Hero Akkineni Nagachaitanya’s ‘Thank You’ Pre Release Event Grandly

నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మనం లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం “థ్యాంక్యూ”. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ ఈ నెల 22న విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ని స్టార్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్బంగా

హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ఎక్కువ లేయర్స్ ఉన్న ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. దర్శకుడు విక్రమ్ తో ఎన్నాళ్లుగానో ఇలాంటి ఒక మంచి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను.ఇందులో విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను.”థాంక్యూ” సినిమా ఒక అందమైన ప్రేమ కథ. ఇంత మంచి సినిమా చేసిన మా డైరెక్ట‌ర్ విక్ర‌మ్, నిర్మాత దిల్‌రాజుగారికి, రైట‌ర్ ర‌విగారికి థాంక్యూ చెబుతున్నాను. పి.సి.శ్రీరామ్‌ గారితో క‌లిసి ప‌ని చేయాల‌నేది నా డ్రీమ్‌. ఆది ఈ సినిమాతో తీరింది. ఈ సినిమా నా కెరీర్లో ఓ బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ నాగ చైతన్య నటించిన “థాంక్యూ” సినిమా గురించే మాట్లాడుకునేలా చాలా చక్కగా నటించాడు. ఈ సినిమా కు సినిమా టిక్కెట్ ధరలను తగ్గించలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. కరోనా తర్వాత ఎఫ్3 మూవీ టికెట్ ధరలు తగ్గించాము. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టికెట్లు అమ్మాము ఆ తర్వాత వచ్చిన మేజర్, విక్రమ్ సినిమాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కన్నా ఇంకా తగ్గించి అమ్మారు. ఇప్పుడు మేం కూడా “థాంక్యూ” సినిమాకు అదే ధర నిర్ణయించాం. మల్టీప్లెక్స్ లో 200 ప్లస్ జిఎస్టి, సింగిల్ స్క్రీన్లో 150 ప్లస్ జిఎస్టి ధర నిర్ణయించాం.ఏపీ లో జీవో ప్రకారం ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి.తెలంగాణ లో ధరలు మారుతూ ఉన్నాయి. ఇకమీదట వచ్చే చిన్న, మీడియం స్థాయి సినిమాలకు ఇంచుమించు ఇదే విధంగా టికెట్ ధరలు ఉంటాయి. త్వరలోనే నిర్మాతలు అందరూ సమావేశమై టికెట్ ధరల విషయంలో ఏకాభిప్రాయానికి వస్తాం. ఇక నాగచైతన్య “థాంక్యూ” సినిమాలో తన కెరీర్లో ఉత్తమ నటన కనబరిచాడు. విక్రమ్ కె.కుమార్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు అని తెలిపారు.

చిత్ర దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాగచైతన్య అద్భుతమైన నటన ప్రేక్షకులకు ఎంతగానో అలరిస్తుంది. మాళవిక తన నటనతో మైమరిపిస్తుంది. దిల్ రాజు వంటి మంచి నిర్మాత సహకారంతో ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించాము. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పి. సి శ్రీరామ్ తో నాకిది మూడవ సినిమా. ప్రతి ఫ్రెమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది. టీం అంతా బాగా సపోర్ట్ చేసింది అని అన్నారు

చిత్ర హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ. నాగచైతన్య గారితో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను చేసిన పార్వతి పాత్ర ప్రేక్షకులకు కచ్చింతంగా నచ్చుతుంది. దర్శకులు నాకిచ్చిన ఈ పాత్రకు న్యాయం చేశాను అనుకుంటాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

లెజండరీ సినిమాటోగ్రాఫర్  పి .సి. శ్రీరామ్ మాట్లాడుతూ.. నాగచైతన్య కెరీర్లో బెస్ట్ మూవీగా థాంక్యూ నిలుస్తుంది. ఈ నెల 22 న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ అందరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.అన్నారు

రచయిత బివిఎస్ రవి మాట్లాడుతూ.. ఒక పెయిన్ నుండి పుట్టిన ఈ కథ అందమైన జర్నీగా తెరపై కనిపించబోతుంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు ఈ నెల 22 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here