Hero Adith Arun interview about ‘DEAR MEGHA’

కథ”, “తుంగభద్ర”, “24 కిస్సెస్”, “11 అవర్” లాంటి చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు  అదిత్ అరుణ్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ”డియర్ మేఘ”. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అరుణ్ ఆదిత్ తన కెరీర్ తో పాటు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ….

మా నాన్న బ్యాంక్ ఎంప్లాయ్ నాకు రైటింగ్ అంటే ఎంతో ఇష్టం వున్నా కూడా నటుడు కావాలనే కోరిక మాత్రం నాలో ఉండేది. రైటింగ్ మీద పట్టు ఉండటం వల్ల జర్నలిజం లో సీటు వచ్చింది చెన్నైలో చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి పెరిగింది అప్పుడే నటన వైపు అడుగులు పడ్డాయి.2009లో కెరియర్ స్టార్ట్ చేసిన నేను నాటకాలు, లఘు చిత్రాల్లో నటించాను సినీ కుటుంబ నేపథ్యం లేకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను నటుడిగా వచ్చి ఈ 12 ఏళ్ల వెనక్కి తిరిగి  చూసుకుంటే మంచి స్థానంలో ఉన్నానని భావిస్తున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల జీవితంలో స్థిరపడితే చాలు అనుకున్నాను. నాతో పాటు కెరీర్ మొదలు పెట్టిన హీరోల్లో నాని ఒక్కడే ముందున్నాడు చాలా మంది కనుమరుగయ్యారు నేను ఆశించిన దానికన్నా ఎక్కువే దక్కింది కాబట్టి సంతృప్తిగా ఉంది.

దర్శకుడు సుశాంత్  నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు
మా మధ్య మంచి రిలేషన్ ఉంది.ఇద్దరం కలిసినప్పుడల్లా కథ గురించి మాట్లాడుకుంటాం.తను చేసిన సినిమా కూడా చూశాను.తరువాత బిజీ వల్ల కలవ లేకపోయాను. అయితే టూ ఇయర్స్ బ్యాక్ మళ్లీ నన్ను కలిసి నాకు ఒక కథ చెప్పాడు కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పటిదాకా తను చేయని జానర్లో సినిమా తీయాలని ఈ కథ రాశాడు. కథ విన్నప్పుడు నాకు ఆసక్తికరంగా అనిపించింది.నటుడిగా విభిన్న తరహా పాత్రలు పోషించాలి కుటుంబ ప్రేక్షకులను కూడా దగ్గరవ్వాలని డియర్ మేఘ చిత్రం అంగీకరించాను. ఇప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీ లో అబ్బాయి వైపు నుంచి కథ నడుస్తుంది దానికి భిన్నంగా ఒక యువతి  దృక్కోణం నుంచి సాగే ప్రేమకథ ఇది. హీరో హీరోయిన్ల ప్రేమ తల్లి పాత్ర లో ఉండే భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో షూట్ చేశాము ఆరు నెలల్లో సినిమా పూర్తి అయి ఈ రోజు “డియర్ మేఘ” గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మేఘ వారి మదర్ బిందు గారు నాకు ఇంతకుముందే తెలుసు ఆమె నాకు ఒక యాడ్ ఫిల్మ్ లో హీరో గా చేసే ఛాన్స్ ఇచ్చారు.వారి కూతురు మేఘ కాలేజ్ లో చదువు తున్నపుడే నేను,తను కలసి నటించాము.ఆమె చెప్పిన సమయం కంటే పది నిమిషాలు ముందే ఉంటారు నటన పరంగా మరింత మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తారు.అలా వారి ఫ్యామిలీ తో బాగా పరిచయం ఉంది.అయితే ఈ సినిమాకు నాకు ఫ్రెండ్ అయిన మేఘ హీరోయిన్ గా,నాకు  ఫ్రెండ్ అయిన ప్రశాంత్ డైరెక్టర్ గా అలా వారితో కలిసి ఈ సినిమాకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

డియర్ మేఘ టైటిల్ పెట్టేటప్పుడు మేఘ అని అమ్మాయి పేరు పెడతాము నీకు ఒకే నా అని అడిగాడు దర్శకుడు. అయితే నేను నాకు కథ ఇంపార్టెంట్ టైటిల్ కాదు అని చెప్పడం జరిగింది. అయితే హీరోయిన్ నీ పేరు మీద టైటిల్ పెట్టుకుంటావ్ ఏంటి అని అందరూ ఏడిపిస్తారు ఏమో అని మెఘా అన్నారు. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే లవ్ స్టోరీ కావడంతో ఈ టైటిల్ నచ్చి “డియర్ మేఘ” అనే టైటిల్ ఖరారు చేశాం.

నా 14 సినిమాలు  ఓటిటి లో రిలీజ్ అయ్యాయి. కానీ ఈ చిత్ర నిర్మాతలకు ఇది మొదట సినిమా కావడంతో సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా పరంగా  అయితే  థియేటర్లో రిలీజ్ చేస్తేనే మాలాంటి ఆర్టిస్టులకు మంచి పేరు వస్తుంది. సినిమా చూసిన వారందరూ కూడా ఆ సినిమా చాలా బాగుందని పాజిటివ్ టాక్ తో మాట్లాదుతుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.

నేను ఇప్పటి వరకు నేను గాఢమైన లవ్ స్టోరీస్ , డార్క్ క్యారెక్టర్లే పోషించాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కంటే ఇది పాజిటివ్ సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో నా క్యారెక్టర్ అదిరిపోద్ది. ఇది కొత్త తరహా ప్రేమ కథ ఇందులో ఆది అనే యువకుడిగా కనిపిస్తాను నా పాత్ర సరదాగా ఉంటుంది వాస్తవికతకు దగ్గరగా ఆలోచించే యువకుడిగా కనిపిస్తాను గౌర హరి మంచి సంగీతం ఇచ్చారు.

నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బహుబలి లాంటి పాత్రలు చేయాలని డ్రీమ్ ఉండేది. కానీ ఇప్పుడు మనకు వచ్చిన పాత్రలను అత్యుత్తమంగా పోషించాలని మాత్రమే అనుకుంటున్నాను మనకు ఇచ్చిన రోల్ ని మనం పర్ఫెక్ట్ గా చేస్తే చూసిన ప్రేక్షకులు కూడా చాలా బాగా చేశాడనే పేరు తెచ్చుకోవాలి. నటుడిగా  మంచి కథ నటనకు ఆస్కారం ఉన్న ఏలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. హీరోగా అయితేనే చేయాలని గిరి గీసుకోలేదు. ధనుష్ గారు అసురన్ సినిమాలో తన యాక్టింగ్ తో చించేశాడు. ఆయనకు ఆ పాత్ర అలా సెట్ అయింది ఆయన చేశారు మనకు ఆలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ఎలా కష్టపడి చేయాలి అనుకోని కష్టపడితే అదే మనకు మంచి పేరు తీసుకొస్తుంది

చీకటి గదిలో సినిమా ద్వారా అడల్ట్ కంటెంట్ ఆడియన్స్ కు మాత్రమే కనెక్ట్ అయ్యారు అంటున్నారు.కానీ మేము ఏ సినిమా కూడా మేము ఒక వర్గానికి సంబంధించిన ఆడియన్స్ కొరకు  సినిమా చేయము.నేను నటుడుని మాత్రమే  కథ డిమాండ్ చేస్తే  బిచ్చగాడు గా,ప్రెసిడెంట్ గా ఇలా ఏ పాత్ర ఇస్తే అది చేస్తాము.. మొదట్లో సినిమా ప్రభావం జయాపజయాల ప్రభావం కెరీరపైన పడుతుందేమో అని ఆందోళన ఉండేది. సినిమాలు ప్లాప్ అయితే చాలా బాధగా ఉండేది ఇంటికి వెళ్లిపోవాలని అనిపించేది . ఇప్పుడు పని ఒక్కటే మన చేతుల్లో ఉంది జయాపజయాలు మన చేతుల్లో లేదు అని అర్థమైంది.ఇపుడు వచ్చే డియర్ మేఘ తో నాకున్న ట్యాగ్ పోతుందనుకుంటున్నాను.అలాగే  నెక్స్ట్ వచ్చే W.W.W కూడా డీఫ్రెంట్ గా ఉంటుంది.

కొవిడ్ వల్ల రెండు నెలలు సినిమాలు ఆగిపోయాయి తమన్నా గారితో 11 అవర్ వెబ్ సిరీస్ లో చేశాను అది నన్ను ప్రేక్షకులకు కరోనా సమయంలో దగ్గర చేసింది .కరోనా సమయంలో కెరీర్ ను సమీక్షించడానికి వీలు చిక్కింది ఆలోచనల్లో పరిపక్వత వచ్చింది హీరో కూడా మామూలు మనిషే అని నేలమీదకు దింపి అర్థమయ్యేలా కరోనా చెప్పింది. ఇక్కడ ఎవరు ఏది శాశ్వతం కాదు అని అర్థమైంది ఒక సినిమా హిట్ అయిందంటే మనకు పరిశ్రమకు మేలు జరుగుతుందని విశాల దృక్పథం అలవడింది

నా కెరీర్లో గరుడవేగ తో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది 24 కిస్సెస్ ఐదు భాషల్లో డబ్ అయ్యింది. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంతో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాను నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన చిత్రం ఇది. దాని తర్వాత మరిన్ని మంచి చిత్రాలలో నటించే అవకాశాలు వస్తాయి.. ప్రస్తుతం డిఫరెంట్ జానర్ లలో చిత్రాలు చేస్తున్నాను  W.W.W(ఎవరు, ఎక్కడ, ఎందుకు) ,”కథ కంచికి మనం ఇంటికి”, అమలాపాల్ సొంత ప్రొడక్షన్ లో ఆమెతో కలిసి ఓ చిత్రంలో నటించాను ఇలా నేను నటించిన నాలుగు,ఐదు సినిమాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయి.”కథ కంచికి మనం ఇంటికీ” సినిమా ముందే బిజినెస్ అయిపోయింది. ఇది కమర్షియల్ గా నాకు మంచి పేరు తీసుకోస్తుందని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here