Hero Allari Naresh interview about.. Bangaru Bullodu

‘బెండు అప్పారావు RMP’ తరువాత మళ్ళీ తన మార్క్ కామెడీ సినిమాతో థియేటర్స్ లో ప్రేక్షకులను నవ్వించడానికి ‘బంగారు బుల్లోడు’ గా వస్తున్నాడు.  ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  జనవరి 23న విడుదలవుతున్న సందర్భంగా అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటించాడు ఆ విశేషాలు నరేష్ మాటల్లోనే….

బాలకృష్ణ గారు చేసిన  “బంగారు బుల్లోడు” సినిమా టైటిల్ నే పెట్టడానికి కారణమేంటి?

రాజమండ్రిలో జరిగిన ఓ గోల్డ్ స్కామ్ ను ఆధారంగా చేసుకొని ఆ ఇన్సిడెంట్ పేపర్ క్లిప్ చూసి డైరెక్టర్ గిరి గారు తన స్టైల్ లో ఈ కథను సిద్దం చేసుకొని పూర్తి ఎంటర్టైన్ మెంట్ సినిమాగా తీర్చిదిద్దారు.ఈ సినిమాలో నా రోల్ అంతా బంగారం లోన్స్ చుట్టూతానే తిరుగుతుంది.టైటిల్స్ గురించి చాల ఆప్షన్స్ ఉన్నా.. ఓ రోజు మా ప్రొడ్యూసర్ అనీల్ సుంకర గారు ఈ బంగారు బుల్లోడు అనే టైటిల్ ను సజెస్ట్ చేస్తే అందరికీ నచ్చి ఈ టైటిల్ పెట్టాము అంతే కానీ బాలకృష్ణ గారి సినిమా కు దీనికి అయితే ఎలాంటి సంబంధం ఉండదు.

గోల్డ్ స్మిత్ గా నటించడానికి కారణం?

ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర ఎవరు చేయలేదు.సినిమాలో గోల్డ్ తయారు చేసే గోల్డ్ స్మిత్ పాత్ర చేశాను. ఆ క్యారెక్టర్ కోసం కొంచెం హోమ్ వర్క్ చేశా. ఎందుకంటే ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి కానీ ఇది వరకు చేతులతోనే చేసేవారు. చేతితో చేసే చిన్న పనులు బాగా అబ్సర్వ్ చేసి నేర్చుకొని ఈ క్యారెక్టర్ చేశాను. నాకు తెలిసి ఏదైనా సినిమాలో జస్ట్ చిన్న ఎలిమెంట్ కోసం ఎవరైనా ఈ పాత్ర చేసి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో గోల్డ్ స్మిత్ పాత్ర చేసింది నేనే అనుకుంటున్నా.

చాలాకాలం తర్వాత విలేజ్ లో షూట్ చేయడం ఎలా అనిపించింది?

విలేజ్ కామెడీ సినిమా చేసి ఐదేళ్ళవుతుంది. మళ్ళీ ఈ సినిమా కోసం పల్లెటూర్లకు వెళ్ళడం జరిగింది. రాజోల్ , అంతర్వేది తో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిఊర్లల్లో షూట్ చేశాం. మళ్ళీ పల్లెటూరిలో షూట్ చేయడం నాకే కొత్తగా అనిపించింది. కచ్చితంగా  ఆడియన్స్ కూడా చాలా ఏళ్ల తర్వాత కంప్లీట్ విలేజ్ కామెడీ సినిమా చూస్తున్నామని ఫీలవుతారు.

ఈ సినిమా ఇంత లేట్ కావడానికి కారణం?

‘బంగారు బుల్లోడు’ సినిమా మధ్యలో ఉండగా ‘మహర్షి’ సినిమా ఆఫర్ వచ్చింది  మహర్షి సినిమాలో రవి క్యారెక్టర్ కోసం గెడ్డం పెంచాను. ఇందులో గెడ్డం ఉండదు.అందులోనూ పెద్ద సినిమా  దాని వల్ల బంగారు బుల్లోడు  ఆలస్యం అయ్యింది.అన్ని పనులు పూర్తి చేసుకొని  ఫైనల్ గా 2020 సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేద్దాం అనుకునే సరికి లాక్ డౌన్ వచ్చింది.అందుకే లేట్ అయ్యింది.

బాలకృష్ణ సాంగ్ ను రీమిక్స్ చెయ్యాలని ఎందుకు అనిపించింది?

ఈ సాంగ్ ఐడియా పూర్తిగా మా నిర్మాత అనీల్ సుంకర గారిదే.ఇందులో నేను చేసిన పాత్రతో పాటు కథకు కూడా ‘బంగారు బుల్లోడు’ అనే టైటిలే యాప్ట్ అనిపించింది.బంగారు బుల్లోడు అనగానే అందరికీ “స్వాతిలో ముత్యమంత”పాట గుర్తొస్తుంది.అందుకే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని  ‘స్వాతిలో ముత్యమంత’ రీమిక్స్ ను ఎక్కడ చెడగొట్టకుండా సినిమా మొత్తం అయ్యాక ఈ సాంగ్ ను చేసాం.సాయి కార్తీక్ తో నాకిది ఐదో సినిమా. ఈ సినిమాలో  సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది.

పి వి గిరి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

డైరెక్టర్ గిరి గారు ఈ సినిమా స్రిప్ట్ చెప్పిన విధానం కూడా నాకు బాగా నచ్చింది.ఆయన చాలా పట్టుదల గల దర్శకుడు.సెట్స్ కూడా వద్దని ఒరిజినల్ లోకేషన్స్ లోనే సినిమాను షూట్ చేశాడు. కథలో నేచురాలిటీ మిస్ అవ్వకుండా సినిమాను రూపొందించారు.నాన్న గారితో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ తో కామెడీ సన్నివేశాలను ఆయన స్టైల్ లో తీసే ప్రయత్నం చేసారు. అందుకే ట్రైలర్ చూస్తే అందరికి నాన్న గారితో నేను చేసిన పాత సినిమాలు గుర్తొస్తాయి.అందుకే ఈ సినిమాను బాగా డీల్ చేసారు.

నా కోసం స్క్రిప్ట్ రెడీ చేసాడు అనుకోలేదు

నాన్న గారి దగ్గర వర్క్ చేసిన డైరెక్టర్స్ ముందుగా ఒక ఫీడ్ బ్యాక్ కోసం నాకు కథలు చెప్తూ ఉంటారు. విజయ్ కూడా నాకు బాగా పరిచయం. ఒకరోజు కలిసి ‘నాంది’ అనే కథ చెప్పాడు.మొత్తం విన్నాక బాగుంది ఎవరితో చేస్తున్నావ్ అని అడిగా. మీతోనే అన్నాడు. జెనరల్ గా నాకు అందరు కామెడీ కథలు చెప్తారు నువ్వేంటి ఇలాంటి సీరియస్ కథ తీసుకోచ్చావ్ అని అడిగా.. లేదండీ ఇది మీరు చేస్తే మీతో పాటు ఆడియన్స్ కి కూడా కొత్తగా ఉంటుంది అన్నాడు.అలా నాంది కి నాంది పడింది.

చాలా కాలం తర్వాత  కామెడీ సినిమా చెయ్యడానికి కారణం?

  నేను కొన్ని కామెడీ సినిమాలు చేశాను కానీ చిన్న టౌన్స్ తరహావి చేశాను.కానీ నేను చేసిన  సినిమాల్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి.కామెడీ కథను పర్ఫెక్ట్ గా తీస్తే జనాలు ఎప్పుడు ఆదరిస్తారు.ఇప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారి , నరేష్ గారి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తాం. లేటెస్ట్ గా F2 ఎంత పెద్ద హిట్టయిందో కూడా చూసాం. ఒక విలేజ్ కామెడీ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.ఇకపై ఏడాదికి ఒక్క కామెడీ సినిమా అయినా చేస్తాను.

ప్రయోగాత్మక సినిమాలు చేస్తాను

ఇకపై నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా.నేను ఇక్కడ ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యేందుకే వచ్చాను .అందుకే ఇకపై ఎదాడిదికి మూడు సినిమాలు చేస్తే అందులో రెండు కామెడీ అయితే ఒకటి కచ్చితంగా నాంది లాంటి ప్రయోగాత్మక సినిమా చేస్తాను.అందులో చాలా కొత్తగా కనిపిస్తాను.అందుకే కంటెంట్ ఉన్న “నాంధి” లాంటి సినిమా చేశాను.

నాంది గురించి

నాంది సినిమా ఖచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది.ప్రస్తుతానికి  నాందికి సంబంధించి షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా అవుతున్నాయి.వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ మూవీ తరువాత మీరు చేస్తున్న సినిమాలు?

ప్రస్తుతం ‘బంగారు బుల్లోడు’ సినిమాతో పాటు నాంది రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా ప్రస్తుతానికి నాలుగు కథలు ఓకే చేశాను, అందులో ఇద్దరు కొత్త వాళ్ళతో సినిమాలు చేయబోతున్నాను. అలాగే నాంధి డైరెక్టర్ తోనే ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నా, ప్రస్తుతానికి అయితే నా దృష్టి అంతా ఈ సినిమా అలాగే నాంధి పైనే ఉన్నాయి. త్వరలోనే మీ ముందుకు మరిన్ని సినిమాలతో ఖచ్చితంగా వస్తాను.

లాక్ డౌన్ టైం లో ఎం చేశారు?

లాక్ డౌన్ లో చాలా సినిమాలు చూశాను. అందులో లూట్ కేస్  సినిమా బాగా నచ్చింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకొని. ప్రొడ్యూసర్ అనిల్ గారితో ఆ రీమేక్ గురించి డిస్కస్ చేశాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here