం, డబ్బు, హోదా, పరపతి, రివేంజ్ డ్రామా లాంటి పల్లెటూర్ బేస్డ్ కథలు గతంలో చాలా సినిమాలు చూశాం. కానీ…ఆత్మాభిమానం’ అనే కాన్సెప్ట్ తో వస్తున్న మొట్ట మొదటి ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”.కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి హిట్ చిత్రాలతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దుశ్యంత్ కటికినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ:
ఇది 2007లో జరిగే కథ.అంబాజీపేటలో తన కులవృత్తి చేసుకుంటూ ఎంతో ఆత్మాభిమానంతో జీవిస్తుంటుంది మల్లి కుటుంబం(సుహాస్). మల్లి అక్క పద్మ(శరణ్య ప్రదీప్) అదే ఊళ్లో స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో వెంకట్(నితిన్ ప్రసన్న) కొంచెం డబ్బు, పలుకుబడి, పరపతి ఉన్న గ్రామ మోతుబరి. ఆ గ్రామం లో ఉండే వారి ఫైనాన్సియల్ వీక్ నెస్ ని అడ్డుపెట్టుకొని వారి ఇళ్లు తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు డబ్బులిచ్చి… గ్రామంలోని పేదలను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటూ ఉంటారు. పద్మకి, వెంకట్ కి మధ్య అక్రమ సంబంధం ఉందనే ప్రచారం మాత్రం జరుగుతూ ఉంటుంది. వెంకట్ చెల్లెలు లక్ష్మీ(హీరోయిన్ శివాని)ని మల్లీ ఇష్టపడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే వీరిద్దరి మధ్య, కులం, డబ్బు, పరపతి అనే అంతరం ఉంటుంది. ఇలాంటి గ్రామంలో తను ఇష్టపడిన లక్ష్మీని మల్లి పెళ్లి చేసుకున్నాడా ? వెంకట్ కి, పద్మకి మధ్య అక్రమ సంబంధం ఉందనే జరిగే ప్రచారంలో నిజమెంత? దీనిని పద్మ ఎలా ఎదుర్కొంది? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
సుహాస్ ఎప్పటిలాగే తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ లో అబ్బాస్ కటింగ్ తో నటించిన మెప్పించిన మల్లి సెకండాఫ్ లో గుండుతో కనిపించి ఎమోషనల్ సీన్స్ లో నటించి ఆకట్టుకున్నాడు. పాటలకు స్టెప్పులు కూడా బాగా వేశారు. సుహాస్ అక్క పాత్రలో శరణ్య నటన అద్భుతంగా ఉంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆత్మాభిమానాన్ని గుండెల నిండా నింపుకున్న పద్మ పాత్రలో నటించిన ప్రతి సన్నివేశం హైలైట్ అనే చెప్పొచ్చు. డబ్బు, పరపతి ఉండే కొంత మంది… పేదలపై ఎలా పెత్తనం చేయాలని చూస్తారు, వారి ఆగడాలకు ఏమాత్రం తలొగ్గని పద్మ పాత్రను నెరేట్ చేసిన విధానం చాలా మంది అమ్మాయిలకు ఇన్స్పి రేషన్ ఇస్తుంది. హీరోయిన్ శివాని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతులు ఎలా ఉంటారో అలా చాలా క్యూట్ గా నటించింది. విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు నితిన్ ప్రసన్న తన రౌద్రంతో మెప్పించారు. అచ్చం గ్రామాల్లో  ఓ విలన్ ఎలా ఉంటారో దానికి కరెక్ట్ గా యాప్ట్ అయ్యారు. పుష్ఫ జగదీష్  ఉన్నంతలో చాలా బాగా నటించాడు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా రాసుకున్న దర్శకుడు దశ్యంత్ కు ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా …నిజాయితీగా ,తను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ను చక్కగా రాసుకొని వాటికి ఏమోషన్స్ సీన్స్ జోడించి తెరకేక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. ఆడదాని వెంట పడడం కాదు, వెంట ఉండడం మగతనం అనే మాటలు ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి.. శేఖర్ చంద్ర పాటలు, నేపద్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ అందించిన కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.కొదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉంది. ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమోషనల్ ఎంటర్టైనర్ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పచ్చు.

Cinemarangam.Com Review Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here